YSRCPకి BJP తొమ్మిది ప్ర‌శ్న‌లు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSRCP) ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ తొమ్మిది ప్రశ్నల బాణాలు విసిరారు. సోమవారం విజయవాడ లో మీడియాతో మాట్లాడిన బిజెపి నాయకుడు, తమ పార్టీ అధినేత్రి డి పురంధేశ్వరి గారిని లక్ష్యంగా చేస్తున్న రాష్ట్ర మంత్రులపై మండిపడ్డారు. సమస్యలపై లేవదీసిన పలు ప్రశ్నలకు వైయస్సార్ సిపి మంత్రులు స్పందించలేకపోయారని విష్ణు అన్నారు. అంతేకాకుండా ఈ విషయంపైన పురందేశ్వరి కూడా అధికార పార్టీ పనితీరుపై మాట్లాడారు. వైఎస్సార్‌సీపి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి […]

Share:

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (YSRCP) ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ తొమ్మిది ప్రశ్నల బాణాలు విసిరారు. సోమవారం విజయవాడ లో మీడియాతో మాట్లాడిన బిజెపి నాయకుడు, తమ పార్టీ అధినేత్రి డి పురంధేశ్వరి గారిని లక్ష్యంగా చేస్తున్న రాష్ట్ర మంత్రులపై మండిపడ్డారు. సమస్యలపై లేవదీసిన పలు ప్రశ్నలకు వైయస్సార్ సిపి మంత్రులు స్పందించలేకపోయారని విష్ణు అన్నారు. అంతేకాకుండా ఈ విషయంపైన పురందేశ్వరి కూడా అధికార పార్టీ పనితీరుపై మాట్లాడారు. వైఎస్సార్‌సీపి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాష్ట్రానికి ఏం చేశారు అంటూ పురందేశ్వరి కూడా ప్రశ్నించారు. ప్రజలకు కేంద్రం అందించిన డబ్బును ఉపయోగించకుండా. అదనంగా రాష్ట్రానికి అప్పులు మిగిల్చారని వైఎస్సార్‌సీపి పార్టీ మీద మండిపడ్డారు పురందేశ్వరి.

తొమ్మిది సవాళ్లు: 

పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో వైఎస్సార్‌సీపి ప్రభుత్వం విఫలమైందని, దానికి అసలు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ పిల్లల అక్రమ రవాణా విషయంలో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉందని సిగ్గుపడాలన్నారు. ఇక ఆదాయం విషయానికొస్తే, రాష్ట్రంలో వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ రంగాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఏపీలో ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. తర్వాత, ప్రజలకు తాగునీటి వసతి కల్పించేందుకు కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో జన్‌ జీవన్‌ మిషన్‌ను వినియోగించుకోవడంలో ఏపీ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. 

ఆతరువాత విష్ణు వర్ధన్ రాష్ట్రంలో పేదల కంటే, పేద వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలలో సరైన సౌకర్యాలు ఎందుకు ప్రభుత్వం కల్పించలేదని ప్రశ్నించారు. పేద రోగులకు వైద్య పరీక్షలు, మందులు రెండూ అందుబాటులో లేవని, 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఎలాంటి వైద్యం అందడం లేదని, వాటి బిల్లులు ఎందుకు స్పష్టంగా ఉండవని చెప్తూ, అలా ఎందుకు ఉందొనాని ప్రశ్నించారు. 

ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోందని, పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల చేయడం లేదని ఆరోపించారు. డిగ్రీ కోర్సుల్లో తెలుగు భాషను ఎందుకు తీసేసారో, తెలుగు వాళ్లకి తెలుగుకి బదులు ఇంగ్లీషు భాషను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల్లో పోస్టుల భర్తీ చెయ్యకుండా ఖాళీగా ఉన్న 2.5 లక్షల బ్యాక్‌లాగ్‌ పోస్టుల గురించి ప్రస్తావిస్తూ, ఇలా ఎందుకు ఉందని ప్రశ్నించారు. 

అలాగే రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని అడిగారు? పాలకవర్గం పథకాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఇంటి వద్దకే సురక్షిత మంచినీరు అందించడాన్ని సమర్థించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 25 లక్షల ఇళ్లను కూడా నిర్మించకుండా కూర్చున్నారని అధికార పార్టీని తప్పుబట్టారు విష్ణువర్ధన్. ఇళ్ల నిర్మాణం కంటే కమీషన్ల కోసం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికే అధికార పార్టీకి ఆసక్తి ఉందని ఆరోపించారు. ఈ ప్రశ్నలకు అధికార పార్టీ నుంచి చేతల్లో పని కనిపిస్తుందో మాటల్లో యుద్ధం వినిపిస్తుందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు విష్ణువర్ధన్.