కడప జిల్లాలో దారుణం

ఒక చిన్న పిల్లవాడు క్రికెట్ ఆడుకోడానికి వెళ్లి పాపం విద్యుత్ షాక్ కి బలైపోయిన దుర్ఘటన కడపలో వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బాలు కోసం రేకుల షెడ్డు మీదకి వెళ్ళిన పిల్లవాడు చెయ్యి కరెంటు తీగకు తగిలి కరెంటు షాక్ కారణంగా అక్కడికక్కడ మృతి చెందాడు. విష‌యం తెలిసి పిల్లాడి తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. అసలు విషయం:  కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లెలో ఆదివారం క్రికెట్ ఆడుతూ విద్యుదాఘాతానికి గురై 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. […]

Share:

ఒక చిన్న పిల్లవాడు క్రికెట్ ఆడుకోడానికి వెళ్లి పాపం విద్యుత్ షాక్ కి బలైపోయిన దుర్ఘటన కడపలో వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బాలు కోసం రేకుల షెడ్డు మీదకి వెళ్ళిన పిల్లవాడు చెయ్యి కరెంటు తీగకు తగిలి కరెంటు షాక్ కారణంగా అక్కడికక్కడ మృతి చెందాడు. విష‌యం తెలిసి పిల్లాడి తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

అసలు విషయం: 

కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లెలో ఆదివారం క్రికెట్ ఆడుతూ విద్యుదాఘాతానికి గురై 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. షెడ్డుపై పడిన బంతిని వెలికి తీసేందుకు బాలుడు వెళ్లాడు. రేకుల షెడ్డు పైకప్పు మీద పడిన బాలుని తీసేందుకు వెళ్ళగా, అక్కడ రేకులు షెడ్డు దగ్గరలో ఉన్న ఒక విద్యుత్ వైర్ ఆ బాలుడి చేతికి తగలగానే వెంటనే షాక్ కి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఉత్తరప్రదేశ్లో ఇదే తరహాలో మరో బాలుడు మృతి: 

ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఒక 12 ఏళ్ల బాలుడు తన ఇంట్లో ఆడుకుంటూ ఉండగా అనుకోని సంఘటన జరిగింది. అయితే ఇంట్లోనే ఆడుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న కూలర్ పక్కగా వెళ్లగా కూలర్ అప్పటికే ఆన్ లో ఉండటంతో, తన చెయ్యి కూలర్ కి తగిలిన వెంటనే ఆ పిల్లవాడికి షాక్ తగిలింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే షాక్ కొట్టిన అనంతరం పిల్లవాడు చనిపోయినట్లు హాస్పిటల్ వాడు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

పిల్లల విషయంలో చాలా జాగ్రత్త: 

పిల్లల విషయంలో తమ తల్లిదండ్రులు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా పాటించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు వారు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారు, గమనిస్తూ ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ బాక్స్, టీవీ వైర్, ఫ్రిడ్జ్, కూలర్ ఇలా ఏ వస్తువు అయినా సరే.. మనం సర్వీస్ చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. లేదంటే, ఎలాంటి దుర్ఘటనలు సంభవిస్తాయో చెప్పడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. దొంగల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి.. దొంగతనం జరగకుండా ఎలా వారిని రక్షించుకోవాలి, పోలీసులకు సమాచారం ఎలా అందించాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవన్నీ చెప్పాలి. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తమ పిల్లలు చెప్పాలి. కుక్కలు తిరుగుతూ ఉన్న సమయంలో కూడా వాటి దగ్గరికి వెళ్లి అల్లరి చేయకూడదు అని, కుక్కలు కొరవడానికి వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా వాళ్లకి తెలియని చిన్న చిన్న విషయాలు తల్లితండ్రులు నేర్పించడం ద్వారా పిల్లల్లో అవగాహన పెరుగుతుంది.

పిల్లలకు చదువు విషయంలోనే కాకుండా ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం వల్ల చిన్న పిల్లలు ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏమి జరగకుండా అలర్ట్ గా ఉండడం నేర్చుకుంటారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలుసుకుంటారు. స్కూల్లో ఇలాంటి జాగ్రత్తలు చెప్పినప్పటికీ తల్లిదండ్రులుగా మనం కూడా ఇంట్లో జాగ్రత్తలు చెప్పడం తప్పనిసరి.