జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజ‌య్

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఆఫీస్ బేరర్ల జాబితాలో కీలక మార్పులు చేశారు, బండి సంజయ్ కుమార్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ కు చెందిన పస్మాండ ముస్లిం ను ఉపాధ్యక్షులుగా నియమించారు. క‌రీంనగ‌ర్ ఎంపీగానే కాకుండా.. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌ను కొన్ని రోజుల క్రితం తొల‌గించి ఆయ‌న స్థానాన్ని కిష‌న్ రెడ్డికి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు […]

Share:

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఆఫీస్ బేరర్ల జాబితాలో కీలక మార్పులు చేశారు, బండి సంజయ్ కుమార్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ కు చెందిన పస్మాండ ముస్లిం ను ఉపాధ్యక్షులుగా నియమించారు. క‌రీంనగ‌ర్ ఎంపీగానే కాకుండా.. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌ను కొన్ని రోజుల క్రితం తొల‌గించి ఆయ‌న స్థానాన్ని కిష‌న్ రెడ్డికి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిటి రవి, అస్సాం నుండి లోక్ సభకు ఎన్నికైన దిలీప్ సైకియా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోల్పోయారు, అలాగే ఉత్తరప్రదేశ్ నుండి లోక్ సభకు ఎన్నికైన హరీష్ ద్వివేది, వినోద్ సోంకర్ మరియు వారితో పాటు సునీల్ దేవధర్ కూడా కార్యదర్శి పదవి కోల్పోయారు. 

మొత్తం తొమ్మిది మంది ప్రధాన కార్యదర్సులు ఉండగా అందులో ఏడుగురు వారి స్థానాలను నిలబెట్టుకున్నారు, తొలగించిన వారి స్థానాన్ని భర్తీ చేసింది ఒకరు తెలంగాణ కు చెందిన బండి సంజయ్ కాగా మరొకరు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ కు ఎన్నికైన రాధా మోహన్ అగర్వాల్. కార్యదర్సుల విషయానికి వస్తే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ,సురేంద్ర సింగ్ నగర్, అస్సాం నుండి రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన కామాఖ్య ప్రసాద్ తాసా ను కార్యదర్సులుగా నియమించారు. సురేంద్ర సింగ్ నగర్ పశ్చిమ యూపీ నుండి ప్రభావవంతమైన గుర్జర్ నాయకుడు కాగా కామాఖ్య ప్రసాద్ తాసా అస్సాం రాష్ట్ర టీ తెగల ముఖ్య నాయకుడుగా ఉన్నారు. 

బీజేపీ పార్టీకు 13 మంది ఉపాధ్యక్షులు , 13 మంది కార్యదర్సులు , 9 మంది ప్రధాన కార్యదర్సులు ఉన్నారు. 9 మంది ప్రధాన కార్యదర్సులలో ఒకరిగా ఉన్న బిఎల్ సంతోష్ వీరి అందరికి ఇంఛార్జ్ గా ఉన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన లోక్ సభ రాధా మోహన్ సింగ్ ను ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించి ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ బాజ్పాయ్ ను మరియు తారీఖ్ మన్సూర్ ను నియమించారు. దీనితో ఇప్పుడు ఉపాధ్యక్షులు పదవిలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు. 

ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్సులలో ఒకరిగా ఉన్న సిటి రవి ను ఆ పదవి నుండి తప్పించడానికి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలవ్వడం వలనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, అయితే ఆయన పార్టీకు దూరం కాలేదు అని ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా ఆయన వచ్చే ఎన్నికలలో లోక్ సభకు పోటీ చేస్తారు అని పార్టీ సభ్యులలో ఒకరు అన్నారు. 

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU) మాజీ వైస్ ఛాన్సలర్ తారీఖ్ మన్సూర్ ను ఉపాధ్యక్షునిగా నియమించడం ముస్లింలను ఆకట్టుకోవడానికి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బండి సంజయ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆయన పార్టీకు చాలా ముఖ్యమైన నాయకుడిగా భారతీయ జనతా పార్టీ భావించినట్లు తెలుస్తుంది.