Udhayanidhi: డీఎంకే లీడర్ ఉదయనిధిని మరోసారి విమర్శించిన బిజెపి

Udhayanidhi: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) కుమారుడు ఉదయనిధి (Udhayanidhi)ని, బిజెపి (BJP) మరొకసారి విమర్శించడం జరిగింది. ముఖ్యంగా అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఇండియా – పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చాలామంది జైశ్రీరామ్ అంటూ అరవడాన్ని ఎత్తిచూపారు తమిళనాడు మినిస్టర్ ఉదయనిది స్టాలిన్. దీనికి దీటుగా స్పందించారు బిజెపి (BJP).  ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లో జైశ్రీరామ్ అంటూ..:  శనివారం అహ్మదాబాద్‌లో భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాక్‌ క్రికెటర్‌(Cricketer)ను అవహేళన చేస్తూ ‘జై […]

Share:

Udhayanidhi: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) కుమారుడు ఉదయనిధి (Udhayanidhi)ని, బిజెపి (BJP) మరొకసారి విమర్శించడం జరిగింది. ముఖ్యంగా అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఇండియా – పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చాలామంది జైశ్రీరామ్ అంటూ అరవడాన్ని ఎత్తిచూపారు తమిళనాడు మినిస్టర్ ఉదయనిది స్టాలిన్. దీనికి దీటుగా స్పందించారు బిజెపి (BJP). 

ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లో జైశ్రీరామ్ అంటూ..: 

శనివారం అహ్మదాబాద్‌లో భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాక్‌ క్రికెటర్‌(Cricketer)ను అవహేళన చేస్తూ ‘జై శ్రీరామ్‌'(Jai Sri Ram) నినాదాలు చేశారని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి (Udhayanidhi) స్టాలిన్‌ (Stalin) విమర్శించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బిజెపి (BJP) నాయకుల నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, స్టాలిన్ ఒక విషం వ్యాప్తి చేస్తున్నా దోమ అంటూ ట్విట్టర్ (Twitter) ద్వారా విమర్శించారు. 

పాకిస్తాన్ (Pakistan) వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ డగౌట్‌కు వెళుతుండగా, ప్రజలు ‘జై శ్రీరామ్‌'(Jai Sri Ram) అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు తీవ్ర ప్రతిస్పందనలకు దారితీశాయి. ఈ నినాదాలు క్రికెట్(Cricket) స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్‌ను వేధించడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేస్తున్నాడని మరియు అంతకుముందు మ్యాచ్‌లో గాజాలో ప్రజలకు సంఘీభావం తెలుపుతూ, మతాన్ని మైదానంలోకి తీసుకువచ్చింది పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్(Cricketer), అని ఆరోపిస్తూ మరికొంతమంది ఈ విషయాన్ని ట్విట్టర్ (Twitter) ద్వారా గురించి మాట్లాడారు. 

భారతదేశం క్రీడాస్ఫూర్తికి, అంతకన్నా ఎక్కువగా ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందిందని.. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లను ఆటపట్టిస్తూ అవహేళన చేయడం మంచి విషయం కాదంటూ.. క్రీడలు దేశాల మధ్య ఏకం చేసే శక్తిగా ఉండాలి తప్పిస్తే.. ద్వేషాన్ని వ్యాపింపజేసేందుకు దానిని సాధనంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ ఉదయనిధి (Udhayanidhi) స్టాలిన్ తన ట్విట్టర్ (Twitter) ద్వారా పేర్కొన్నారు. అయితే ఈ విషయం గురించి త్రినముల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోకులే కూడా ట్విట్టర్ (Twitter) లో పేర్కొనడం జరిగింది..2036లో భారతదేశం ఒలంపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వనున్న సందర్భంలో.. భారత దేశంలో ఉన్న ప్రజలను బిజెపి (BJP) తప్పుదారి పట్టించడం అనేది ఏ విధంగా క్రీడల మీద ప్రభావం చూపిస్తుందో అంటూ, తన వైపు నుంచి సందేహాన్ని వ్యక్తపరిచారు. 

ఇటీవల సనాతన ధర్మ వివాదం: 

సనాతన ధర్మం (Sanatana Dharma) గురించి ఇటీవల ఉదయనిధి (Udhayanidhi) తనదైన శైలిలో మాట్లాడటం జరిగింది. అయితే డీఎంకే లీడర్ ఉదయనిధి (Udhayanidhi) స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్ల పారితోషకం అందిస్తానని ధైర్యంగా ప్రకటించాడు పరమహంస ఆచార్య. తమిళ సినిమాకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఉదయనిధి (Udhayanidhi) స్టాలిన్‌ (Stalin)కు మద్దతుగా నిలిచారు. కమల్ హాసన్‌తో పాటు మరి సెల్వరాజ్ మరియు పా రంజిత్ తదితరులు మామన్నన్, ఉదయనిధి (Udhayanidhi) మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా స్పందించారు. తన వ్యాఖ్యలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం సబబు కాదని, తన వైపు నుంచి మరొకసారి క్లారిటీగా చెప్పారు. 

సనాతన ధర్మం(Sanatana Dharma) గురించి తెలియని వారికి మరింత లోతుగా తెలిసేందుకు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మనుషుల్ని విడదీసే క్రమంలో సనాతన ధర్మం (Sanatana Dharma) ఎలా పనిచేస్తుందో అంబేద్కర్, అదేవిధంగా పెరియర్ వంటి వారు రచించిన ఎన్నో పుస్తకాలు ద్వారా తెలుసుకోవచ్చని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సనాతన ధర్మం (Sanatana Dharma) సమాజం మీద దుష్ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో తనకి బాగా తెలుసు అని అన్నారు. 
సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) కరోనా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చడానికి గల కారణం సనాతన ధర్మం (Sanatana Dharma) సమాజంలో ఎటువంటి దుష్ప్రభావాలకు దారితీస్తుందో దాన్ని చెప్పడానికి ఆయన ఉదాహరణగా తీసుకున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా, తాను ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఉదయినిది. తప్పుడు ప్రచారాన్ని మాత్రం చేయొద్దని, తాను ఎక్కడైనా, అది కోర్టులోనైనా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.