భీం ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ పై కాల్పులు

ఉత్తరప్రదేశ్ లో ఊహించని తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి ఎదురైంది. భీం ఆర్మీ అధినేత చంద్ర శేఖర్ ఆజాద్ రావణ్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. రాష్ట్రపు మడుగులో తీవ్రమైన గాయాలపాలైన ఆజాద్ ని వెంటనే హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమం గానే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో కొద్దీ గంటల క్రితమే ఈ దుర్ఘటన జరిగింది. కాల్పులు జరిపిన సమయం లో […]

Share:

ఉత్తరప్రదేశ్ లో ఊహించని తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి ఎదురైంది. భీం ఆర్మీ అధినేత చంద్ర శేఖర్ ఆజాద్ రావణ్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. రాష్ట్రపు మడుగులో తీవ్రమైన గాయాలపాలైన ఆజాద్ ని వెంటనే హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమం గానే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో కొద్దీ గంటల క్రితమే ఈ దుర్ఘటన జరిగింది. కాల్పులు జరిపిన సమయం లో ఆజాద్ వెళ్తున్న ఫార్చూనర్ కార్ లో ఆయనతో పాటుగా 5 మంది ఉన్నారు. వారిలో ఆయన సోదరుడు కూడా ఒకరు. భీం ఆర్మీ పార్టీ లోని ఒక కార్యకర్త భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి భారీ కాన్వాయ్ తో బయలుదేరిన ఆజాద్ కి మార్గం మధ్యలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దుండగులు కూడా కార్ లోని వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్తున్నారు.

బుల్లెట్లు తొలగించారు కానీ..పరిస్థితి విషమమే:

ఈ ఘటన లో ఒక బుల్లెట్టు ఆయన వీపు భాగం లో దూసుకెళ్లింది. మరో బుల్లెట్టు పక్కటెముకులను తీవ్రంగా గాయపర్చింది. అయితే అత్యవసర ఆపరేషన్ ని జరిపిన డాక్టర్లు ఆయన శరీరం లో దిగబడిన రెండు బుల్లెట్స్ ని తొలగించినట్టుగా చెప్పారు కానీ, అప్పటికే ఆయన రక్తం బాగా కోల్పోయాడట. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమం గానే ఉందని, ఆబ్సెర్వేషన్ లో పెట్టమని,స్పృహలోకి వచ్చే వరకు ఏమి చెప్పలేము డాక్టర్లు అన్నారట. జరిగిన ఈ ఘటన పై భీం ఆర్మీ ఆగ్రహావేశాలను వ్యక్తపరుస్తుంది. ఇదొక పిరికిబంధ చర్య అని, ఎవరు ఇలాంటి పనులు చేసి ఉంటారో ఊహించగలమని, ఆజాద్ కోలుకుంటే సరేసరి, ఆయనకీ ఎమన్నా అయితే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలకు మా బాధ్యత ఏమి లేదంటూ భీం ఆర్మీ నేతలు మరియు కార్యకర్తలు చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. ఈ సంఘటన జరిగింది అనే విషయం తెలిసిన వెంటనే భీం ఆర్మీ కార్యకర్తలు వేలాది గా సహరాన్ పూర్ ఆసుపత్రికి చేరుకొని, యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వంపై మరియు పోలీస్ యంత్రాంగం పై వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు :

ఈ సంఘటన జరిగిన తర్వాత సహరాన్ పూర్ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులకు కేంద్ర నిలయం అయ్యింది. కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహం తో ఉండడాన్ని గమనించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బందోబస్తు ని బాగా పటిష్టం చేసారు. కంట్రోల్ చెయ్యలేని పరిస్థితులు ఏర్పడడం తో అదనపు బలగం ని కూడా బందోబస్తులోకి దింపారు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇంత పబ్లిక్ గా దాడులు ఎలా చేయగలిగారు?. సొంత పార్టీ లో ఉన్నవాళ్లే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారా?, లేదా అధికార పార్టీ కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి పని చేసారా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ రెండు కోణాల్లో దర్యాప్తు చెయ్యడం మొదలు పెట్టారు. అతి త్వరలోనే కాల్పులు జరిపిన దుండగులను పట్టుకుంటామని ఈ సందర్భం గా మీడియా కి తెలిపారు. మరో పక్క ఉత్తరప్రదేశ్ లో ఉన్న భీం ఆర్మీ అభిమానులు ఆజాద్ తొందరగా కోలుకోవాలని, ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకూడదు అంటూ దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకొని మళ్ళీ రాజకీయ రణరంగం లోకి దూకి తనని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలు మరియు అభిమానులకు అండగా నిలబడాలని మనం కూడా కోరుకుందాం.