యాపిల్స్ కొనేందుకు ఢిల్లీ వచ్చిన బెంగాల్ వ్యక్తి

డబ్బు..డబ్బు.. డబ్బు. ఈ లోకం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని చాలా మంది చెబుతారు. ప్రపంచం మీద జరిగే అనేక సంఘటనలు కూడా ఇది నిజమనే తెలుపుతాయి. అనేక సంఘటనలు చూసి మనం అయ్యో అనుకుంటూ ఉంటాం. ఇటువంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ ఘటన గురించి చెబితేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.   ఢిల్లీ వచ్చిన బెంగాల్ వ్యాపారి.. బెంగాల్ కు చెందిన ఓ 33 ఏళ్ల వ్యాపారి ఢిల్లీకి యాపిల్స్ కొనుగోలు […]

Share:

డబ్బు..డబ్బు.. డబ్బు. ఈ లోకం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని చాలా మంది చెబుతారు. ప్రపంచం మీద జరిగే అనేక సంఘటనలు కూడా ఇది నిజమనే తెలుపుతాయి. అనేక సంఘటనలు చూసి మనం అయ్యో అనుకుంటూ ఉంటాం. ఇటువంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ ఘటన గురించి చెబితేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.  

ఢిల్లీ వచ్చిన బెంగాల్ వ్యాపారి..

బెంగాల్ కు చెందిన ఓ 33 ఏళ్ల వ్యాపారి ఢిల్లీకి యాపిల్స్ కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అతడి పేరు బబ్లూ యాదవ్ అని పోలీసులు తెలిపారు. అతడు దాదాపు రూ. 3 లక్షల వరకు పట్టుకుని యాపిల్స్ కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వచ్చాడు. కానీ ఢిల్లీలో ఉన్న కొంత మంది కేటుగాళ్లు బబ్లూ యాదవ్ ను కిడ్నాప్ చేసి అతడు యాపిల్స్ కొనేందుకు తీసుకొచ్చిన రూ. 3 లక్షలు తీసుకున్నారు. మనం చేసిన పాపం ఏనాడైనా మనం దొరికేలా చేస్తుంది. అలా అమాయకుడిని మోసం చేసి అతడి వద్ద నుంచి రూ. 3 లక్షలు తీసుకున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యాపారవేత్త బబ్లూ యాదవ్ అనే బాధితుడు గత బుధవారం సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రాగా.. ఢిల్లీలో కొంత మంది దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయడం మాత్రమే కాకుండా అతడు యాపిల్స్ కొనుగోలు చేసేందుకు తెచ్చుకున్న రూ. 3 లక్షలను తీసుకున్నారు. 

సినిమా ఫక్కీలో కిడ్నాప్..

యాపిల్స్ కొనేందుకు ఢిల్లీకి వచ్చిన బబ్లూ యాదవ్ ను దుండగులు సినిమా స్టైల్ లో కిడ్నాప్ చేశారు. ఆజాద్‌పూర్ మండిలోని హోల్‌సేల్ మార్కెట్ నుంచి యాపిల్స్ కొనుగోలు చేసేందుకు బబ్లూ యాదవ్ పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చాడు. ఢిల్లీకి వచ్చిన యాదవ్‌ అతని స్నేహితుడు అజయ్ పంపిన టాక్సీలో విమానాశ్రయం ద్వారకలోని సెక్టార్-21 కు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు.యాదవ్ ద్వారక చేరుకున్న తర్వాత.. అజయ్ అతనిని ఒక ఐసోలేటెడ్ ఫ్లాట్ కి తీసుకెళ్లాడు. అక్కడ అజయ్ సహచరులు ఒకరు అప్పటికే ఉన్నారు. మరుసటి రోజు, అతని సహచరులు మరో నలుగురు అతని ఫ్లాట్‌కు వచ్చి బబ్లూను బలవంతంగా కారులో బహదూర్‌ఘర్‌ లోని ఒక ఐసోలేటెడ్ డెయిరీ సంస్థకు తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. బబ్లూ యాదవ్ నుంచి డబ్బులు తీసుకునేందుకు నిందితులు బబ్లూ యాదవ్ ను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు అతడిని బెదిరించి విడిపించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. వారు యాదవ్‌ ను అతని బంధువులకు కాల్ చేసి వారికి వేర్వేరు ఐదు UPI IDల ద్వారా మొత్తం ₹ 2.7 లక్షలను పంపించుకున్నారని పోలీసులు తెలిపారు. డబ్బు పొందిన తరువాత, నిందితులు అతన్ని బహదూర్‌ఘర్ సిటీ మెట్రో స్టేషన్ సమీపంలో పడవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఇన్సిడెంట్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బబ్లూను హెచ్చరించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. శుక్రవారం రోజు యాదవ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌ లో అజయ్‌ తో సహా ఐదుగురు నిందితులపై ఫిర్యాదు చేసినట్లు డీసీపీ (ఐజీఐ ఎయిర్‌ పోర్ట్) రామ్ గోపాల్ నాయక్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా 364 ఏ , 120 బీ (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్‌ ఐ ఆర్ నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

ముగ్గురు నిందితులు అరెస్ట్…

యాదవ్ ఫిర్యాదు చేయగానే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులు — ప్రవీణ్ కుమార్ (27), వికాస్ (26), మరియు హర్ఫూల్ సింగ్ (33)లను సోమవారం అరెస్టు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో అజయ్‌తో పాటు ఐదో నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డీసీపీ పేర్కొన్నారు.