Telangana Assembly Elections : అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ

Telangana Assembly Elections: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా ను విడుదల చేసింది. ఇందులో 12 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించింది. సీఎం కేసిఆర్ పోటీ చేయనున్న గజ్వేల్ నుండి ఈటెల రాజేందర్(Etela Rajender) పోటీ చేయనున్నారు. దీంతో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పై తెలంగాణలో మరింత ఆసక్తి నెలకొన్నది. […]

Share:

Telangana Assembly Elections: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా ను విడుదల చేసింది. ఇందులో 12 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించింది. సీఎం కేసిఆర్ పోటీ చేయనున్న గజ్వేల్ నుండి ఈటెల రాజేందర్(Etela Rajender) పోటీ చేయనున్నారు. దీంతో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పై తెలంగాణలో మరింత ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం హుజూరాబాద్, గజ్వేల్ రెండు ప్రాంతాల నుండి పోటీ చేయనున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా మాజీ జర్నలిస్టు రాణి రుద్రమ రెడ్డి సిరిసిల్ల నుండి పోటీ చేయనున్నారు. 

గోషామహాల్ నుండి మళ్ళీ రాజా సింగ్ పోటీ

ఇటీవలే ఎమ్మెల్లే రాజా సింగ్ మీద ఉన్న సస్పెన్షన్ ను బీజేపీ రద్దు చేసింది, దాంతో ఆయన బీజేపీ పార్టీ తరపున గోషామహాల్ నియోజకవర్గం నుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) పోటీ చేయనున్నారు. ఈసారి ముగ్గురు ఎంపీలకు కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు, మరొక ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ సారి కోరట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. 

మహిళలకు ప్రాధాన్యం 

మొదటి నుండి మహిళలకు ప్రాధాన్యం ఇస్తాం అని చెప్తున్న బీజేపీ పార్టీ తన మాటను నిలబెట్టుకుంది. 12 మంది మహిళా అభ్యర్థులకు తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) కోసం సీటు కేటాయించింది. బిఆర్ఎస్ పార్టీ కేవలం 7 సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ శత ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో అధికారం కోల్పోవడం తెలంగాణ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అయితే బీజేపీ ఈ విషయాన్ని ఎలా ఎదుర్కుంటుంది అని వేచి చూడాలి. 

నవంబర్ 30 న ఎన్నికలు, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల గంట మోగడంతో ఇప్పటికే అన్నీ పార్టీలు ప్రచార బాట పట్టాయి. సీఎం కేసిఆర్ మళ్ళీ మూడవ సారి కూడా ముఖ్యమంత్రి అవుతారు అని బిఆర్ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. రాహుల్ గాందీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పుంజుకున్నట్లు కనిపిస్తున్నా అంతర్గత విబేధాలు ఆ పార్టీని బలహీన పరుస్తున్నాయి. ఈ సమయంలో తన బలం చూపించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. 

మొదటి జాబితా లో అభ్యర్థులు వీరే

హుజూరబాద్ , గజ్వేల్ నుండి ఈటెల రాజేందర్ (Etela Rajender) పోటీ చేయనున్నారు, చార్మినార్ నుండి మేఘా రాణి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నుండి కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నుండి నోముల దయానంద్ గౌడ్, ఖైరతాబాద్ నుండి చింతల రామచంద్రారెడ్డి, కర్వాన్ నుండి అమర్ సింగ్, చంద్రాయన గుట్ట నుండి సత్యనారాయణ ముదిరాజ్, నాగార్జున సాగర్ నుండి నివేదిత రెడ్డి మొదలైన వారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) పోటీ చేస్తున్నారు. పూర్తి జాబితా క్రింద గమనించవచ్చు.