బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధరకు వేలం 

భారతదేశంలో అంగరంగ వైభవంగా గణేష్ పండుగ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక రాష్ట్రంలో కూడా గణేష్ ఉత్సవాలు జరిగాయి. నిమజ్జనం సమయానికి జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి తీసుకువెళ్లే క్రమం చూపురులకు కనువిందు చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ గణపతి చేతిలో ఉండే లడ్డు కోసం పోటీ పడుతూ ఉంటారు. ఆ లడ్డు వేలం పాటలో సంపాదించి, ఎంతో పవిత్రంగా తమ కుటుంబీకులకు, సన్నిహితులకు, తమ […]

Share:

భారతదేశంలో అంగరంగ వైభవంగా గణేష్ పండుగ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక రాష్ట్రంలో కూడా గణేష్ ఉత్సవాలు జరిగాయి. నిమజ్జనం సమయానికి జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి తీసుకువెళ్లే క్రమం చూపురులకు కనువిందు చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ గణపతి చేతిలో ఉండే లడ్డు కోసం పోటీ పడుతూ ఉంటారు. ఆ లడ్డు వేలం పాటలో సంపాదించి, ఎంతో పవిత్రంగా తమ కుటుంబీకులకు, సన్నిహితులకు, తమ ఆరోగ్యాల కోసం, తమ ఆస్తుల పెరుగుదల కోసం తమ ఇంటికి వచ్చిన గణపతి లడ్డు వల్ల శుభం చేకూరుతుందని నమ్మకం.

రికార్డు స్థాయిలో  బాలాపూర్ లడ్డు: 

నగరంలో గణేష్ ఉత్సవాలలో ముఖ్యంగా నిమజ్జనం రోజు బాలాపూర్ లడ్డూ వేలం కన్నుల పండుగగా జరిగిన వైనం కనిపిస్తుంది. సుమారు 30 ఏళ్ల క్రితం, ఇదే రోజున 1994లో కోలం మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూని వేలం పాట వేసే ప్రక్రియ మొదలైంది. ఒక ముఖ్యమైన మైలురాయిలని దాటిన ఈ క్రమంలో, ప్రత్యేకించి ఈ వేలం పాట సుమారు ప్రతి ఒక్క ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ ఏడాది పోటీలో 36 మంది వేలంపాట వెయ్యగా.. సుమారు రూ. 27 లక్షలకు లడ్డును వేలం పాడి, తుర్కయాంజాల్‌కు చెందిన దాసరి దయానాద్ రెడ్డి ఈ బాలాపూర్ గణేష్ లడ్డూని సొంతం చేసుకున్నాడు.

గతేడాది ఈ లడ్డూ రూ.24.60 లక్షలకు దక్కించుకున్న రియల్టర్ వంగేటి లక్ష్మా రెడ్డి. లడ్డు తమ ఇంటికి వచ్చిన తరువాత నుంచి తమకి అదృష్టం మరింత మెరుగుపడిందని వెల్లడించాడు. 2001 వరకు వేళల్లోనే వేలంపాటికి వెళ్లిన బాలాపూర్ గణేష్ లడ్డూ..2002లో కొండడే మాధవ్ రూ.1,05,000 వేలంపాడడంతో, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం లక్షల్లోకి మారింది.

మహమ్మారి సమయంలో సీఎం కి బహుమతిగా బాలాపూర్ లడ్డు: 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో, వేలం నిర్వహించకూడదని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. బాలాపూర్ లడ్డూను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు బహుమతిగా అందజేశారు. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూని దక్కించుకున్న దయానాద్ రెడ్డి మాట్లాడుతూ,  గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న తుర్కయాంజాల్ ప్రజలకు ఈ లడ్డూను పంపిణీ చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, లడ్డు ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా తమకి మంచి జరుగుతుందని.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకుందని వెల్లడించారు. అయితే ఈ బాలాపూర్ లడ్డుకి ఉన్న అదృష్టం అనే సెంటిమెంట్ కారణంగా అత్యధిక ధర పలుకుతున్న వైనం కనిపిస్తుంది. 

మట్టి ప్రతిమల హవా: 

ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ వినాయక చవితి సంబరాలు అంబరాన అంటుకునేలా జరుపుకున్నారు. ముఖ్యంగా చాలామంది మట్టి ప్రతిమలను ముఖ్యంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. పండుగల సందర్భంలో కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా, మట్టి ప్రతిమలను ఎన్నుకోవడం మంచి విషయం అంటూ చాలామంది తమ ఇంటికి మట్టి ప్రతిమలను తీసుకునివెళ్లారు. 

జల కాలుష్యం ముఖ్యంగా జరగకూడదని, హాని కలిగించే కెమికల్స్ కలిగిన రంగులను ఉపయోగించకుండా.. పూర్తిగా పర్యవర్ణానికి మేలును చేసే మంచి మట్టితో చేసిన ప్రతిమలకు ఎక్కువగా ఆదరాభిమానాలు దక్కాయి. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చిన్న మట్టి విగ్రహాలను తమ ఇళ్లకు తీసుకువెళ్లి మరొకసారి ఆడంబరాలకి పోకుండా, తమ ఇష్ట దైవాన్ని పూజించుకున్నారు. 

ముఖ్యంగా కెమికల్స్ ఉన్న రంగులను పూసిన విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జల కాలుష్యం ఎక్కువగా వాటిల్లుతుందని ఎప్పటినుంచో వాదన వినిపిస్తోంది. వినాయక చవితి తరువాత జరిగే నిమజ్జనాల సందర్భంలో పలు చెరువులలో, సముద్రాలలో, జల రాశులలో పిహెచ్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతున్నాయని, నీటి కాలుష్యం వల్ల నీళ్లు కాలుష్యం అవ్వడమే కాకుండా, అందులో ఉన్న చేపలు ముఖ్యంగా చనిపోవడం జరుగుతుందని, 

దీనికి ఒకే ఒక్క నివారణ మట్టి ప్రతిమలు అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా పెద్ద నాయకుల దగ్గర నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఉన్న భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు తమ ఇంటికి మట్టి ప్రతిమలను తీసుకువెళ్లిన ఫోటోలను షేర్ చేసి, ప్రజలకు మరింత స్ఫూర్తిని అందిస్తున్నారు. దైవాన్ని పూజించేందుకు ఆడంబరాలకు పోనక్కర్లేదని, చిన్న మట్టి ప్రతిమ కూడా మన కష్టాలను తీర్చే దైవంగా మారుతుందని మరొకసారి చాటి చెప్పారు.