రోడ్ల మరమ్మతుల కోసం లోను తీసుకున్న ఉద్యోగి

భారతదేశంలో రోడ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్ల పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుంది. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. రోడ్డు రవాణా శాఖ వారు రోడ్లు రిపేర్ విషయంలో నిర్లక్ష్యం కారణంగా, రోడ్లమీద ఏర్పడిన గుంతల కారణంగా చాలామంది రోడ్ల ప్రయాణాలు చేసేందుకు కూడా భయపడుతున్నారు. దాంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రోడ్లపై గుంత‌ల‌ను పూడ్చేందుకు ఏకంగా లోను తీసుకున్నాడు. బెంగళూరు యువకుడు ప్రయత్నం: […]

Share:

భారతదేశంలో రోడ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్ల పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుంది. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. రోడ్డు రవాణా శాఖ వారు రోడ్లు రిపేర్ విషయంలో నిర్లక్ష్యం కారణంగా, రోడ్లమీద ఏర్పడిన గుంతల కారణంగా చాలామంది రోడ్ల ప్రయాణాలు చేసేందుకు కూడా భయపడుతున్నారు. దాంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రోడ్లపై గుంత‌ల‌ను పూడ్చేందుకు ఏకంగా లోను తీసుకున్నాడు.

బెంగళూరు యువకుడు ప్రయత్నం:

 ఇంకా బెంగుళూరు విషయంలో ట్రాఫిక్ పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. అంత ట్రాఫిక్ లో రోడ్లమీద ఉండే గుంతలలో ప్రయాణం చేయాలంటే కత్తి మీద సాముతో సమానమే. ఇదంతా గమనించిన 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి తన వైపు నుంచి రోడ్ల విషయంలో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశంతో , నో డెవలప్మెంట్ నో టాక్స్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా బెంగళూరులో ఉండే రోడ్లు అద్వాన పరిస్థితి కారణంగా ప్రాపర్టీ టాక్స్ పేమెంట్ బాయ్ కట్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా బెంగుళూరు హోసా రోడ్డు ప్రాంతంలో రోడ్డు మీద ఉన్న గుంతల కారణంగా పలు యాక్సిడెంట్లు చూసామని ఈయన చెప్పడం జరిగింది. అంతేకా అదే ప్రాంతంలో రాత్రిపూట ప్రయాణం చేస్తున్న డెలివరీ ఏజెంట్ కూడా రోడ్డు మీద ఉన్న గుంతలను తప్పించబోయే పడిపోయేనట్లు తీవ్ర గాయాలు పాలైనట్లు తెలిపారు. కాలికి తీవ్రమైన గాయం కారణంగా ఇప్పుడు పనికి వెళ్లే పరిస్థితి కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా మరో ఆవిడ ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండగా, గొంతులో ఆటో పడిన  కారణంగా ఆమెకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది. ఇవన్నీ విన్న తర్వాత హరిఫ్ ముగ్దుగల్ కి బాధ కలిగింది. అయితే ఐదు సంవత్సరాల క్రితమే ఆరిఫ్ కొంతమంది తో కలిసి సిటిజన్స్ గ్రూప్ ఈస్ట్ బెంగుళూరు అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బెంగళూరులో పలు ప్రాంతాల్లో రోడ్లను బాగుపరచడంలో తమకి డబ్బు అవసరమయ్యే 2.7 లోన్ కూడా తీసుకున్నట్లు తెలిపారు.

ముంబైలో రోడ్ల పరిస్థితి కూడా ఇంతే:

దేశంలో ఎక్కడ చూసినా పాడైపోయిన రోడ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక వాహనదారులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న సంఘటనలు చవిచూడాల్సి వస్తుంది. రోడ్ల మరమ్మత్తులు గురించి ఎంతమంది అధికారులకు చెప్పిన ఉపయోగం లేకుండా పోతోంది. గుంతలమయమైన రోడ్లపై ముంబై సీనియర్ అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గమనించిన హైకోర్టు, శుక్రవారం వారిని కోర్టుకు పిలిపించింది.

కోర్టుకు హాజరైన అధికారులు: 

ముంబై నగరం మరియు శివారు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముంబై హైకోర్టు బుధవారం ముంబై మరియు MMR అంతటా ఉన్న మరో ఐదు మున్సిపల్ కార్పొరేషన్‌ల సివిక్ చీఫ్‌లతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. గుంతలమయమైన రహదారులపై సీనియర్‌ అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గమనించిన హైకోర్టు శుక్రవారం వారిని కోర్టుకు పిలిపించింది.

వీధులు మరియు ఫుట్‌వేలను సరిగ్గా చదునుగా ఉంచడం, పోయిన రోడ్లు మరియు గుంతలు సరిగ్గా పూడ్చబడేలా చూసుకోవడం కార్పొరేషన్ల బాధ్యత అని మునుపటి తీర్పును కోర్టు బుధవారం గమనించింది. “ఏదైనా అవాంఛనీయ సంఘటన వలన ప్రాణనష్టం లేదా అవయవ నష్టం జరిగితే, సంబంధిత మునిసిపల్ కమీషనర్, మెట్రోపాలిటన్ కమిషనర్ మరియు చీఫ్ ఇంజనీర్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి” అని కోర్టు తీర్పులో ఖచ్చితంగా పేర్కొంది.