భరత్ పూర్ లో ఎన్కౌంటర్

భరత్ పూర్ లో బిజెపి లీడర్స్ ని చంపిన గ్యాంగ్ స్టార్ కుల్దీప్  జాగినాను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు కస్టడీలో నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్లోని భరత్పూర్ కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో చోటుచేసుకుంది. జరిగినది ఇది: నాలుగు సంవత్సరాల క్రితం గ్యాంగ్ స్టార్ కులదీప్  జగినా,  బిజెపి లీడర్ కృపాల్ సింగ్ మరో నలుగురు గుండాలతో రాత్రి 11 గంటలకి, […]

Share:

భరత్ పూర్ లో బిజెపి లీడర్స్ ని చంపిన గ్యాంగ్ స్టార్ కుల్దీప్  జాగినాను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు కస్టడీలో నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్లోని భరత్పూర్ కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో చోటుచేసుకుంది.

జరిగినది ఇది:

నాలుగు సంవత్సరాల క్రితం గ్యాంగ్ స్టార్ కులదీప్  జగినా,  బిజెపి లీడర్ కృపాల్ సింగ్ మరో నలుగురు గుండాలతో రాత్రి 11 గంటలకి, కృపాల్ సింగ్ తన కారులో ఇంటికి వస్తున్న సమయంలో చుట్టుముట్టి కృపాల్ సింగిని హత్య చేశారు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత పోలీసుల విచారణ జరిపించి గ్యాంగ్స్టర్ కుల్దీప్ జగినాను, మహారాష్ట్రలోని కోలాపూర్ అనే ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో నుంచి న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. అక్కడ తీర్పు వెల్లడించిన తర్వాత కొంతసేపటికి పోలీస్ కస్టడీలో అతన్ని కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్లడానికి బయలుదేరారు. అదే సమయంలో గ్యాంగ్స్టర్ చాకచక్యంగా తప్పించుకోవడానికి దారి వెతికాడు. అప్పుడు వాళ్ల దగ్గర ఉన్న కారం పొడిని పోలీసు వారిపై జల్లి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పోలీసు వారు వారిపై కాల్పులు చేయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి జగినా పోలీస్ కాల్పుల్లో మరణిస్తాడు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, పాత నేరస్తుడిగా గుర్తించి అతను, కొన్ని సంవత్సరాల క్రితం బిజెపి నాయకుడైన కృపాల్ సింగ్ ని హత్య చేసి తప్పించుకుని తిరుగుతుండగా, మహారాష్ట్రలోని పోలీసు వారికి చిక్కాడు. అప్పుడు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీస్ వారు తమ కస్టడీలో ఉంచారు. తరువాత కోర్టుకు తీసుకువెళ్లి న్యాయస్థానం ముందు హాజరపరిచి తీర్పు వెల్లడించిన తర్వాత కోర్టు నుండి జైలుకు తీసుకెళ్లే తరుణంలో అతడు పోలీసులపై కారంపొడి జల్లి తప్పించుకుందామని ప్రయత్నించగా, ఆ సమయంలో పోలీసు వారు అతడి పై కాల్పులు జరిపారు. అమౌలి టోల్ ప్లాజా దగ్గర అతను మరణించాడు. అతని బాడీని హాస్పిటల్ కి తరలించగా అక్కడ 100 మందికి పైగా పోలీసులు చేరుకున్నారు. 

ఇది పోలీసులు పై తిరుగు దాడి చేసినట్లు, అందుకే పోలీసులు అతనిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని మీడియాకు తెలిపారు. కృపాల్ సింగ్ మర్డర్ వెనుక ఉన్న రాజకీయ సంబంధాలు మరియు వ్యక్తిగత సంబంధాలు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చంపడం క్షమించడానికి పాపం:

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువైపు నుంచి ఎవరు వచ్చి ఎవరిని చంపుతారో అర్థం కాని పరిస్థితి. కలికాలం అంటే ఇదే అంటున్నారు చాలా మంది. పగలు ప్రతీకారాలతో ప్రతి మనిషి తన మనసును కల్మషం చేసుకుంటున్నాడు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక మనిషిని మరొక మనిషి చంపడం అనేది చాలా పాపం. అసలు సాటి మనిషిని చంపాలి అని ఆలోచన తప్పు. ఎదుటివారు మన మీద విషం కక్కుతున్నారు అని తెలిసినప్పటికీ, మన తరఫునుంచి మంచి మనసుతో వారిని మార్చడానికి ట్రై చేయాలి. కుదరకపోతే, పోలీసు వారిని లేదంటే ఊరి పెద్దలను సంప్రదించాలి. ఇలాంటివి ఏమీ చేయకుండా ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటూ, చంపుకుంటూ పోతే మనిషి అనే వాడు మృగం కన్నా హీనంగా అయిపోతాడు.