బిహార్‌లో దారుణ ఘ‌ట‌న‌

దేశంలో అంతకంతకు పెరిగిపోతున్న అత్యాచారాలు. బీహార్లో కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళపై అత్యాచారయత్నం చేయడానికి అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించగా, పశువుగా ప్రవర్తిస్తున్నారు అతడిని ఆపలేక, ఆ పక్కనే ఉన్న షేవింగ్ బ్లేడ్‌ని తీసుకుని అతని జననాంగాలను పాక్షికంగా కోసేసింది ఆ మహిళ.  వివరాలు ఈ విధంగా ఉన్నాయి: బీహార్‌లోని బంకా జిల్లాలో మహిళ ఆత్మరక్షణ కోసం శుక్రవారం రాత్రి తన ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి జననాంగాలను […]

Share:

దేశంలో అంతకంతకు పెరిగిపోతున్న అత్యాచారాలు. బీహార్లో కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళపై అత్యాచారయత్నం చేయడానికి అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించగా, పశువుగా ప్రవర్తిస్తున్నారు అతడిని ఆపలేక, ఆ పక్కనే ఉన్న షేవింగ్ బ్లేడ్‌ని తీసుకుని అతని జననాంగాలను పాక్షికంగా కోసేసింది ఆ మహిళ. 

వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

బీహార్‌లోని బంకా జిల్లాలో మహిళ ఆత్మరక్షణ కోసం శుక్రవారం రాత్రి తన ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి జననాంగాలను పాక్షికంగా కోసేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

20 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళ తన ఇంటిలో నిద్రిస్తుండగా, 27 ఏళ్ల నిందితుడు ఆమె భర్త లేని సమయం చూసి ప్లాన్ వేసి ఇంటి పైకప్పు నుండి ఇంటి లోపలికి చొరబడి ఆమెపై అత్యాచారం చేసాడు అని నివేదికల ప్రకారం తెలిసింది.

నివేదిక ప్రకారం, ఆ మహిళపై అత్యాచారయత్నం చేయడానికి అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించగా, పశువుగా ప్రవర్తిస్తున్నారు అతడిని ఆపలేక, ఆ పక్కనే ఉన్న షేవింగ్ బ్లేడ్‌ని తీసుకుని అతని జననాంగాలను పాక్షికంగా కోసేసింది ఆ మహిళ. అయితే గాయపడిన నిందితుడి దగ్గర నుంచి తనను తాను రక్షించుకుని ఆ మహిళ చుట్టుపక్కల వారిని పిలవడం జరిగింది. వెంటనే ఆ గ్రామ ప్రజలు ఏదో జరిగిందని గుర్తించి ఆ మహిళ ఉంటున్న ఇంటికి రాగా అప్పటికే ఆ నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది.

ఈ పొరపాటు ఎలా జరిగింది: 

అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాను పడుకునేటప్పుడు తన ఇంటి పైకప్పుకు ఉన్న తలుపును ద్వారా లోపలి నిందితుడు రావడం జరిగింది కాకపోతే, లోపల నుంచి లాక్ చేయడం మరచిపోయానని, దాని ద్వారా ఆ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని మహిళ పోలీసులకు తెలిపింది.

“ఆత్మరక్షణలో భాగంగా ఆ మహిళ చేసిన దాడిలో నిందితుడు జననాంగాలు పాక్షికంగా చీలిపోయాయి. అత్యాచారానికి గురైన బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపుతుండగా నిందితుడిని అరెస్టు చేశాం” అని బంకా టౌన్ ఎస్‌హెచ్‌వో శంభు యాదవ్ శనివారం తెలిపారు.

అత్యాచార సంఘటనలు ఎందుకు ఎక్కువవుతున్నాయి: 

మునపటి కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాచారాలు ఎక్కువయ్యాయని తెలుస్తుంది. ఎన్నో కౌన్సిలింగ్స్ ఇస్తున్నప్పటికీ, ఎంతో బాగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, భారతదేశంలో కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాలలో ఇదే తరహా అత్యాచారాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం చిన్నతనం నుంచి పిల్లలకు వారి పెద్దలు క్రమ పద్ధతిలో మంచి చెడులు చెప్పకపోవడం. అసలు ఆడవారిని గౌరవించడం నేర్పించకపోవడం. మగవారు ఏమి చేసినా చెల్లుతుంది అని కొంతమంది అనుకోవడం. కానీ నిజానికి చట్టం ఇటువంటివి పట్టించుకోదు. తప్పు ఎవరు చేసినప్పటికీ శిక్ష పకపడుతుంది. అది ధనవంతుడైన దరిద్రుడైన ఆ చట్టం చూడదు. కానీ కొన్ని కొన్ని సార్లు నిందితులను శిక్షించడంలో కూడా, పొరపాట్లు జరిగిన సంఘటనలు లేకపోలేదు. ఏది ఏమైనా, ప్రతి ఒక్కరిలో ఎదుట మనిషిని గౌరవించాలి అనే భావన అవగాహన కల్పించినప్పుడే, భారత దేశంలోనే కాకుండా ఇంకా ఇతర దేశాలలో కూడా ఇలాంటి అత్యాచారాలు తగ్గుముఖం పడతాయి.  ఇప్పుడు బీహార్ లో జరిగిన సంఘటనలో, ఆ అమ్మాయి జీవితం పూర్తిగా నాశనం అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుందాం.