బార్‌లో కొట్టుకున్న కస్టమర్లు, సిబ్బంది – 10 మంది అరెస్ట్

మద్యం.. ఈ పేరు వింటేనే కొంత మంది ఆడవాళ్ళ గుండెల్లో రైళ్లు పగెడతాయి. మద్యం తాగి వచ్చిన తన భర్త ఏ గొడవ చేస్తాడో అని రోజూ బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతుంది. చాలా మంది చాలా సంవత్సరాలుగా మద్యాన్ని నిషేధించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.  చాలా వరకు పలు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు మద్యపానాన్ని నిషేధిస్తామని వాగ్దానాలు చేస్తున్నా, అవి.. అమలుకు నోచుకోవడం లేదు. అయితే హామీలు […]

Share:

మద్యం.. ఈ పేరు వింటేనే కొంత మంది ఆడవాళ్ళ గుండెల్లో రైళ్లు పగెడతాయి. మద్యం తాగి వచ్చిన తన భర్త ఏ గొడవ చేస్తాడో అని రోజూ బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతుంది. చాలా మంది చాలా సంవత్సరాలుగా మద్యాన్ని నిషేధించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.  చాలా వరకు పలు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు మద్యపానాన్ని నిషేధిస్తామని వాగ్దానాలు చేస్తున్నా, అవి.. అమలుకు నోచుకోవడం లేదు. అయితే హామీలు ఇచ్చిన నాయకులు మాత్రం.. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోతున్నారు. అసలు లిక్కర్ అమ్మకాలను ఏ ప్రభుత్వమూ నిషేధించడం లేదు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి లాభదాయకమైన అంశం. కాగా.. చాలా మంది మద్యం మత్తులో తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారని పలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువత కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. లిక్కర్, డ్రగ్స్‌ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారి గురించిన కథనాలను మనం ఎక్కడో ఒక చోట జరిగిన వాటిని వార్తల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. 

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ బార్లో కస్టమర్లు, సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు కారణమయిన పది మందిని అరెస్టు చేసినట్టు అధికారు తెలిపారు.

కాగా.. ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం దహిసర్ (తూర్పు)లోని ఓ బార్ సిబ్బందికి, కొంతమంది కస్టమర్లకు మధ్య గొడవ జరిగింది. ఇప్పటి వరకు ఏడుగురు సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇరు వర్గాలపై క్రాస్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఓ వ్యక్తి మరో వ్యక్తిని కుర్చీతో కొట్టాడు. ముంబైలోని దహిసర్ బార్ వెలుపల రెండు గ్రూపుల వ్యక్తులు ఒకరినొకరు భీకరంగా కొట్టుకున్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కుర్చీతో కొట్టగా, గొడవ మరింత ముదిరింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు దీనికి బాధ్యులైన ఏడుగురు సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేసినట్లు తెలిపిన అధికారులు..  వారిపై కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.

దహిసర్‌లోని ఓ బార్‌లో ముగ్గురు వ్యక్తులు, ఏడుగురు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలను అక్కడే ఉన్న వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయింది. కాగా.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఒకరిపై ఒకరు కుర్చీలతో కొట్టుకోవడం మరియు విసిరేయడం కనిపించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణ పడుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఈ ఘటనలోప్రమేయం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఏడుగురిని సిబ్బందిని అరెస్ట్ చేసి, క్రాస్ కంప్లైంట్ దాఖలు చేశారు.

భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా గాయ పరచడం మరియు కవ్వింపుకు దారితీసే ఒకరిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి పలు సెక్షన్లు ఉన్నాయి.