గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎన్నో పెట్టుబడులు తెచ్చిందన్న బాలినేని

ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మొదటి రోజులో పలువురు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జిందాల్ స్టీల్ ఛైర్మన్ నవీన్ జిందాల్, జిఎంఆర్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావుతో పాటు పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటన విశాఖ పెట్టుబడిదారుల సదస్సుపై అవాక్కులు పేలుతున్నవాళ్ళు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ప్రముఖ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి […]

Share:

ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మొదటి రోజులో పలువురు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జిందాల్ స్టీల్ ఛైర్మన్ నవీన్ జిందాల్, జిఎంఆర్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావుతో పాటు పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటన

విశాఖ పెట్టుబడిదారుల సదస్సుపై అవాక్కులు పేలుతున్నవాళ్ళు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ప్రముఖ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే విశాఖను రాజధానిగా ఎంపిక చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. 

సీఎం జగన్ విజన్‌తో ముందుకు సాగే నాయకుడు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుతో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడిదారులు లేరని ప్రచారం చేస్తున్న వారికి విశాఖ సదస్సుతో  సీఎం జగన్ చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు విశాఖ సమ్మిట్ ను విజయవంతం చేశారని అన్నారు. ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. అమరావతి లాంటి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి. రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందన్నారు.

తెలుగుదేశం పార్టీపై బాలినేని కీలక వ్యాఖ్యలు

విశాఖ పెట్టుబడిదారుల సదస్సుపై రచ్చ చేస్తున్న వారు.. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే విశాఖను రాజధానిగా ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన అన్నారు. అమరావతి లాంటి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి. రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని ఆయన పేర్కొన్నారు.

గతంలో కూడా బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్టు లేదన్నారు. తన స్థానంలో తన భార్య శచీదేవికి టిక్కెట్‌ ఇస్తానని వ్యాఖ్యానించారు. దీంతో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. కొండెపి వైసీపీ ఇన్‌చార్జి అశోక్‌బాబుపై పలువురు అసంతృప్తితో ఉన్నారని, విభేదాలు మరిచి కలిసి పని చేయాలని సూచించారు. అయితే తనకు టికెట్ లేదని బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన పనితీరుపై వైసీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డికి.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనకు మారతారనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి విశాఖ సదస్సుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.