పన్ను గురించి బెంబేలెత్తిపోతున్న బెంగళూరు వాసి..

బెంగళూరులో ఉంటున్నా సంచిత్ గోయల్ ఇటీవల చేసిన ట్వీట్, సంపాదన మరియు ఖర్చు రెండింటిపై ప్రభుత్వం విధించే పన్నుల గురించి తను ట్విట్టర్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇప్పుడు మంచి సంభాషణ కూడా కొనసాగుతూనే ఉంది.. బాధపడుతున్న ట్యాక్స్ పేయర్:  ఫ్లిప్‌కార్ట్‌లో కేటగిరీ మేనేజర్‌గా పనిచేస్తున్న సంచిత్.. తన ఆదాయంలో 30% ప్రభుత్వానికి పన్నుగా ఇవ్వాలని, తన అవసరాలకు ఖర్చు చేయడానికి కేవలం చాలా తక్కువ మాత్రమే మిగిల్చానని, […]

Share:

బెంగళూరులో ఉంటున్నా సంచిత్ గోయల్ ఇటీవల చేసిన ట్వీట్, సంపాదన మరియు ఖర్చు రెండింటిపై ప్రభుత్వం విధించే పన్నుల గురించి తను ట్విట్టర్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇప్పుడు మంచి సంభాషణ కూడా కొనసాగుతూనే ఉంది..

బాధపడుతున్న ట్యాక్స్ పేయర్: 

ఫ్లిప్‌కార్ట్‌లో కేటగిరీ మేనేజర్‌గా పనిచేస్తున్న సంచిత్.. తన ఆదాయంలో 30% ప్రభుత్వానికి పన్నుగా ఇవ్వాలని, తన అవసరాలకు ఖర్చు చేయడానికి కేవలం చాలా తక్కువ మాత్రమే మిగిల్చానని, ట్విట్టర్‌లో తన నిరాశను వ్యక్తం చేశాడు.

తాను సంపాదించిన దాంట్లోనే కాకుండా, తను కాఫీ తాగడానికి ఖర్చు పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా, తను 28% పన్ను కట్టాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాడు. తన ఆదాయంలో 50% కంటే ఎక్కువ ప్రభుత్వానికి ఇవ్వడానికి అతను ఎక్కువ గంటలు పని చేస్తున్నాడని గ్రహించిన సంచిత్, జీతాలు తీసుకునే ప్రతి మనిషి కూడా ఎదుర్కొంటున్న పన్ను భారాన్ని ఎత్తిచూపారు.

అంతేకాకుండా తను చేసిన మరో ట్వీట్‌లో, షుగర్, క్రీమ్ మరియు చాకో-బార్ వంటి ఉత్పత్తులపై విధించిన పన్నులను సంచిత్ మరింత హైలైట్ చేశాడు. చక్కెర, కోకో, పాలు మరియు క్రీమ్‌పై 18% జిఎస్‌టితో సహా వివిధ పన్నుల ద్వారా ప్రభుత్వం చాకో-బార్ ధరలో, దాదాపు 27.5% సంపాదించిందని ఆయన ఎత్తి చూపారు.

సంచిత్ చేసిన ట్వీట్లు ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. చాలామంది ప్రస్తుతం ట్విట్టర్ వినియోగదారులు తమ కడుతున్న పన్ను బాధలను పంచుకున్నారు. చాలా మంది వినియోగదారులు మధ్యతరగతి ప్రజలపై పన్నుల ప్రభావాన్ని హైలైట్ చేశారు, అంతేకాకుండా భారత దేశ ప్రజలు కేవలం పన్ను కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నట్లు ఉంది అని ఉదేశపడ్డారు. 

ట్విట్టర్ కామెంట్లు: 

అయితే ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారింది. పన్ను గురించి తను పడుతున్న బాధ వివరంగా వివరించాడు సంచిత్. తను కాఫీ తాగడానికి వెళ్లినప్పటికీ కూడా తను ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు. సంపాదించిన దాంట్లోనే కాదు ఖర్చు పెట్టే దాంట్లో కూడా ట్యాక్స్ పే చేస్తున్నందుకు చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో బయటపెట్టారు. కొంతమంది సంచిత్ చేసిన ట్వీట్కు సపోర్ట్ చేస్తూ, మనిషిగా పుట్టినందుకు ప్రతి వాటి మీద పన్ను చెల్లించాల్సి వస్తుందని చాలామంది వాపోయారు. అంతేకాకుండా కేవలం భారత దేశంలోనే ఎక్కువ పన్ను వసూలు రేటు ఉన్నట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. 

మరి కొంతమంది కామెంట్లు పెడుతూ, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు తాగాల్సింది కాఫీ కాదు, కొబ్బరి నీళ్లు అంటున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసే బదులు వ్యవసాయం చేసుకొని పన్ను నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు మరికొందరు. కాఫీకి ట్యాక్స్ కట్టే బదులు, కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద షాపుల్లో ఇప్పుడు కాఫీ తాగాలంటే వందలు వేలు కట్టాల్సిందే, దాని బదులు హాయిగా కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బులు ఆదా కూడా అంటున్నారు పబ్లిక్. 

మరి మీరైతే ట్యాక్స్ గురించి ఏమనుకుంటున్నారు?