స్వలింగ సంపర్కుల వివాహం హానికరమంటున్న బార్ కౌన్సిల్

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించడాన్ని వ్యతిరేకిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాంటి విషయాలను పరిష్కరించడం శాసనసభ బాధ్యత అని పేర్కొంది. భారతదేశం సామాజికంగాను, మతపరంగాను వైవిధ్యభరితమైన దేశమని, అటువంటి సున్నితమైన విషయానికి సంబంధించి న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటే  భవిష్యత్ తరాలకు హానికరమని తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రూపొందించే బాధ్యత శాసనసభకు అప్పగించబడిందని, శాసనసభ రూపొందించిన చట్టాలు ప్రజాస్వామికమైనవి, ఎందుకంటే అవి సంప్రదింపుల […]

Share:

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించడాన్ని వ్యతిరేకిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానాన్ని

ఆమోదించింది. అలాంటి విషయాలను పరిష్కరించడం శాసనసభ బాధ్యత అని పేర్కొంది. భారతదేశం సామాజికంగాను, మతపరంగాను వైవిధ్యభరితమైన దేశమని, అటువంటి సున్నితమైన విషయానికి సంబంధించి న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటే  భవిష్యత్ తరాలకు హానికరమని తీర్మానించింది.

రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రూపొందించే బాధ్యత శాసనసభకు అప్పగించబడిందని, శాసనసభ రూపొందించిన చట్టాలు ప్రజాస్వామికమైనవి, ఎందుకంటే అవి సంప్రదింపుల ప్రక్రియ తర్వాత రూపొందించబడతాయని వారు అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అంశం ధర్మాసనానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని, అటువంటి సున్నితమైన విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రానున్న రోజుల్లో దేశ సామాజిక నిర్మాణాన్ని అస్థిరపరిచే అవకాశం ఉందని తీర్మానం పేర్కొంది.

స్వలింగ వివాహానికి సంబంధించి ఇప్పటికే సమాజంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. స్వలింగ వివాహానికి అనుకూలంగాను, వ్యతిరేకంగాను కూడా ఎన్నో వాదనలు మత ప్రాతిపదికన, మత సిద్ధాంతపరంగా రూపొందించబడ్డాయి. ప్రపంచంలోని అనేక మతాలు స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్న మతపరమైన తెగల సంఖ్య 2010 నుండి పెరుగుతోంది. స్వలింగ వివాహంపై మతపరమైన అభిప్రాయాలకు, స్వలింగ సంపర్కంపై మతపరమైన అభిప్రాయాలకు దగ్గరి సంబంధం ఉంది.

బౌద్ధ బోధనలలో స్వలింగ సంపర్కం గురించిన సందిగ్ధ అభిప్రాయాల కారణంగా, ఒకే లింగానికి చెందిన సభ్యుల మధ్య వివాహ సమస్యకు సంబంధించి అధికారిక వైఖరి ఏదీ లేదు.  1997 సంవత్సరంలో దలైలామా ఇలా అన్నారు.. మనం విశ్వాసులు మరియు అవిశ్వాసుల మధ్య తేడాను గుర్తించాలి. బౌద్ధ దృక్కోణంలో, పురుషులు-పురుషులు మరియు మహిళలు-మహిళల మధ్య ఉండే లైంగిక కార్యకలాపాలు సాధారణంగా లైంగిక దుష్ప్రవర్తనలుగా పరిగణించబడతాయి. సమాజం యొక్క దృక్కోణం నుండి, పరస్పర అంగీకారం గల స్వలింగ సంపర్కులు పరస్పర ప్రయోజనం పొందుతారన్నారు. ఇది ఆనందదాయకం కానీ ప్రమాదకరం కాదన్నారు.

అదేవిధంగా స్వలింగ సంపర్కం అనగా ఒకే లింగానికి చెందిన వారి మధ్య ఉండే లైంగిక సంబంధం అని చెప్పారు. స్వలైంగికత అనేది ఒకే లింగానికి చెందిన వారి మధ్య ఉండే రొమ్యాంటిక్, లైంగిక ఆకర్షణ మరియు లైంగిక ప్రవర్తనలాంటిదన్నారు. ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. 

కానీ ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప్రకారం కూడా స్వలింగ సంపర్కము ఒక మానసిక వ్యాధి గానీ జన్యుపరమైన లోపం గానీ కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని అమెరికాకు చెందిన కొన్ని ప్రపంచస్థాయి రిసెర్చ్ సంస్థలు నిర్ధారించాయి. 

స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా డెన్మార్క్‌ (నెదర్లాండ్‌) మెుదటి స్థానంలో ఉంది. ఆ తరువాత నార్వే, స్వీడన్‌, ఐలాండ్‌ దేశాలు డెన్మార్క్‌ను అనుసరించాయి. ఆఫ్రికాలో అత్యధిక దేశాల్లో స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకం. దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. 2007లో నేపాల్‌ సుప్రీంకోర్టు, లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి దారుల చట్టాలను రద్దు చేయాలని వారిని మూడో లింగంగా గుర్తించి వారికి పౌర హక్కులను కల్పించాల్సిందిగా కోరింది. ఇది ఇలా ఉండగా.. ‘మేమూ మనుషులమే… మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తక్కువగా ఎందుకు చూస్తారు’ అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.