యువ‌కుడి ప్రాణం తీసిన మోమో ఛాలెంజ్

బీహార్ లోని మరో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్స్ అంతా సరదాగా మోమోలు తినే ఛాలెంజ్ పెట్టుకుంటారు. కానీ ఈ చాలెంజ్ ఒక యువకుడికి శాపంగా మారింది. మోమోలు తిన్న అనంతరం ఆ యువకుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అబ్బాయి ప్రాణాలు విడిచినట్లు హాస్పటల్ వారు నిర్ధారించారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అసలు ఇటువంటి ఛాలెంజ్ ప్రాణాల మీదకి ఎలా వచ్చిందని ఆరా […]

Share:

బీహార్ లోని మరో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్స్ అంతా సరదాగా మోమోలు తినే ఛాలెంజ్ పెట్టుకుంటారు. కానీ ఈ చాలెంజ్ ఒక యువకుడికి శాపంగా మారింది. మోమోలు తిన్న అనంతరం ఆ యువకుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అబ్బాయి ప్రాణాలు విడిచినట్లు హాస్పటల్ వారు నిర్ధారించారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అసలు ఇటువంటి ఛాలెంజ్ ప్రాణాల మీదకి ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నారు.

అసలు ఏం జరిగింది: 

అయితే బీహార్ లోని మొబైల్ రిపేర్ షాప్లో పనిచేస్తున్న బిపిన్ కుమార్ అనే యువకుడు, ఎప్పటిలాగే షాపుకు వెళ్లి అక్కడ పని చేసుకుని తన స్నేహితులని సరదాగా కలవడానికి వెళ్ళాడు. అయితే వాళ్ల స్నేహితులు ఈ అబ్బాయి అందరూ కలిసి మోమోలు తినే పోటీ పెట్టుకుంటారు. తర్వాత చాలెంజ్ లో భాగంగా బిపిన్ కుమార్ ఎక్కువగా మోమోలు తినడం జరుగుతుంది. మోమోలు తిన్న కొద్దిసేపటికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు బిపిన్ కుమార్. స్నేహితులు ఎంత లేపినప్పటికీ బిపిన్ కళ్ళు తెరవకపోవడంతో, స్నేహితులు బయోందోళనతో ఆ అబ్బాయిని హాస్పిటల్కి తరలిస్తారు. కానీ అప్పటికే మోమోలు తినడం కారణంగా ఫుడ్ పాయిజన్ అయిందని, అందుకే ఆ అబ్బాయి చనిపోయాడు అని హాస్పిటల్ వారు నిర్ధారిస్తారు. 

స్నేహితులే చంపేశారు అంటున్న తండ్రి: 

అయితే మరోపక్క హాస్పిటల్ వారు ఫుడ్ పాయిజన్ అవ్వడం కారణంగానే బిపిన్ కుమార్ చనిపోయాడని నిర్ధారించినప్పటికీ. బిపిన్ తండ్రి మాత్రం తన స్నేహితుల కారణంగానే తన కొడుకు బిపిన్ కుమార్ మరణించాడని వాపోతున్నాడు. తమ స్నేహితులు కావాలనే ప్లాన్ చేసి ఇదంతా చేశారని, ప్లాన్లో భాగంగానే మోమోలు తినడం ఛాలెంజ్ పెట్టుకున్నట్లు బిపిన్ తండ్రి ఆరోపించాడు. తన కొడుకుని ఎలాగైనా చంపాలని ఇదంతా ప్లాన్ చేసుకుని తన స్నేహితులు చేశారని కంప్లైంట్ చేస్తున్నాడు. 

ఏది నిజం: 

అయితే ప్రస్తుతానికి పోలీసులు ఈ సమాచారాన్ని తీసుకుని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నారు. అంతేకాకుండా మరోసారి మెడికల్ రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. చాలామంది స్నేహితులు ఇదే రకంగా లేనిపోని చాలెంజ్ ఆటలు ఆడడం ప్రాణాలు మీదకు తెచ్చుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. 

కొన్నిసార్లు మనం చూసే ఉంటాము, చాలామంది పిల్లలు రన్నింగ్ లో ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించారు. అందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. నిజానికి ఇటువంటి ప్రాణాలు మీదకు తెచ్చుకునే పోటీలు ఎంతవరకు కరెక్ట్? ఒక పక్క తమ తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలతో ఉండగా, మరోపక్క పిల్లలు తల్లితండ్రుల ఆశలని అడియాసలు చేస్తున్నారు. లేనిపోని పోటీలు పెట్టుకుని తమ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. 

పోటీ పడడంలో తప్పులేదు కానీ ఆ పోటీ ఎంతవరకు తమకి అవసరం? ఆ పోటీ వల్ల వారికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అనేది పిల్లలు ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చదువుల్లో పోటీ పడడం పిల్లలు నేర్చుకోవాలి. ఇష్టంతో చదువుకోవాలి. తెలియనివి స్నేహితుల ద్వారా తెలుసుకోవాలి. ఇలా చదువుల విషయాలు పక్కన పెట్టి లేనిపోని పోటీలు పెట్టుకుని తమ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.