పంజాబ్​లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్న BJP

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి చెందిన కమలనాథులు చాలా మంది పంజాబ్​లో తమ పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సర్కార్ పంజాబ్​లో అవినీతి కార్యకలాపాలను అదుపు చేయడంలో విఫలమైందని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్​ను కేవలం బీజేపీ పార్టీ మాత్రమే కాపాడగలదని వారు అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికారం చేజిక్కించు కోలేకపోయిన కమలనాథులు ఎంపీ ఎన్నికల్లో మాత్రం […]

Share:

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి చెందిన కమలనాథులు చాలా మంది పంజాబ్​లో తమ పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రస్తుతం ఉన్న ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సర్కార్ పంజాబ్​లో అవినీతి కార్యకలాపాలను అదుపు చేయడంలో విఫలమైందని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్​ను కేవలం బీజేపీ పార్టీ మాత్రమే కాపాడగలదని వారు అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికారం చేజిక్కించు కోలేకపోయిన కమలనాథులు ఎంపీ ఎన్నికల్లో మాత్రం అధికార ఆప్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని ముమ్మరంగా ట్రై చేస్తున్నారు. పంజాబ్​లో ప్రస్తుతం రాజకీయ శూన్యత కనిపిస్తోందని పంజాబ్​కు చెందిన పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. 

పంజాబ్లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగింది

పంజాబ్​ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం భారీగా పెరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము తప్పకుండా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. తప్పకుండా ఈ సమస్యలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. ఇక నిరుద్యోగం అయితే తారాస్థాయికి చేరుకుందని చెబుతున్నారు. అజ్నాల్​లో ఉన్న పోలీస్ స్టేషన్ వెలుపల ఓ ఆప్​ నాయకుడు చేసిన హల్చల్​ను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని వారు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా పంజాబ్​లో తిరిగి శాంతి భద్రతలను అదుపులోకి తెస్తామన్నారు. అకాళీదళ్ పార్టీని కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని కానీ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వారు  పేర్కొన్నారు. 

మార్చిలో పంజాబ్​ రాష్ట్రాన్ని సందర్శించనున్న అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మార్చిలో రాష్ట్రానికి వస్తాడని, ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వ్యతిరేఖ ర్యాలీని అమృత్​సర్​లో చేపడతామన్నారు. ఇక ఈ ర్యాలీ తర్వాత రాష్ట్రంలో బీజేపీ పార్టీ మరింత క్రియాశీలక రాజకీయాలు చేపట్టనుందని [బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో పాటుగా ఒక ఎమ్మెల్యే కూడా అవినీతి చేస్తూ దొరికిపోయాడని వారు పేర్కొన్నారు. ఇక అవినీతి పాలనకు తాము చరమగీతం పాడుతామని పేర్కొంటున్నారు. 

అందువల్లే బీజేపీ ఓటమి చెందిందా? 

మొన్న జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల మీద పెద్ద ఎత్తున వ్యతిరేఖత వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాలకు వ్యతిరేఖంగా చాలా మంది అన్నదాతలు రోజుల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టారు. ఎండనక, వాననక, చలిని కూడా లెక్కచేయకుండా రైతులు బయటే ఉండి నిరసన చేశారు. ఈ నిరసనల్లో ఎక్కువగా పంజాబ్​కు చెందిన రైతులే పాల్గొనడం విశేషం. అందుకోసమే ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇక ఆ ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాతే అక్కడ ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసింది. అకాలీదళ్​ పార్టీని మాజీ కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థాపించారు. అంతకు ముందు ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించాడు. దీంతో బీజేపీ పార్టీ ఇక ఎన్నికల్లో గెలవడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ–అకాలీదళ్ కూటమి ఘోరంగా ఓడిపోయింది. దీంతో త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి పుంజుకునేలా చేయాలని అక్కడి స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ కూటమి నుంచి విడిపోయింది. దీంతో రాష్ట్రంలో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.