మైనారిటీ స్కాలర్ షిప్ స్కామ్ గుట్టురట్టు

స్కామ్.. స్కామ్.. స్కామ్ మన ఇండియాలో అనేక విషయాల్లో స్కామ్స్ జరగడం సాధారణమే. కామన్ మ్యాన్ కూడా ఈ స్కామ్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశాడు. కామన్ మ్యాన్ నిత్యజీవితంలో స్కామ్స్ ఒక భాగం అయ్యాయి. ఈ స్కామ్స్ నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కించాలని కొంత మంది చర్చలు వాదోపవాదాలు చేస్తుంటే స్కామ్స్ చేసే వారు మాత్రం కొత్త పంథాలో వినే వారు షాక్ అయ్యే రీతిలో స్కామ్స్ కు తెరలేపుతున్నారు.  తాజాగా మన దేశంలో ఓ […]

Share:

స్కామ్.. స్కామ్.. స్కామ్ మన ఇండియాలో అనేక విషయాల్లో స్కామ్స్ జరగడం సాధారణమే. కామన్ మ్యాన్ కూడా ఈ స్కామ్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశాడు. కామన్ మ్యాన్ నిత్యజీవితంలో స్కామ్స్ ఒక భాగం అయ్యాయి. ఈ స్కామ్స్ నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కించాలని కొంత మంది చర్చలు వాదోపవాదాలు చేస్తుంటే స్కామ్స్ చేసే వారు మాత్రం కొత్త పంథాలో వినే వారు షాక్ అయ్యే రీతిలో స్కామ్స్ కు తెరలేపుతున్నారు.  తాజాగా మన దేశంలో ఓ స్కామ్ బయటికొచ్చింది. ఈ స్కామ్ గురించి వింటే ఎవరికైనా సరే వామ్మో ఇలా కూడా స్కామ్ చేస్తారా ఇదేంది అని అనిపిస్తుంది. అటువంటి స్కామ్ వెలుగు చూడడంతో ఈ స్కామ్ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విచారణకు ఆదేశించారు. చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలిస్తూ ఈ స్కామ్ తాలూకూ నిజా నిజాలను మొత్తం బయటపెట్టాలని సీబీఐని పురమాయించారు. 

అవన్నీ బోగసే..

మన దేశంలో పేద మైనారిటీ విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం మైనారిటీ స్కాలర్ షిప్ లను మంజూరు చేస్తూ వస్తోంది. కొంత మంది అవినీతి పరులు వీటిని కూడా వదల్లేదు. బోగస్ ఇన్ స్టిట్యూట్లను నెలకొల్పి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 144.83 కోట్లను లూటీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ఇలా జరుగుతోందని సదరు మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో బట్ట బయలైంది. దీంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయం మీద సీబీఐ విచారణకు ఆదేశించారు. కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. 

ఫిర్యాదు చేసిన మంత్రిత్వ శాఖ

ఈ విషయాన్ని గుర్తించిన సదరు మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై నెల 10న మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన మంత్రి ఈ కుంభకోణం గురించి విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. దేశంలో ఒక ప్రాంతంలో అని కాకుండా 34 రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో 1572 సంస్థలను తనిఖీ చేయగా… 830 సంస్థలు ఇలాగే మోసాలు చేస్తున్నాయని బయటపడింది. 34 రాష్ట్రాలకు గాను 21 రాష్ట్రాల్లోనే గణాాంకాలు వచ్చాయి. ఇంకా మిగతా రాష్ట్రాల్లో దర్యాప్తు కొనసాగుతోందని సదరు సంస్థ తెలియజేసింది. 

గుట్టుచప్పుడు కాకుండా… 

మైనారిటీ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం అర్హులైన మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు మంజూరు చేస్తోంది. ఈ మైనారిటీ స్కాలర్ షిప్ ల మీద కన్నేసిన కొంత మంది కేటుగాళ్లు వీటిని ఎలాగైనా కాజేయాలని పథకం వేశారు. అనుకున్నదే తడవుగా పథకం అమలు చేశారు. బోగస్ విద్యార్థులతో బోగస్ ఐడెంటిటీలు క్రియేట్ చేసి వారి పేరు మీద స్కాలర్ షిప్ లకు అప్లై చేస్తున్నారు. ఇలా మైనారిటీ శాఖ నుంచి ప్రతి ఏడాది స్కాలర్ షిప్ లు క్లెయిమ్ చేస్తున్నారు. 

ఏ రాష్ట్రాల్లో ఎన్ని సంస్థలంటే… 

ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన దర్యాప్తు సంస్థ ఏ రాష్ట్రంలో మొత్తం ఎన్ని సంస్థలు నకిలీవి ఉన్నాయో ఇలా మోసాలకు పాల్పడుతున్నాయో లెక్కలు తీసింది. అందులో కొన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే… 

చత్తీస్ గఢ్: రాష్ట్రంలో మొత్తం 62 సంస్థలు బోగస్ వి అని దర్యాప్తు సంస్థ తెలిపింది. 

రాజస్థాన్: ఇక్కడ మొత్తం 128 సంస్థలను దర్యాప్తు సంస్థ తనిఖీ చేసింది. వీటిల్లో 99 సంస్థలు నకిలీవని సీబీఐ తేల్చింది.

అస్సాం: ఇక్కడ 68 శాతం సంస్థలు నకిలీవని బయటపడ్డాయి. 

కర్ణాటక: ఈ రాష్ట్రంలో 64 శాతం సంస్థలు నకిలీవని తేలింది. 

ఉత్తర్ ప్రదేశ్: రాష్ట్రంలో 44 శాతం సంస్థలు నకిలీవని సంస్థ తేల్చింది. 

పశ్చిమ బెంగాల్: మమత పాలనలో ఉన్న బెంగాల్ రాష్ట్రంలో 39 శాతం సంస్థలు బోగస్ అని తేలింది. రాష్ట్రాల వారీగా ఇలా రికార్డులు మొత్తం రావడంతో అంతా షాక్ కు గురయ్యారు.