ఏడాదికి ఇక రెండుసార్లు

పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతటి టాపర్లయినా సరే పరీక్షల విషయంలో అందరు విద్యార్థులు గాబరా పడతారు. అందుకోసమే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఏడాదికి రెండు సార్లు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల కొంత మంది అబ్జెక్షన్ చెప్పినా కానీ కేంద్రం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ముందడుగు […]

Share:

పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతటి టాపర్లయినా సరే పరీక్షల విషయంలో అందరు విద్యార్థులు గాబరా పడతారు. అందుకోసమే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఏడాదికి రెండు సార్లు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల కొంత మంది అబ్జెక్షన్ చెప్పినా కానీ కేంద్రం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ముందడుగు వేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం చాలా తక్కువ అంటూ తెలిపింది. 

కొత్త విద్యావిధానం కీలక నిర్ణయం

2024 అకడమిక్ ఇయర్ కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇప్పుడు పరీక్షలను నిర్వహిస్తున్న విధానానికి స్వస్తి పలుకుతూ ఇక ఏడాదికి రెండు సార్లు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇవి వ్యవస్థలో పెను మార్పులను తీసుకురావడం పక్కా అని కేంద్రం నొక్కి చెబుతోంది. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఈ నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుందని చెబుతుంది. కావున విద్యార్థులకు మేలు చేసే ఈ నిర్ణయాన్ని తప్పని సరిగా  ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతోంది. 

కొత్త కరికులమ్ కూడా…

2024 అకడమిక్ ఇయర్ లో పెను మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పరీక్ష విధానంలో మార్పులు చేయడం మాత్రమే కాకుండా పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించింది. ఇందుకోసం కొత్త విద్యా విధానం (NEP)కి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులనే చేసింది. ఈ మార్పుల వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని కొన్ని పార్టీలు అంటున్నాయి. అదేం లేదు విద్యార్థులు ఈ కొత్త విధానం లాభమే చేకూరుస్తుందని కేంద్రం చెబుతోంది. ఈ నిర్ణయం విద్యార్థులకు నష్టం చేస్తుందా? లేక లాభాలను చేకూరుస్తుందా అనే విషయాలను మనం తెలసుకోవాలంటే ఈ విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. పరీక్షల విధానంలో మార్పులుచేయడం మాత్రమే కాకుండా విద్యా మంత్రిత్వ శాఖ కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రకటించింది.

ఒక ఇండియన్ లాంగ్వేజ్ ఉండాలి..

బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లాంగ్వేజెస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. మాతృ భాష అనేది ప్రతి విద్యార్థికి చాలా ముఖ్యమని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా ఈ కొత్త విద్యా విధానంలో కూడా మాతృ భాషకు పెద్ద పీట వేసింది. 11, 12వ తరగతి విద్యార్థులు రెండు భాషలను తప్పకుండా అభ్యసించాలని, అందులో కనీసం ఒక భాష అయినా భారతీయ భాష అయి ఉండాలని పేర్కొంది. ఇక పై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించబడతాయని, విద్యార్థులు ఉత్తమ స్కోర్‌ను నిలుపుకోవడానికి ఈ విధానం అనుమతిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా వారి మీద స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. 

ఇది సులభతరం చేస్తుంది… 

ప్రస్తుతం కొనసాగుతున్న హై స్టేక్స్ అభ్యాసం కంటే బోర్డు పరీక్షలను సులభతరం చేయడానికి, ఈ కొత్త విద్యా విధానం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్షకు ముందు నుంచి నెలల తరబడి కోచింగ్ మరియు కంఠస్థం కాకుండా సామర్థ్యాల అవగాహన మరియు సాధనను ఇది అంచనా వేస్తుందని ప్రకటించింది. అంతే కాకుండా మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. విద్యార్థులకు తగినంత సమయం మరియు మంచి పనితీరు కనబరచడానికి అవకాశం ఉండేలా సంవత్సరానికి కనీసం రెండుసార్లు బోర్డ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు తాము పూర్తి చేసిన సబ్జెక్టులలో బోర్డు పరీక్షకు హాజరవుతారని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల వారికి ఎటువంటి నష్టం జరగదని పేర్కొంది. వారు ఉత్తమమైన స్కోర్ ను సాధించేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని ప్రకటించింది.