లోక్‌సభలో సహనాన్ని కోల్పోయిన మంత్రి నారాయణ్ రాణే 

అవిశ్వాస తీర్మానం పై ప్రస్తుతం చర్చ నడుస్తుంది. నిన్న జరిగిన లోక్ సభ చర్చలోని కేంద్రమంత్రి నారాయన్ రానే పేషన్స్ కోల్పోయి మాట్లాడటం జరిగింది. ఎంపీ అరవింద్ సావంత్ మీద అరుస్తూ కూర్చో నీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు అంటూ కేకలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నోరు జారిన మంత్రి నారాయణ్ రాణే:  మంగళవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మాట్లాడుతుండగా, […]

Share:

అవిశ్వాస తీర్మానం పై ప్రస్తుతం చర్చ నడుస్తుంది. నిన్న జరిగిన లోక్ సభ చర్చలోని కేంద్రమంత్రి నారాయన్ రానే పేషన్స్ కోల్పోయి మాట్లాడటం జరిగింది. ఎంపీ అరవింద్ సావంత్ మీద అరుస్తూ కూర్చో నీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు అంటూ కేకలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

నోరు జారిన మంత్రి నారాయణ్ రాణే: 

మంగళవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మాట్లాడుతుండగా, తన సహచర ఎంపీ అరవింద్ సావంత్‌ను కూర్చోమని అడిగారు, అంతేకాకుండా నీకు ఏ హక్కు ఉంది అంటూ అరిచారు. “అరే బైత్ నీచే (కూర్చోండి)” అని కేంద్ర పరిశ్రమల మంత్రి అన్నారు. అయితే ఈ మాటలకు స్పందించిన లోక్‌సభ స్పీకర్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో, ప్రధాని మంత్రి మోదీని అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా మాట్లాడే ‘ఔకత్’ (హోదా/ హక్కు) సావంత్‌కు లేదని మంత్రి అన్నారు. “ఔకత్ నహీ హై ఇంకీ ప్రధాన మంత్రి జీ (ప్రధాని), అమిత్ షా కే బారే మే బోల్నే కీ… అగర్ కుచ్ భీ బోలా తో తుమ్హారీ ఔకత్ మే నికలుంగా (ప్రధాని మోదీ, అమిత్ షాలపై వ్యాఖ్యానించే హక్కు నిజానికి ఆయనకు లేదు. నీకు కావాలంటే నీ స్థానం ఏంటో నేను చూపిస్తాను” అని మంత్రి అన్నారు.

మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు: 

లోక్‌సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నారాయణ్ రాణే పార్లమెంటులో తన మాట్లాడిన తీరుకి ఫ్లాక్ అయ్యారు. ‘మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు’ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయగా, పీఎం మోదీ మంత్రి పార్లమెంట్‌లో వీధి గూండాల భాషను ఉపయోగించి బెదిరించారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

అసలు మంత్రి పదవిలో ఉండి, మంత్రి నారాయణ్ రాణే అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి దిగజారిపోతూ మాట్లాడడానికి సిగ్గుపడాలి అంటూ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ ప్రియాంక చతుర్వేది వీడియోను షేర్ చేస్తూ రాశారు.

సేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) ఎంపీ అరవింద్ సావంత్ అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ, మణిపూర్ ఇష్యూపై ప్రభుత్వం 70 రోజుల పాటు మౌనంగా ఉండటంతో ..సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చామని అన్నారు. శివసేన నుండి పారిపోయిన వారిని ఉద్దేశించి, అరవింద్ సావంత్, అప్పుడు మణిపూర్ విషయాల గురించి కేవలం కొన్ని సెకండ్లు పాటే మాట్లాడిన ప్రధానుమంత్రి. మరి ఇప్పుడు ఆయనే మాకు హిందుత్వాన్ని బోధిస్తున్నారు. అయితే తాము కూడా హిందుత్వంలోనే పుట్టామని వాక్యానించారు. తర్వాత పిఎం మోదీ NCPని ‘నేషనల్ కరప్ట్ పార్టీ’ అని ప్రస్తావించి  మహారాష్ట్రలో ప్రభుత్వంలో చేరారు అంటూ చెప్పుకొచ్చారు అరవింద్ సావంత్. 

ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం మణిపూర్ విషయాలు మీద అసలు బిజెపి అధినేత ప్రధానమంత్రి ఎందుకు మాట విప్పట్లేదని, మణిపూర్లో అంత హింస జరుగుతున్న, హృదయాన్ని కదిలించే కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ, ప్రధానమంత్రి మణిపూర్ విషయం మీద మాట్లాడి 70 రోజులు అవుతుందని, కేవలం కొన్ని సెకండ్ల పాటు మాట్లాడడం విచారకరంగా ఉందని అరవింద్ సావంత్ తన స్పీచ్ ద్వారా ప్రస్తావించారు.