ఆఫీస్ స్థలాలకు  డిమాండ్

అయితే ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై బెంగుళూరు నగరాలలో ఆఫీసుల కోసం స్థలాల గిరాకీ అనేది చాలా వరకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో మన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో 1.39 కోట్ల చెదరపు స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు, అధ్యయనం చేసిన వెస్టియన్ సంస్థ తెలిపింది. మొత్తం లీజుకు తీసుకున్న 1.39 చెదరపు స్థలాన్ని లీజులో, ప్రధమ నగరాల చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో సుమారు 82 లక్షల చదరపు అడుగులు ఉన్నాయని […]

Share:

అయితే ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై బెంగుళూరు నగరాలలో ఆఫీసుల కోసం స్థలాల గిరాకీ అనేది చాలా వరకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో మన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో 1.39 కోట్ల చెదరపు స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు, అధ్యయనం చేసిన వెస్టియన్ సంస్థ తెలిపింది. మొత్తం లీజుకు తీసుకున్న 1.39 చెదరపు స్థలాన్ని లీజులో, ప్రధమ నగరాల చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో సుమారు 82 లక్షల చదరపు అడుగులు ఉన్నాయని అంచనా వేసింది. 

ఆఫీస్ స్థలాల డిమాండ్: 

అంతేకాకుండా మొత్తం డిమాండ్ సుమారు 59% ఉన్నట్లు తెలిపింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు వ్యాపార సంస్థలు అలాగే ప్రముఖ కంపెనీలు లీజుకు తీసుకున్న స్థలాల చదరపు అడుగులు 6% తగ్గినట్లు  నివేదిక వెల్లడించింది. సుమారు అన్ని పట్టణాలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ కలకత్తా ఇలాంటి ప్రముఖ నగరాల్లో సర్వే నిర్వహించగా ప్రస్తుతం స్థలాల డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.గ్లోబల్ మార్కెట్లు స్థిరంగా ఉన్నందున, సంవత్సరం ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది అని రావు చెప్పారు. అయితే ముఖ్యంగా స్థలాల డిమాండ్ ఐటి రంగం లోనించే ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. తరువాత లిస్టులో, ఉత్పత్తి రంగాలు, ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాదిలో నెలకొన్న ఆర్థికమాన్యం కారణంగా గతేడాదితో పోలిస్తే ఆరు శాతం భవనాల డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది.

ప్రపంచ ఆర్థికమాన్యం మధ్య పెద్ద దేశీయ సంస్థలు, అదేవిధంగా MNCలు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా, ఏడు ప్రధాన నగరాల్లో, ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో..ఆఫీస్ లీజింగ్ 14.8 మిలియన్ చదరపు అడుగుల నుండి 6 శాతం తగ్గి 13.9 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

ఏప్రిల్-జూన్ 2023 vs ఏప్రిల్-జూన్ 2022:

* చెన్నై లీజింగ్, 1.2 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.

* బెంగళూరులో లీజింగ్, 4.2 మిలియన్ చదరపు అడుగుల నుంచి 12 శాతం తగ్గి 3.7 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది.

* హైదరాబాద్ 2.4 మిలియన్ చదరపు అడుగుల నుంచి 4 శాతం తగ్గి 2.3 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

* ముంబైలో లీజింగ్ 2.4 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.8 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

* పూణేలో మాత్రం డిమాండ్ 6 శాతం పెరిగి 1.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.8 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.

* ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఆఫీస్ లీజింగ్ తగ్గింది. 2.1 మిలియన్ చదరపు అడుగుల నుండి 5 శాతం తగ్గి 2 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

* కోల్‌కతాలో, లీజింగ్ కార్యకలాపాలు 0.8 మిలియన్ చదరపు అడుగుల నుండి 0.1 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయాయి.

* జూన్ త్రైమాసికంలో అత్యధిక మార్కెట్ వాటా 26 శాతంతో లీజింగ్ కార్యకలాపాలలో టెక్నాలజీ (IT) రంగం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

* ఇంజినీరింగ్, తయారీ రంగం ఇప్పుడు లీజింగ్ కార్యకలాపాల్లో 19 శాతం వాటాతో నెక్స్ట్ ప్లేస్ లో ఉంది.