టీచర్లు బాద‌డంతో బాలుడు మృతి

బీహార్‌లో 15 ఏళ్ల బాలుడు ధూమపానం చేస్తుంటే పట్టుకున్న ఉపాధ్యాయులు దారుణంగా కొట్టడం కారణంగా చనిపోయినట్లు చెప్తున్నారు. బీహార్‌లోని చంపారన్ జిల్లాకు చెందిన బజరంగీ కుమార్ తన తల్లి మొబైల్ ఫోన్‌ను రిపేరింగ్ షాప్ నుండి తిరిగి తీసుకురావడానికి మధుబన్ ప్రాంతానికి వెళ్లడు. సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా హార్దియా వంతెన కింద తన స్నేహితులతో కలిసి సిగరెట్ తాగడం జరిగింది అని తమ కుటుంబ సభ్యులకు అందిన సమాచారం ప్రకారం చెప్పారు. […]

Share:

బీహార్‌లో 15 ఏళ్ల బాలుడు ధూమపానం చేస్తుంటే పట్టుకున్న ఉపాధ్యాయులు దారుణంగా కొట్టడం కారణంగా చనిపోయినట్లు చెప్తున్నారు. బీహార్‌లోని చంపారన్ జిల్లాకు చెందిన బజరంగీ కుమార్ తన తల్లి మొబైల్ ఫోన్‌ను రిపేరింగ్ షాప్ నుండి తిరిగి తీసుకురావడానికి మధుబన్ ప్రాంతానికి వెళ్లడు. సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా హార్దియా వంతెన కింద తన స్నేహితులతో కలిసి సిగరెట్ తాగడం జరిగింది అని తమ కుటుంబ సభ్యులకు అందిన సమాచారం ప్రకారం చెప్పారు.

ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్ “మధుబన్ రైజింగ్ స్టార్ ప్రిపరేషన్ స్కూల్” ఛైర్మన్ విజయ్ కుమార్ యాదవ్, తమ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బజరంగీ పొగతాగడం చూసి కోపంతో రగిలిపోయాడు. అదే పాఠశాల ఉపాధ్యాయుడు బాలుడి బంధువు కూడా ఛైర్మన్‌తో పాటు ఉన్నారు. ఛైర్మన్ బాలుడి తండ్రిని పిలిచి, ఆపై పాఠశాల కాంపౌండ్‌కు ఈడ్చుకెళ్లి అక్కడ ఇతర ఉపాధ్యాయులతో కలిసి కనికరం లేకుండా కొట్టారని బజరంగి తల్లి, సోదరి ఆరోపించారు. ఉపాధ్యాయులు బాలుడిని బెల్టులతో కొట్టారని వారు తెలిపారు.

బజరంగి స్పృహతప్పి పడిపోయినప్పుడు, అతన్ని మధుబన్‌లోని ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకు వెళ్లడం జరిగింది, అయితే అప్పటికే ఆ బాలుడి పరిస్థితి విషమించడం కారణంగా ముజఫర్‌పూర్‌కు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. బజరంగీ మెడ, చేతులపై లోతైన గాయాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా రక్తస్రావం అవుతున్నాయని వారు ఆరోపించారు. పాఠశాల ఛైర్మన్, బాలుడు కుటుంబం చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకించారు, బాలుడిని కొట్టలేదని, తను పొగతాగుతున్నాడని అతని కుటుంబానికి తెలిసిపోతుందనే భయంతో, ఆ బాలుడు విషం తాగాడు అని చెప్పాడు. ఆ తర్వాత అతడిని ముజఫర్‌పూర్‌కు తరలించినప్పటికీ ప్రాణాలతో బయటపడలేదని ఆయన చెప్పారు.

రెండు నెలల క్రితమే బజరంగి స్కూల్ హాస్టల్‌లో అడ్మిషన్ పొంది, వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చాడు.

బాలుడి మరణ వార్త తెలియగానే అతని కుటుంబంలో విషాద ఛాయలో నెలకొన్నాయి. బజరంగి తల్లి, ఉస్మిలా దేవి, తన కుమారుడు మరణ వార్త విని ఎంతగానో కుమిలిపోయింది. దుఃఖంలో మునిగిపోయి జరిగిందంతా ఆమె వివరించింది. బజరంగీ తండ్రి హరి కిషోర్ రాయ్ కూలీ పని కోసం ఐదు రోజుల క్రితం పంజాబ్‌కు వెళ్లాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ గురించి మోతీహరికి పంపామని, పాఠశాలకు సీలు వేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి:

ఏది నిజం ఏది అబద్దం అని తేలనప్పటికీ, పిల్లలు చదవకపోయినా వారు తప్పు చేసినా, వారిని మాటలతో మంచితనం చేసుకోవాలి. ఏది తప్పు, అటువంటి తప్పు ఎందుకు చేయకూడదు అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒకవేళ ఉపాధ్యాయులు చెప్పినప్పటికీ వారు అదే తప్పుని చేస్తూ ఉంటే వారి తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయాలి. కానీ విచక్షణ లేకుండా చిన్న పిల్లల్ని కొట్టడం అనేది చాలా పెద్ద నేరం కిందకి వస్తుంది. ఎంతో ప్రయోజకుడు అవుతాడు అనుకున్న కుమారుడు తన కళ్ళ ముందు మృతుదేహంగా కనిపిస్తే, తమ తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుందో చెప్పలేము. పిల్లలు కూడా, మంచి అలవాట్లను అలవర్చుకోవడం నేర్చుకోవాలి. చిన్న చిన్న తప్పులు రేపు పెద్దగా మారొచ్చు. కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మీద, వారి అలవాట్లు మీద, ఒక కంట కనిపెడుతూ ఉండాలి