సంచ‌ల‌నంగా మారిన బెంగ‌ళూరు డ‌బుల్ మ‌ర్డ‌ర్లు

బెంగళూరులో జరిగిన ఈ దారుణం అక్కడ జనాల్ని భయాందోళనకు గురిచేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. ఒక కంపెనీ CEO, MDలను హత్య చేయబడ్డారు. హత్య చేసిన వాళ్ళు కంపెనీ ఎందుకు పెట్టారు? ఆ కంపెనీ దేనికి సంబంధించింది? అసలు ఆ కంపెనీ పెట్టడం వల్ల CEO, MDలకి కలిగిన నష్టం ఏమిటి? ఆ కంపెనీ CEO, MD ప్రాణాలు ఎందుకు తీశారు? ఆ కంపెనీలో ఇల్లీగల్ దందా నడుస్తుందా? లేదా […]

Share:

బెంగళూరులో జరిగిన ఈ దారుణం అక్కడ జనాల్ని భయాందోళనకు గురిచేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. ఒక కంపెనీ CEO, MDలను హత్య చేయబడ్డారు. హత్య చేసిన వాళ్ళు కంపెనీ ఎందుకు పెట్టారు? ఆ కంపెనీ దేనికి సంబంధించింది? అసలు ఆ కంపెనీ పెట్టడం వల్ల CEO, MDలకి కలిగిన నష్టం ఏమిటి? ఆ కంపెనీ CEO, MD ప్రాణాలు ఎందుకు తీశారు? ఆ కంపెనీలో ఇల్లీగల్ దందా నడుస్తుందా? లేదా కేవలం పుకార్లేనా! బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు హత్య చేయబడ్డారు అసలు హత్య చేయాల్సిన నేరం వాళ్ళు ఏం చేశారు! ఇలా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఈ కథ చాలా మిస్టరీతో కూడిందే అని చెప్పాలి.

పోలీసుల ఊహాగానాలు:

బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఒక కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు గత కొంతకాలంగా ఒక ప్రైవేట్ కంపెనీలో  పని చేసి మానేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వాళ్లు పని చేసిన CEO, MDలు హత్య చేయబడ్డారు. కేవలం వారి కంపెనీలో పని చేసి మానేసిన అందుకే హత్య చేశారా! దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అసలు వీరిద్దరూ వాళ్ళ పాత ఎంప్లాయిస్ చేతిలో ఎందుకు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లకు వేరే కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ వేరే కంపెనీ పెట్టిన సరే, ముందు పని చేసిన కంపెనీ వల్ల వాళ్లకి ఏంటి ప్రాబ్లం? కేవలం వాళ్ళిద్దరి మరణానికి కారణం కొత్త కంపెనీ ఆ లేదా పాత కంపెనీ ఆ? అసలు వాళ్ళిద్దరికీ పాత కంపెనీతో ఉన్న కక్షలు ఏంటి? CEO, MD వల్ల వాళ్లకి కలిగిన నష్టం ఏమిటి?  ఇలా మనకు చాలా సందేహాలు రావచ్చు. మరి వాటికి సమాధానం ఏమిటో ఒకసారి చూద్దాం.. 

వివరాలు ఇలా ఉన్నాయి:

ఫణీంద్ర సుబ్రహ్మణ్య మరియు విను కుమార్ ఒక కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓలు. వీళ్ళ కంపెనీలో పని చేస్తున్న శభారిష్ వాళ్ళ స్నేహితులతో కలిసి కంపెనీలో నుంచి రిజైన్ చేసి వీళ్ళ సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. శబరీష్ తాను పనిచేస్తున్న ముందు కంపెనీలో కొంతమందిని తమ కంపెనీకి ఆహ్వానించాడు. శభారిష్ పనిచేసిన కంపెనీ సీఈఓ అలాగే ఎండి లకు ఈ విషయం తెలిసింది. అంతేకాకుండా సభారీష్ ని పిలిపించి, తమ కంపెనీలో ఎంప్లాయిస్ ని వారు కంపెనీకి ఆహ్వానించిన తీరుపై మండిపడి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలోనే సభారీష్, తాను ముందు పని చేసిన కంపెనీ సీఈవో అలాగే ఎండి ల పైన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. జోకర్ ఫిలిక్స్ అని పిలవబడే సభారీష్ తన స్నేహితులైన వినయ్ రెడ్డి మరియు సంతోష్లకు విషయాలు చెప్పి ఎలాగైనా ఆ కంపెనీ సీఈవో మరియు ఎండి లను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసుకుంటారు. ఇదే క్రమంలో జులై 11 వ తారీకున మంగళవారం నాడు వాళ్ల పని చేసిన పాత కంపెనీకి సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెళ్లి, సీఈవో ఫణీంద్ర మరియు ఎండి వినులను తీవ్రంగా కత్తితో పొడిచి చంపినట్లు పోలీస్ వాళ్ళు తెలియజేశారు.

అంతేకాకుండా పోలీసు వారు సేకరించిన కొన్ని ఆధారాల ప్రకారం, కొన్ని వాట్స్అప్ చాట్స్ బయటపడడం జరిగింది. అందులో ముఖ్యంగా జోకర్ ఫిలిక్స్ అని పిలవబడే సభారీష్, తాను కేవలం చెడ్డవాలనే టార్గెట్ చేస్తానని, మంచి వాళ్లను హత్య చేసే ఉద్దేశం తనకి లేదని వాట్సాప్ చాట్ లో ఉన్నట్లు పోలీసు వారు తెలిపారు.

వీళ్ళిద్దరూ పాత కంపెనీలో పని చేసేటప్పుడు చాలా గొడవలు అయ్యాయని అందుకే వాళ్లతో పనిచేయడం ఇష్టం లేక రిజైన్ చేశారని వీళ్లే సొంతంగా వేరే కంపెనీ పెట్టుకుందామని ప్లాన్ చేశారని వీళ్ళతో పనిచేసిన తోటి ఎంప్లాయిస్ చెప్పారు. కానీ వీళ్ళు శత్రుత్వం ప్రాణాల మీదకు తెస్తుందని అనుకోలేదని చెప్పారు. కేవలం వారిద్దరూ కొత్త కంపెనీ కంపెనీ పెట్టినప్పటికీ పాత ఎంప్లాయిస్ ని వాళ్ల కంపెనీకి ఆహ్వానించడమే, శత్రుత్వానికి దారితీసింది అంతేకాకుండా, వాళ్లని హత్యకు కారణమైంది. మన దేశంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కేవలం తమ ఎంప్లాయిస్ ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగినందుకు శత్రుత్వం పెంచుకొని హత్య చేయడం ఎంతవరకు న్యాయం! చట్టం వారి ముగ్గురిని విడిచిపెట్టదు. పోలీసుల వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.