అవును బ్రిజ్ భూషణ్ అలాంటి వాడే

ఈ మద్య తరచూ వార్తల్లో వినిపించిన పేర్లలో WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేరు ఒకటి. ఇతడు కేవలం WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కి అధ్యక్షుడు మాత్రమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఇతడు ఎంపీ. అయినా కానీ ఇతడు తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కి చీఫ్ గా ఉంటూ రెజ్లర్లకు తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి […]

Share:

ఈ మద్య తరచూ వార్తల్లో వినిపించిన పేర్లలో WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేరు ఒకటి. ఇతడు కేవలం WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కి అధ్యక్షుడు మాత్రమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఇతడు ఎంపీ. అయినా కానీ ఇతడు తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కి చీఫ్ గా ఉంటూ రెజ్లర్లకు తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి వారితో వెకిలి వేషాలు వేశాడు. ఇక చాలా రోజుల నుంచి బ్రిజ్ భూషణ్ చేష్టలతో విసిగి పోయిన రెజ్లర్లు ఒక రోజు బ్రిజ్ భూషణ్ లీలలను బయట పెట్టారు. దీంతో అతడు మహిళా రెజ్లర్లతో ఎలా ప్రవర్తిస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి రెజ్లర్లు తమ పోరాటాన్ని కొనసాగించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న బ్రిజ్ భూషణ్ తప్పు చేశాడని నిరూపించేందుకు రెజ్లర్లు చాలా కష్టపడ్డారు. 

దీక్ష చేసిన రెజ్లర్లు

WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తప్పు చేశాడని తమను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా రెజ్లర్లు ఆరోపిస్తే వారి ఆరోపణలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. వారు ఎంత మొత్తుకున్నా కానీ పెద్దగా ఈ విషయం గురించి ఎవరూ కేర్ చేయలేదు. ఇలా అయితే లాభం లేదని అనుకున్న రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. ఇక వీరు దేశ రాజధానిలో దీక్ష చేయడంతో ప్రతి పక్ష పార్టీలు, మీడియా ఫోకస్ మొత్తం వీరి వైపు మళ్లింది. వీరు చేస్తున్న పోరాటం దేశం మొత్తానికి తెలిసివచ్చింది. ఇక చేసేదేం లేక బీజేపీ పార్టీ కూడా వీరి పోరాటాన్ని చూసి దిగి రావాల్సిన పరిస్థితి తలెత్తింది. 

ఎట్టకేలకు కేసు నమోదు…

ఇలా మహిళా రెజ్లర్లు చాలా రోజులు పోరాటం చేసిన తర్వాత వారికి దేశంలోని అనేక మంది రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో ఇక చేసేదేం లేక అధికార బీజేపీ పార్టీ కూడా తమ ఎంపీ విషయంలో వెనకడుగు వేసి ఈ ఘటనపై కేసు నమోదు చేసేలా పోలీసులకు అంతర్గత ఆదేశాలిచ్చింది. ఇక ఈ ఘటన మీద కేసును నమోదు చేసిన పోలీసులు ఆరోపణలు చేస్తున్న రెజ్లర్ల వద్ద నుంచి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇక ఈ స్టేట్ మెంట్లలో కూడా రెజ్లర్లు WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్ మీద ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేశారు. వారు ఎప్పటికప్పుడు దర్యాప్తు చేసుకుంటూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు తమ నివేదికలను అందిస్తూ వచ్చారు. 

అవును నిజమే.. బ్రిజ్ అలానే చేశాడు…

ఇక ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ విషయంలో కోర్టుకు సంచలన విషయాలు చెప్పారు. WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏ చిన్న అవకాశం దొరికినా కానీ మహిళలను లైంగికంగా వేధించేందుకు ఉపయోగించుకునేవాడని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ తన వాదనలు వినిపించాడు. WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్ శరణ్ సింగ్‌ పై అభియోగాలు మోపడానికి మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని ఆయన కోర్టుకు వివరించారు. 

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) కింద రాతపూర్వక ఫిర్యాదు మరియు సెక్షన్ 161, మరియు 164 కింద రెండు రికార్డ్ చేసిన వాంగ్మూలాలు పోలీసుల వద్ద ఉన్నాయని అతడు కోర్టుకు తెలిపాడు. విచారణ సందర్భంగా అతుల్ శ్రీ వాస్తవ మునుపటి తీర్పును ప్రస్తావించారు. ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని కాబట్టి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఇక బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది రాజీవ్ మోహన్ వాదిస్తూ అనుమతి పొందితే తప్ప దేశం వెలుపల జరిగిన నేరాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఢిల్లీ కోర్టుకు లేదని వాదించారు. ఆయన గతంలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.