రాపిడో బైక్ డ్రైవర్ వెకిలి వేషాలు

రోజురోజుకీ ఆడవాళ్ళతో కొంతమంది ప్రవర్తించే వైఖరి రోజురోజుకీ హద్దు మీరుతోంది. ఇప్పుడు మరో ఘటన బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్న క్రమంలో, తన వంతు సపోర్ట్ గా మణిపూర్ అల్లర్ల గురించి బెంగళూరు టౌన్ హాల్ లో జరుగుతున్న నిరసనకు హాజరయ్యి తిరిగి వెళ్లేందుకు ఒక అమ్మాయి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. కానీ, బైక్ నడుపుతూ బైక్ డ్రైవర్ వేసిన వెకిలి వేషాలు ట్విట్టర్ లో బయట పెట్టింది. ట్విట్టర్లో పోస్ట్ […]

Share:

రోజురోజుకీ ఆడవాళ్ళతో కొంతమంది ప్రవర్తించే వైఖరి రోజురోజుకీ హద్దు మీరుతోంది. ఇప్పుడు మరో ఘటన బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్న క్రమంలో, తన వంతు సపోర్ట్ గా మణిపూర్ అల్లర్ల గురించి బెంగళూరు టౌన్ హాల్ లో జరుగుతున్న నిరసనకు హాజరయ్యి తిరిగి వెళ్లేందుకు ఒక అమ్మాయి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. కానీ, బైక్ నడుపుతూ బైక్ డ్రైవర్ వేసిన వెకిలి వేషాలు ట్విట్టర్ లో బయట పెట్టింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన అనంతరం బెంగళూరు పోలీసులు స్పందించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, వేషాలు వేసిన వాడిని అరెస్టు చేయడం జరిగింది. 

జరిగిన  విషయం: 

బెంగళూరులో నివాసం ఉంటున్నా అతిర పురుషోత్తం అనే యువతి,ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్న క్రమంలో, తన వంతు సపోర్ట్ గా మణిపూర్ అల్లర్ల గురించి బెంగళూరు టౌన్ హాల్ లో జరుగుతున్న నిరసనకు హాజరయ్యి తిరిగి వెళ్లేందుకు తను రాపిడో ఆటో బుక్ చేసుకుందాం అని అనుకున్నప్పటికీ తనకి అందుబాటులో ఉన్న ఆటోలు అన్నీ కూడా రైడ్ క్యాన్సిల్ చేస్తూనే ఉన్నాయి.. అయితే లేట్ అవుతుంది అని తను రాపిడో బైక్ బుక్ చేసుకోవడం జరిగింది. 

అయితే బుక్ చేసుకున్న తర్వాత ఒక డ్రైవర్ రాపిడో బైక్ మీద కాకుండా వేరే బైక్ మీద తన ముందు ప్రత్యక్షమవుతాడు. అదేంటి అని అడగగా తన రాపిడో బైక్ సర్వీసింగ్ లో ఉందని అందుకే తాను వేరే బైక్ మీద వచ్చాను అని చెప్తాడు డ్రైవర్. అయితే అంత బాగానే అని చెప్పి, ఆ అమ్మాయి ఇంకా లేట్ అవుతుంది అని బైక్ మీద వచ్చిన వ్యక్తి మొబైల్ లో ఉన్న ఆప్ ద్వారా రైడ్ కన్ఫర్మ్ చేస్తుంది. అంతేకాకుండా తను బైక్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బైక్ డ్రైవర్ బిహేవియర్ అసలు బాగోలేనట్లు చెప్పుకొచ్చింది. 

ఎందుకైనా బెటర్ అని చెప్పి తన జాగ్రత్తలో తన ఉంది. కానీ కాస్త దూరం వెళ్లిన తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ రాపిడో బైక్ డ్రైవర్ ఒక చేత్తో బైక్ నడపడం మొదలు పెట్టాడు అని, మరో చేత్తో హస్తప్రయోగం చేసుకుంటున్నట్లు ఆమె ట్విట్టర్లో బైక్ వాడి నిర్వాకం బయటపెట్టింది. తను భయపడుతూ, తన జాగ్రత్త కోసం తను మౌనంగా ఉండి పోయినట్లు పేర్కొంది. అయితే ఆ అమ్మాయి తన ఇంటి అడ్రస్ ను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ, తను దిగాల్సిన దానికంటే 200 మీటర్ల ముందే ఆ బైక్ డ్రైవర్ వేషాల కారణంగా ముందే బైక్ దిగిపోయింది. 

అయితే తాను ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ బైక్ డ్రైవర్ తన నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టాడు. కిస్ ఎమోజి, హార్ట్ ఎమోజి పెడుతూ ఐ లవ్ యు అంటూ పదే పదే మెసేజ్లు పంపించాడు. వెంటనే తన నెంబర్ ని బ్లాక్ చేసింది అతిరా పురుషోత్తం. 

అయితే ప్రస్తుతం జరిగిన విషయాలు గురించి తను ఎదుర్కొన్న సంఘటనను గూర్చి ట్విట్టర్లో స్క్రీన్ షాట్స్ తో సహా పోస్ట్ చేసింది అతిర. అయితే వెంటనే బెంగుళూరు పోలీసులు స్పందించి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, రాపిడో బైక్ డ్రైవర్ ని అరెస్టు చేశారు.