Minister Amarnath: భోగాపురం విమానాశ్రయంలో 50 వేల ఉద్యోగాలు: మంత్రి అమర్‌నాథ్‌

భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి

Courtesy: Twitter

Share:

Minister Amarnath: సామాజిక సాధికార బస్సు యాత్రలో( Samajika Sadhikara Yatra) భాగంగా మంగళవారం విజయనగరం (Vijayanagaram) జిల్లా నెల్లిమర్లలో(Nellimarla) జరిగిన బహిరంగ సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Mantri Gudivada Amarnath) మాట్లాడారు. సీఎం జగన్‌ (CM Jagan) ఇటీవల భూమి పూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Minister Gudivada Amarnath) చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండస్ట్రీయల్ పార్కు (Saripally Industrial Park) అప్గ్రేడ్పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు.

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (CM Y.S. Jagan Mohan Reddy) పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు. రూ. 4,700 కోట్లతో విమానాశ్రయం (Airport) పురోగతిలో ఉంది మరియు ఇది ఒకసారి కార్యరూపం దాల్చితే, ప్రాంతంలోని దాదాపు 50,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అదనంగా, విమానాశ్రయం సమీపంలోని సారిపల్లి పారిశ్రామిక పార్కును (Saripally Industrial Park) ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada Rao) మాట్లాడుతూ.. వైఎస్జగన్సీఎంగా (YS Jagan CM) బా­ధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలి­పారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను ­మూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు.

విభ­జన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్‌ (Hyderabad) ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు.

సీఎం వైఎస్జగన్‌ (CM Jagan) పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర (Deputy Chief Minister Pidika Rajannadora) చెప్పారు. చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్య­ధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ(Loan waiver), డ్వాక్రా రుణాల మాఫీ(Waiver of Dwakra Loans), ఇంటికో ­­ద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి ­చ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశార­న్నా­రు.

ముఖ్యమంత్రి వైఎస్జగన్‌ (CM Jagan) అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పల రాజు (Minister Sidiri Appalaraju) చెప్పారు. ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు.

నెల్లిమర్ల నియోజకవర్గంలో (Nellimarla Constituency) నాలుగున్నరేళ్లలో రూ.­1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్జగన్వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థం­లో విధ్వంసాన్ని టీడీపీ(TDP) రాజకీయం చేస్తే, సీఎం జగన్‌ (CM Jagan) మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు.

వైఎస్సార్సీపీ (YSRCP) రీజనల్కోఆర్డినేటర్వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్స­య్య, కంబాల జో­గు­లు, కడుబండి శ్రీనివాసరా­వు, గిరిజన కార్పొరేషన్చైర్మన్శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్చైర్మన్అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.