మోడీ – పుతిన్ బంధంపై అమెరికా వైఖరి గురించి జో బైడెన్ వ్యాఖ్యలు

ఒక వైపు అమెరికాతో స్నేహం కొనసాగిస్తూనే మరో వైపు రష్యాతోనూ భారత్ చెలిమి చేస్తున్నది. భారత్ తన దౌతనీతిని ప్రదర్శిస్తొంది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి డిప్లమసీని మోడీ కంటిన్యూ చేస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఇటు రష్యా పుతిన్ తోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. రష్యా – ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో పలు దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. భారత్ […]

Share:

ఒక వైపు అమెరికాతో స్నేహం కొనసాగిస్తూనే మరో వైపు రష్యాతోనూ భారత్ చెలిమి చేస్తున్నది. భారత్ తన దౌతనీతిని ప్రదర్శిస్తొంది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి డిప్లమసీని మోడీ కంటిన్యూ చేస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఇటు రష్యా పుతిన్ తోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. రష్యా – ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో పలు దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. భారత్ మాత్రం ఇటు ఉక్రెయిన్ కు సహాయ సహకారాలను అందిస్తూనే రష్యాతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారత్ – రష్యాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు జరగబోతున్నాయనే వార్తలు వినబడుతున్నాయి. స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అంటే .. రష్యాలో మన వ్యాపారాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా పెట్టుకోవచ్చు. అలాగే రష్యా కూడా ఇక్కడ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా అనుమతులు వచ్చేస్తాయి. అయితే ఏ ఏ రంగాల్లో అన్నటువంటి విషయాలపై స్టడీ చేస్తున్నారు. గోధుమలకు సంబంధించిన వ్యాపారాలు, ఇతర రా మెటీరియల్స్ కి సంబంధంచిన వ్యాపారాలకి భారత దేశంలోకి వాళ్లు, వాళ్ల దేశంలోని మనం వెళ్లి చేసుకునేందుకు ఒప్పందాలు కుదురుతాయి. దీనికి సంబంధించి ప్రిపరేషన్ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. 

వాణిజ్య ఒప్పందంతో ద్వైపాక్షిక ట్రయల్స్ మరింత బలపేతం చేయాలని భారత్, రష్యా యోచిస్తొంది. న్యూ ఢిల్లీ మరియు మాస్కో స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ లో యుద్దాన్ని విస్తరిస్తున్నా భారత్ మరియు రష్యా లతో ద్వైపాక్షిక పెట్టుబడి సంబంధాలను మరింత పెంచే వాణిజ్య వ్యాపారాల ముందస్తు ఒప్పందాలపై ఇరుపక్షాలు చర్చించినట్లు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల తెలిపారు. ఈ ఏడాది జీ – 20 సదస్సు భారత్ అతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో సెప్టెంబర్ లో జరిగే జీ – 20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హజరవుతారనే మాట వినబడుతోంది. ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య దైపాక్షిక, వాణిజ్య సంబంధాలపైనా చర్చ జరుగుతుంది. భారత్ రష్యాతో సంబంధాలు కొనసాగిస్తుండటంపై ఆమెరికా మాజీ రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశం వ్యూహాత్మక మౌనం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆమెరికా మాజీ రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్ అన్నారు. భారత్ రష్యా దగ్గర అవ్వడం ప్రస్తుతానికి అమెరికాకు చెడుకాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి భారత్ మద్దతు ఇవ్వదని ఆయన పేర్కొన్నారు. భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలపడి గణనీయంగా పెరిగాయన్న మాజీ రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్ తాము కొంత సహనం ప్రదర్శించాలన్నారు. 

భారత్ పొరుగున్న ఉన్న డ్రాగన్ దేశం చైనా, మరో పక్క పాకిస్థాన్ లో తరచు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అటు అమెరికా, ఇటు రష్యాతో తన మైత్రీ బంధాన్ని కొనసాగిస్తున్నది. రక్షణ రంగానికి అవసరమైన వాటిని రష్యాను భారత్ పొందుతున్నది. ఈ విషయాలను గమనించే ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విషయంలో భారత్ కాస్త వణుకుతోందని విమర్శించారు. భారత్ కొంత వరకు వణుకుతోందని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఒంటరి చేసే విషయంలో అమెరికా, ఇతర మిత్ర దేశాలకు భారతదేశం ఒక మినహాయింపుగా నిలుస్తొందని బైడెన్ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తొందని బైడెన్ వ్యాఖ్యానించారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్ ను మినహాయించినట్లేనని పేర్కొన్నారు. భారత్ లో స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.