కొత్త E-చలానా స్కామ్ నుంచి తప్పించుకోండిలా..

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరాలు ఎక్కువగా అయిపోతున్నాయి. గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం, జాబు పేరు మీద సైబర్ నేరాలు ఎక్కువ అవడం. చూసుకుంటూ పోతే, అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ లో నుంచి డబ్బులు కాజేయడానికి అనేకమైన ప్లాన్స్ వేస్తున్నారు.  నకిలీ E-చలానా స్కామ్:  నకిలీ ఈ-చలాన్ స్కాంపై ఫరీదాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన సమాచారం ఆధారంగా ఈ-చలాన్ లింక్‌గా మన మొబైల్ ఫోన్ […]

Share:

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరాలు ఎక్కువగా అయిపోతున్నాయి. గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం, జాబు పేరు మీద సైబర్ నేరాలు ఎక్కువ అవడం. చూసుకుంటూ పోతే, అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ లో నుంచి డబ్బులు కాజేయడానికి అనేకమైన ప్లాన్స్ వేస్తున్నారు. 

నకిలీ E-చలానా స్కామ్: 

నకిలీ ఈ-చలాన్ స్కాంపై ఫరీదాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన సమాచారం ఆధారంగా ఈ-చలాన్ లింక్‌గా మన మొబైల్ ఫోన్ కి లింక్‌లను పంపుతూ స్కామర్లు సామాన్య ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. ఇంకా, ఈ లింక్‌లు మీద క్లిక్ చేసిన వెంటనే వినియోగదారులను ప్రభుత్వ వెబ్‌సైట్‌గా కనిపించే వెబ్ పేజీకి డ్రైవర్ అవుతాయి. ఈ స్కామ్‌పై అవగాహన కల్పించేందుకు అధికారులు సోషల్ మీడియాలో సమాచారాన్ని కూడా పంచుకున్నారు.

అధికారులు సోషల్ మీడియాలో సమాచారాన్ని ఇన్ఫోగ్రాఫిక్ పిక్చర్ రూపంలో పంచుకున్నారు, మీకు ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కి లింక్ వస్తే, అటువంటి లింక్‌లను క్లిక్ చేయవద్దు. చెల్లింపు కోసం ఈ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా, మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి అంటూ, పోలీసులు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులకు ఇ-చలాన్ రూపంలో పొందే ఏవైనా లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఫరీదాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధికారుల ప్రకారం, మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ పొందడానికి ఈ బోగస్ URLలలో ఒకదానిపై క్లిక్ చేస్తే చాలు, తర్వాత మొత్తం అకౌంట్ లో ఉన్న డబ్బుని కాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఇటువంటి పనులు అస్సలు చేయొద్దు: 

ముఖ్యంగా వాహనదారులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ చలానా పేరు మీద మీ మొబైల్ ఫోన్ కి లింకు వచ్చినప్పుడు, పొరపాటున ఎవరైనా వాహన యజమాని లింక్‌పై క్లిక్ చేసి, వారి బ్యాంక్ ఖాతా నంబర్ మరియు క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఇచ్చినట్లయితే, మోసగాళ్లు ముందుగా వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేసి, కొంత సమయం తర్వాత, వారి ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తం డబ్బుని ఖాళీ చేస్తారు. అందుకే మీ మొబైల్ ఫోన్ కి ఎటువంటి లింకు వచ్చిన సరే మీరు క్లిక్ చేయొద్దు, క్లిక్ చేసినప్పటికీ మీ సమాచారం అందులో ఎంటర్ చేయొద్దు అంటున్నారు పోలీసులు.

నకిలీ E-చలాన్ స్కామ్ మెసేజ్ ఇలా ఉంటుంది: 

స్కామర్లు పంపిన టెక్స్ట్ మెసేజ్ చివరిలో మాత్రం ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. ఉదాహరణకు, “మీ చలాన్ నంబర్. PB08DJXXXX కోసం XXXXXXXX మొత్తం చలాన్ మొత్తం రూ. 500గా ఉంది. ఆన్‌లైన్ చెల్లింపు కోసం సందర్శించండి: https://echallanparivahan.in/, మీరు చలాన్ కట్టేందుకు RTO కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. అభినందనలు, RTO.”

నకిలీ E-చలాన్ స్కామ్ లింక్ ఇలా గుర్తించాలి: 

ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మెరుగైన అవగాహన కల్పించడంలో సహాయపడటానికి, నిజమైన ఇ-చలాన్ లింక్ మరియు నకిలీ లింక్ మధ్య వ్యత్యాసాన్ని చూపించడానికి పోలీసు శాఖ సోషల్ మీడియాలో ఒక ఎగ్జాంపుల్ అనేది పంచుకోవడం జరిగింది. అధికారిక ఇ-చలాన్ లింక్ ఎల్లప్పుడూ “.gov.in”తో ముగుస్తుందని గమనించాలి. ఉదాహరణకు, “https://echallan.parivahan.gov.in/.” అయితే, నకిలీ చలాన్ లింక్‌లో “gov.in” ఉండదు. ఉదాహరణకు, “https://echallan.parivahan.in/” అనేది నకిలీ చలానా లింక్.

అయితే ఇటువంటి నకిలీ చలానా కట్టమంటూ మీ మొబైల్ కి ఒకవేళ మెసేజ్ వస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ లింక్ క్లిక్ చేసి మోసపోయినట్లు గ్రహించిన సరే, ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు మీ ఖాతా నుంచి డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా నిలిపివేస్తారు. అంతే కాకుండా, ఇలా ఎవరికైనా జరిగినట్లయితే ప్రతి ఒక్కరు వారి స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ హెల్ప్ డెస్క్‌ను కూడా సందర్శించవచ్చు అని చెప్పారు పోలీసులు.