బోల్తా పడిన కేరళ రేసింగ్ పడవ

కేరళలో ఘోర ప్రమాదం నెలకొంది. కేరళలో జరుగుతున్న పడవ పోటీలలో 25 మంది మహిళలతో ఉన్న పడవ బోల్తా పడింది. అయితే ప్రాణాలతో 25 మంది మహిళలను కాపాడటం జరిగింది. దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్పించినట్లు సమాచారం. కేరళలో ప్రమాదం:  ప్రతి ఎటా కేరళాలో పడవ పోటీలు జరగడం సర్వసాధారణం. కేరళలోని అలప్పుజాలో సోమవారం పడవ పోటీల సందర్భంగా పోటీలో పాల్గొన్న ఒక పడవ బోల్తా పడింది. పడవలో 25 మంది మహిళలు ఉన్నారు. అయితే స్థానికుల […]

Share:

కేరళలో ఘోర ప్రమాదం నెలకొంది. కేరళలో జరుగుతున్న పడవ పోటీలలో 25 మంది మహిళలతో ఉన్న పడవ బోల్తా పడింది. అయితే ప్రాణాలతో 25 మంది మహిళలను కాపాడటం జరిగింది. దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్పించినట్లు సమాచారం.

కేరళలో ప్రమాదం: 

ప్రతి ఎటా కేరళాలో పడవ పోటీలు జరగడం సర్వసాధారణం. కేరళలోని అలప్పుజాలో సోమవారం పడవ పోటీల సందర్భంగా పోటీలో పాల్గొన్న ఒక పడవ బోల్తా పడింది. పడవలో 25 మంది మహిళలు ఉన్నారు. అయితే స్థానికుల ద్వారా 25 మంది మహిళలను కాపాడటం జరిగింది. అందులో ఎవరికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు కనిపించలేదు. అయితే అందులో కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

కేరళలోని చంపకుళం మూలం వల్లం కాళి తీరప్రాంత జిల్లా అలప్పుజాలో ప్రారంభమైన పడవ పోటీలు సమయంలో ఈ సంఘటన జరిగింది. పంబా నదిలో బోట్ పోటీలు అనేది నిర్వహించారు. అప్పుడే, అప్పుడే 25 మంది మహిళలు ఉన్న బోటు బోల్తా పడినట్లు జిల్లా పరిపాలన అధికారి తెలిపారు. పడవ బోల్తా పడిన ఘటనలో కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో. వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారికి ప్రథమ చికిత్స అందించి అనంతరం డిశ్చార్జి చేశారు.

అలప్పుజా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొందరు ఇంటెన్స్వ్ కేర్ లో ఉన్నట్లు సమాచారం, కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం లేనట్లు అధికారులు తెలిపారు. 

ఎక్కువ అవుతున్న ప్రమాదాలు: 

ట్యూనీషియా,మధ్యదరా సముద్ర తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘోరమైన ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.ఇటలీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర ఆఫ్రికా నుండి మధ్యదర సముద్రం మీదుగా ఇటలీకి ప్రయాణమయ్యారు. అయితే ఇందులో సుమారు 23 మంది ఆఫ్రికకు సంబంధించిన చాలామంది గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. ట్యునీషియా నుంచి మధ్యధరా సముద్రం దాటి ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ప్రమాదం చోటుచేసుకునే, రెండు పడవలు మునిగిపోవడంతో నలుగురు అప్పుడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు ముగిసేసరికి ఈతరాణి చాలా మంది మరణించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. కోస్ట్‌ గార్డు మరో 53 మందిని రక్షించినట్లు తెలపగా, అందులో ఇప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఇటీవల కాలంలో తీరంలో ఇటువంటి పడవ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. అయితే పడవలో ప్రయాణించే చాలామంది వలసదారులే సముద్ర గర్భంలో కలిసిపోతున్నట్లు తేలింది. పడవ నడపడం ముఖ్యంగా సరిగ్గా రానివారు చేతికి ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. నిజానికి చాలామంది ఆఫ్రికా నుంచి పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రహస్యంగా ప్రయాణమైనప్పుడే ఈ పడవ ప్రయాణాలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కోస్ట్ గార్డ్లు చాలామంది పడవలను రహస్యంగా వెళ్లకుండా ఆపాలని కూడా తెలిపారు. అయితే ఈ ఏడాదిలో రహస్యంగా దాటుతున్న వారిలో చాలామంది పడవ ప్రమాదాలకు గురికాగా ఇప్పటివరకు అందులో 14,406 మంది ఇతర దేశాల వలసదారులను వారు  రక్షించినట్లు సమాచారం అందించారు. 

జూన్ నెలలో జరిగిన ఘోరమైన ప్రమాదం: 

ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో భారతీయులకు ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. భారతదేశానికి చెందిన పడవ పెళ్లి బృందంతో వెళ్తుండగా హఠాత్తుగా పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 103 మంది ప్రాణాలు కోల్పోయారు.