మ‌ణిపూర్‌పై గాంధీల మౌనం ఏంటో..?

బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అంతేకాకుండా బీహార్ వంటి ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో, మహిళలపై భయంకరమైన హింస గురించి ఆయన పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది.  పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్‌లలో మహిళలపై అఘాయిత్యాల సంఘటనలను, విపక్షాల మౌనాన్ని ప్రశ్నించేందుకు బిజెపి మధ్యలోకి తీసుకురావడంతో, శనివారం మణిపూర్‌పై రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని […]

Share:

బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అంతేకాకుండా బీహార్ వంటి ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో, మహిళలపై భయంకరమైన హింస గురించి ఆయన పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది. 

పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్‌లలో మహిళలపై అఘాయిత్యాల సంఘటనలను, విపక్షాల మౌనాన్ని ప్రశ్నించేందుకు బిజెపి మధ్యలోకి తీసుకురావడంతో, శనివారం మణిపూర్‌పై రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పార్లమెంట్‌లో ఎటువంటి ఆటంకం లేకుండా చర్చ జరగాల్సి ఉండగా.. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా లేదని, షరతులు విధిస్తూ చర్చకు రాకుండా విపక్షాలు తప్పించుకుంటున్నాయని ఆరోపించారు.

గాంధీలు ఎందుకు నోరు విప్పట్లేదు?: ఠాగూర్ 

బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అంతేకాకుండా బీహార్ వంటి ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో, మహిళలపై భయంకరమైన హింస గురించి ఆయన పార్టీ నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది. ఈ హింసపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

రాజస్థాన్‌లో గత నాలుగేళ్లలో లక్షకు పైగా మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయని, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 33,000 కేసులు నమోదయ్యాయని ఠాకూర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని పాలనలోనే ఉన్న, మాల్దా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను దారుణంగా కొట్టి, బట్టలు విప్పి చంపిన అంశాన్ని కూడా అధికార పార్టీ లేవనెత్తింది.

సోనియా, రాహుల్ గాంధీల సూచనల మేరకే రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు జరుగుతున్నాయని ఆరోపించడం జరిగింది. అయితే ఇటీవల రాజస్థాన్‌లో కాంగ్రెస్, తన మంత్రిని తొలగించిందని, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి: 

పార్లమెంట్‌లో చర్చలు జరగకుండా తప్పించుకుందామని, బీజేపీ దురుసుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. మణిపూర్‌లో జరిగిన దుర్ఘటన నుంచి దృష్టి మరల్చి ఇతర రాష్ట్రాల్లోని సమస్యలతో తప్పుడు సమానత్వాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు.

రాజకీయ యుద్ధం కొనసాగుతున్నందున, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను తొలగించాలని, అంతేకాకుండా రాష్ట్రంలో సామాజిక మరియు మానసిక వైద్యం మళ్లీ అందించేందుకు ఆర్టికల్ 356 విధించాలని కోరడం జరిగింది. ఈ విధంగా అయినా మణిపూర్‌కు ఒక మార్గాన్ని ప్రతిపాదించారు. 

కానీ ఒక పక్క రాజకీయ యుద్ధం జరుగుతూ ఉండగా, మరో పక్క మణిపూర్ లో జరుగుతున్న హింసకు మాత్రం ఎవరు చెక్ పెట్టలేకపోతున్నారు. ఆడవాళ్ళ మీద హింస రోజు రోజుకు ఎక్కువ అయిపోతుంది. మే నెలలో జరిగిన హింస గురించి, ఇప్పుడిప్పుడే మణిపూర్లో జరుగుతున్న విషయాలు బయటపడుతున్నాయి. అంతేకాకుండా ఈ అల్లరిలో మధ్యలో పశ్చిమ బెంగాల్లో మరో ఇద్దరి ఆడవాళ్ళ మీద మరో ఆడవాళ్ళ గుంపు దాడి చేసి హింసించి చంపేశారు. ఇలాంటి హింస సంబంధించిన విషయాలు చూస్తుంటే, నిజంగా భారతదేశం ఎటువైపు వెళ్తుందా అనిపిస్తుంది. మరోపక్క రాజకీయ నాయకులు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ ఉండగా, ఇలాంటి హింసకు ముగింపు ఏమవుతుందో అని ప్రజలలో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది.