బెంగళూరులో ఆటోల్లో కన్నడ భాష బేసిక్స్‌

భాషను అమితంగా ప్రేమించే వాళ్లల్లో తమిళులు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. వారికి వారి భాష తమిళం అంటే చాలా ఇష్టం. ఆ భాషను ఎవ్వరూ తక్కువ చేసిన చూసినా, మాట్లాడినా వారు సహించరు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిందీని తమిళులపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నించగా, వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు వారి ప్లేసులో కన్నడిగులు చేరారు. వారు కూడా వారి భాషను తక్కువ చేసి చూస్తే సహించడం లేదు. వేరే రాష్ట్రాల నుంచి కర్నాటకకు బతుకుదెరువు […]

Share:

భాషను అమితంగా ప్రేమించే వాళ్లల్లో తమిళులు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. వారికి వారి భాష తమిళం అంటే చాలా ఇష్టం. ఆ భాషను ఎవ్వరూ తక్కువ చేసిన చూసినా, మాట్లాడినా వారు సహించరు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిందీని తమిళులపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నించగా, వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు వారి ప్లేసులో కన్నడిగులు చేరారు. వారు కూడా వారి భాషను తక్కువ చేసి చూస్తే సహించడం లేదు. వేరే రాష్ట్రాల నుంచి కర్నాటకకు బతుకుదెరువు కోసం వచ్చిన వారు కన్నడలోనే మాట్లాడాలని వారు డిమాండ్‌  చేస్తున్నారు. మా రాష్ట్రానికి బతకడానికి వచ్చి, మీరు హిందీ మాట్లాడతారా అంటూ ఇతర రాష్ట్రాల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు హిందీ మాట్లాడే వారిని కచ్చితంగా కన్నడ మాట్లాడాలని డిమాండ్‌  చేస్తున్నారు. 

ఇటీవల బెంగళూరులో కన్నడ మాట్లాడని వారితో ఆటో డ్రైవర్లు గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రోషన్‌రాయ్‌ అనే వ్యక్తి ఈ  వీడియోను పోస్ట్ చేయడంతో గొడవ గురించి  అందరికీ తెలిసింది. దీనిని అత్యధిక మంది జెనోఫోబియా అని అభిప్రాయపడ్డారు. ‘‘మీరు కర్నాటకలో ఉన్నారు. కన్నడ నేర్చుకోండి. మీ భాషను, యాసను, మీ వైఖరిని ఇక్కడ చూపించవద్దు. మీరు ఇక్కడికి అడుక్కుతినడానికి (బతువుదెరువు)  వచ్చారు” అని ఓ కన్నడ ఆటో డ్రైవర్‌‌ అన్న మాటలు  ఆ వీడియోలో ఉన్నాయి.

కర్నాటకలో భాష సమస్యను పరిష్కరించేందుకు ద్రావిషా అనే ట్విట్టర్‌‌ (ఎక్స్) యూజర్‌‌ ఓ పరిష్కారం కనుగొంది. ఆమె తన ఐడియాలను బెంగళూరు ఆటో డ్రైవర్లతో కొన్ని పంచుకుంది. కన్నడ తెలియని వారు బెంగళూరులో ఆటోలు ఎక్కితే వారి కోసం కన్నడ పదాలతో కూడిన కొన్ని పదాలు ఉన్న పోస్టర్‌‌ను అంటించింది. ఆటోలు ఎక్కితే రెగ్యులర్‌‌గా డ్రైవర్లతో వాడే కన్నడ పదాలతో ఆమె ఈ చార్జ్ ని తయారు చేసింది. చిన్న చిన్న కన్నడ పదాలు నెర్చుకోవడానికి ఈ చార్ట్‌ /పోస్టర్లు ప్యాసింజర్లకు ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడుతుంది. ఉదాహరణకు.. చార్జీలు ఎంత? మీరు ఎడమవైపు టర్న్ తీసుకుంటారా? ఆటో డ్రైవర్లతో తరుచూ వాడే పదాలతో ఈ పోస్టర్‌‌ను రెడీ చేసింది. ‘‘ముందు కన్నడలో డ్రైవర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడండి. కన్నడ భాష చనిపోతున్నదన్న భావనతో వారు వారి భాషను బతికించుకోవడానికి కన్నడలో మాట్లాడాలని కోరుతారు” అని పోస్టర్‌ ‌రాసి ఉంది.ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో  పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  

నమ్మ యాత్రి, ఉబెర్‌‌, ఓలా వంటి యాప్‌ల ఆధారంగా లోకేషన్‌ను కమ్యూనికేట్‌ చేయడానికి డ్రైవర్లతో ప్రాంతీయ భాషా పద బంధాలను ప్రవేశపెట్టగలవని ద్రావిషా పేర్కొన్నారు. 

‘‘ఇది చాలా గొప్ప ఆలోచన. దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజా రవాణాకు ఇది అనుకూలంగా ఉంటుంది.టూరిస్టులు, స్థానికుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది” అని ట్విట్టర్‌‌ యూజర్‌‌ ఒకరు కొనియాడారు. మరో యూజర్‌‌ స్పందిస్తూ, ‘‘ఎవరైనా స్థానిక భాషలను ఎలా రక్షిస్తారు. మంచి సూచనల ద్వారానే కదా. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రజల అనాలోచిత ధోరణులతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ, ఆర్థిక వ్యవస్థ వారిని ఈ విధంగా ప్రోత్సహిస్తుంది. ఇతరుల పట్ట నీచంగా, రూడ్‌గా, అమర్యాదగా ఉండకుండా కూడా స్థానికులు వారి భాషను రక్షించుకోవచ్చు” అని ట్విట్టర్‌‌లో రాసుకొచ్చాడు.