ST, SC సీట్ల కోసం బీజేపీ సరికొత్త వ్యూహం

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలతో కలిసి చర్చోప చర్చలు జరుపుతోంది. తాజగా పార్టీ సీనియర్ వ్యూహకర్త, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ దీనిపై తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమై చర్చించారు.  ఈ సమావేశంలో ‘మిషన్ 31’పై ద్రుష్టి పెట్టాలని, దానిపై పని చేయాలని సూచించారు. ‘మిషన్ 31’ అంటే రాష్ట్రంలో […]

Share:

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలతో కలిసి చర్చోప చర్చలు జరుపుతోంది. తాజగా పార్టీ సీనియర్ వ్యూహకర్త, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ దీనిపై తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమై చర్చించారు. 

ఈ సమావేశంలో ‘మిషన్ 31’పై ద్రుష్టి పెట్టాలని, దానిపై పని చేయాలని సూచించారు. ‘మిషన్ 31’ అంటే రాష్ట్రంలో ఉన్న 12 ST, 19 SC నియోజకవర్గాలను కైవసం చేసుకోవడమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని నిజం చేసేందుకు, పార్టీ వ్యూహాన్ని అనుసరించేందుకు రెండు విభాగాలను ఏర్పాటు చేశారు.

STలోని 12 సీట్ల కోసం ‘మిషన్-12’, SCలోని 19 సీట్ల కోసం ‘మిషన్-19’ చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ ఈ ప్రణాళికలు రచిస్తూ ఉండగానే.. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. కోటపల్లి మండలం శెట్‌పల్లికి చెందిన దళితుడైన దుర్గం బాపుకు జరిగిన చికిత్సపై ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 

బాబుకు చెందిన కొన్ని పశువులు బీఆర్‌ఎస్‌ నాయకుడి పొలాల్లోకి ప్రవేశించి కొంత పంటను ధ్వంసం చేశాయన్న కారణంగా స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుడు బాపును ఆయన ఇంటికి ఈడ్చుకెళ్లి కట్టేశారని బాషా ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని, దళితులను నిత్యం అవమానించే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని బాషా అన్నారు. 

బీజేపీ వ్యూహం ఏంటి?

ఈ నియోజకవర్గాల్లో గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాన్ని బీజేపీ రచించింది. ఈ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గతంలో బీజేపీ ఎలా పనిచేసింది, పార్టీకి బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయా, అభ్యర్థులుగా షార్ట్‌లిస్ట్ చేయగల పార్టీ నేతలు ఉన్నారా? ఈ నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్ నేతలు పర్యటనలు వంటి వాటిపై చర్చలు జరిపారు.

దళితుల బంధు, గిరిజన బంధు, పేదలకు ఇళ్లు వంటి అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. ఈ హామీలను అమలు చేయలేదనే, నినాదంతో తమ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎస్సీ, ఎస్టీల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఓట్లు అడగాలని డిసైడ్ అయ్యామని బీజేపీ సీనియర్ నేత ఒకరు అన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. అలాగే ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీ పనులను పర్యవేక్షించే గరికపాటి మోహనరావు తదితరులు కూడా ఉన్నారు.

అధికారమే లక్ష్యంగా పావులు..

2023లో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పని చేస్తోంది. అందులో భాగంగానే పార్టీలో కొన్ని మార్పులు కూడా చేసింది. అండ్ అలాగే ఆపరేషన్ ఆకర్ష్‌పై ద్రుష్టి పెట్టింది. సరికొత్త వ్యూహాలు రచిస్తూ.. జాతీయ స్థాయి నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అయితే తెలంగాణలో ఇప్పటికే అధికారంలో ఉన్న BRS, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు రెండూ బలమైన కేడర్ కలిగి ఉన్నాయి. మరి ఆ రెండు పార్టీలను ఢీకొని బీజేపీ అధికారం దక్కించుకుంటుందో లేదో చూడాలి.