కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సినిమాకి సన్నాహాలు 

ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. మీడియా కథనాలు నమ్మితే, సినిమా మొదటి భాగం సిద్దరామయ్య చిన్నతనం నుండి లాయర్ అయ్యే వరకు స్పష్టంగా, ప్రేక్షకుడని ఆకట్టుకునే విధంగా తరకెక్కించనున్నారు. కాగా, ఈ చిత్రం రెండో భాగం రాజకీయ నాయకుడిగా అతని జీవితంపై దృష్టి పెట్టనుంది. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉండగా, అనుకోకుండావాయిదా పడింది. ఈ చిత్రంలో సిద్ధరామయ్యగా నటించే ఒక హీరో పాత్ర కోసం మేకర్స్ ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయితే […]

Share:

ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. మీడియా కథనాలు నమ్మితే, సినిమా మొదటి భాగం సిద్దరామయ్య చిన్నతనం నుండి లాయర్ అయ్యే వరకు స్పష్టంగా, ప్రేక్షకుడని ఆకట్టుకునే విధంగా తరకెక్కించనున్నారు. కాగా, ఈ చిత్రం రెండో భాగం రాజకీయ నాయకుడిగా అతని జీవితంపై దృష్టి పెట్టనుంది. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉండగా, అనుకోకుండావాయిదా పడింది. ఈ చిత్రంలో సిద్ధరామయ్యగా నటించే ఒక హీరో పాత్ర కోసం మేకర్స్ ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి విజయ్ సేతుపతి పేరు వినిపిస్తున్నట్లు సినిమా వర్గాలు తెలిపారు. దీని గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 

సిద్ధరామయ్య గురించి మరింత: 

సిద్ధరామయ్య జననం 3 ఆగష్టు 1947లో జన్మించారు. అతనిని అందరూ సిద్దూ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం 2023 నుండి కర్ణాటకకు 24వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను గతంలో 2013 నుండి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పూర్తి ఐదేళ్ల పదవిని నిర్వహించిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకు చెందినవాడు. ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు. అతను 2023 నుండి వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, గతంలో 2008 నుండి 2018 వరకు, బాదామి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2018 నుండి 2023 వరకు, మరియు చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004 నుండి 2007 వరకు, 1994 నుండి 1999 వరకు మరియు 1983 నుండి 1989 వరకు కర్ణాటక అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అతను జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడిగా ఉన్నప్పుడు 1996 నుండి 1999 వరకు మరియు 2004 నుండి 2005 వరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. అతను 2019 నుండి 2023 వరకు అంతేకాకుండా 2009 నుండి 2013 వరకు, రెండుసార్లు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాడు. సిద్ధరామయ్య కొన్నేళ్లుగా వివిధ జనతా పరివార్‌ వర్గాల్లో సభ్యుడిగా ఉన్నారు.

జవాన్‌లో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు: 

 విజయ్ సేతుపతి త్వరలో జవాన్ చిత్రంలో కనిపించనున్నారు. సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాపై అభిమానులు చాలా ఉత్కంఠగా ఉన్నారు. విజయ్, షారూఖ్‌లను కలిసి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన జవాన్‌లోని జిందా బందా పాటకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. విజయ్ రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చెప్పాలంటే, అతను తదుపరి ‘మహారాజా’, ‘గాంధీ టాక్స్’, ‘మెర్రీ క్రిస్మస్’ మరియు ‘VJS 51’లో కనిపించి తన నటనతో మంత్రముద్దుల్ని చేయనున్నాడు

విజయ్ సేతుపతి గురించి మరింత: 

విజయ్ సేతుపతి, భారతీయ సినిమా నటుడు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి అలరించాడు. అయితే విజయ్ సేతుపతి, తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఒక స్టార్ హీరోగా ఎదిగి, ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.