Arvind: మళ్లీ గెలిపిస్తే.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయిస్తా: ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా నుండి ఏడుగురు బిజెపి(BJP) అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ (Nizam Sugar Factory)ని తిరిగి తెరిపిస్తామని బిజెపి పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్(Mp Arvind) హామీ ఇచ్చారు. దశాబ్దాల నాటి ఈ చక్కెర కర్మాగారాన్ని(Sugar factory) మూసివేయడానికి కాంగ్రెస్(Congress) మరియు బిఆర్‌ఎస్(Brs) అనే మరో రాజకీయ పార్టీ కారణమని ఆయన ఆరోపించారు. చెరుకు రైతులకు మరియు ఫ్యాక్టరీ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలన్నారు. బోధన్(Bodhan) మరియు డిచ్‌పల్లి(Dichpalli)లో […]

Share:

నిజామాబాద్ జిల్లా నుండి ఏడుగురు బిజెపి(BJP) అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ (Nizam Sugar Factory)ని తిరిగి తెరిపిస్తామని బిజెపి పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్(Mp Arvind) హామీ ఇచ్చారు. దశాబ్దాల నాటి ఈ చక్కెర కర్మాగారాన్ని(Sugar factory) మూసివేయడానికి కాంగ్రెస్(Congress) మరియు బిఆర్‌ఎస్(Brs) అనే మరో రాజకీయ పార్టీ కారణమని ఆయన ఆరోపించారు. చెరుకు రైతులకు మరియు ఫ్యాక్టరీ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలన్నారు.

బోధన్(Bodhan) మరియు డిచ్‌పల్లి(Dichpalli)లో తన ఇటీవలి పార్టీ కార్యకలాపాలలో, ఉత్తరప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు అనేక చక్కెర కర్మాగారాలను విజయవంతంగా ఎలా తిరిగి ప్రారంభించాయో అరవింద్ హైలైట్ చేశారు. అటువంటి కర్మాగారాలను పునరుద్ధరించడానికి ఒక విధానం అమలులో ఉందని, చక్కెర, బ్రౌన్ షుగర్, మొలాసిస్ మరియు ఇథనాల్ ఉత్పత్తి కారణంగా చెరకు సాగు ప్రయోజనకరంగా మారిందని ఆయన  చెప్పారు. 100 రోజుల్లోగా షుగర్‌ ఫ్యాక్టరీ(Sugar Factory))ని తెరిపిస్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఇచ్చిన హామీపై ప్రజలు ప్రశ్నించాలని అరవింద్‌ కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల చర్యలలో ఒకేలా ఉన్నారని, తెలంగాణలో మార్పు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రస్తావించారు.

రాష్ట్రంలో బీజేపీ(BJP)యే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్‌లో(Congress) చీలిక ఉందని, రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయని.. తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని చెప్పారు. నాలుగు పైసల అవినీతి కూడా తన మీద లేదని, ఉండదన్నారు. దళారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్ అని మండిపడ్డారు.పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శారీరకంగా కాదు, రాజకీయంగా కూడా కవిత తనను అందుకోలేదని… కవిత లిక్కర్ బోర్డు(Liquor Board) తెచ్చిందని అర్వింద్ విమర్శించారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎంపీ అర్వింద్(MP Arvind) అన్నారు. బీఆర్ఎస్(BRS) కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదని విమర్శించారు. మన కొడుకుకో, బిడ్డకో శాపం పెట్టినట్లేనని తెలిపారు. హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డి(Revanth Reddy)యేనని పేర్కొన్నారు. నవంబర్ 30న తెలంగాణకు బీఆర్ఎస్ పీడ పోతుందని, అవినీతికి పాల్పడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బోధన్ పట్టణంలోని రోడ్లు మరియు కాలనీలకు హిందూ పేర్లను మార్చడంపై కూడా అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు, సంఘాన్ని ఏకం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.  ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి(Dichpalli) లో జరిగిన బీజేపీ రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్(Mp Arvind) బీఆర్ఎస్ మేనిఫెస్టో(BRS Manifesto)ను చించివేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ రూరల్ నియోజకవర్గ ప్రజలు నీకు జీవిత బీమా చేస్తారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు బీజేపీ విజయం పక్కా అన్నారు. కాంగ్రెస్ మూడో స్థానంకే పరిమితమౌతుందన్నారు. బీజేపీ అధిష్టానం దినేష్ కి టిక్కెట్ ఇస్తే రూరల్ బీజేపీ ఎమ్మెల్యే దినేష్ విజయం తధ్యమన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్మెస్తారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల ప్రస్తావన లేదని, కేసీఆర్ మేనిఫెస్టో పనికిరాదన్నారు. బీఆర్‌ఎస్‌  2023 మేనిఫెస్టోలో తెలంగాణలో చనిపోయిన వారికి 5 లక్షలు ఎందుకు, బతికి ఉన్నపుడు ఇవ్వాలన్నారు. కేసీఆర్(KCR) నువ్వు చనిపోతే 15 లక్షలు తాను ఇస్తానని వ్యాఖ్యానించారు. గల్ఫ్ బోర్డు ఎక్కడ అని, రూరల్ ప్రాంతంలో లక్ష ఎకరాల సాగునీరు ఎక్కడ అని ప్రశ్నించారు. బీజేపీ(BJP) రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి 15 వేల ఇళ్లు కట్టిస్తామని అన్నారు. తెలంగాణలో పంటలకు నష్ట పరిహారం లేదని, తెలంగాణ యూనివర్సిటీని సర్వనాశనం చేశారని, ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఎక్కడ అని, మీ ఎమ్మెల్యే ను నిలదీయాలని, కేసీఆర్ ముందు జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కు స్థలం ఇవ్వాలన్నారు. డిచ్చిపల్లి సీఐ దళితుల పై దాడులు మానుకోవాలని, కర్ణాటక కాంగ్రెస్ లారీలలో డబ్బులు తెలంగాణ కు ఎందుకు తరలిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సంచులలో డబ్బులు మోసుడు బంద్ చేసి లారీల్లో మోస్తున్నాడని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ధరణి ని రద్దు చేస్తామన్నారు.