అయోధ్యలోని రామమందిరం మహా ప్రతిష్ఠాపన మహోత్సవానికి సిద్ధం

అయోధ్యలోని రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో ఆలయ ట్రస్ట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు ట్రస్టు సభ్యులు గతంలోనే చెప్పారు. ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు ఆలయ ట్రస్ట్ సభ్యుడు శుక్రవారం (ఆగస్టు 4) వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రాయాలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. .ఇప్పటికే […]

Share:

అయోధ్యలోని రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో ఆలయ ట్రస్ట్ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమానికి అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు ట్రస్టు సభ్యులు గతంలోనే చెప్పారు.

ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు ఆలయ ట్రస్ట్ సభ్యుడు శుక్రవారం (ఆగస్టు 4) వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రాయాలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. .ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్రం రామ మందిర ప్రారంభోత్సవం గురించి చెప్పినా.. ఈసారి మాత్రం డేట్‌తో సహా రామ మందిర నిర్మాణ కమిటీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి పది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది

ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సాధువులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారని రామ్ మందిర్

కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు 2024 జనవరి 14 తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు

ఆలయ నిర్మాణం… 

రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. నాలుగు అంతస్తుల ఆలయం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్‌ను రామ్ కథ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తామని వెల్లడించారు. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో గ్రౌండ్ ఫ్లోర్‌ నిర్మించి ఉంది. మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. గర్భగుడిపై 161 అడుగుల టవర్‌గా ఉండే ఈ నిర్మాణం కోసం రాజస్థాన్‌కు చెందిన నాలుగు లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించనున్నారు. ఇందులో ఎలాంటి స్టీల్ గానీ, ఇటుకలను ఉపయోగించ లేదు. రామాలయ నిర్మాణం నగారా శైలిలో ఉంటుందని.. దానికి 46 టేకు చెక్క తలుపులు ఉంటాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. గర్భగుడికి ఉండే ప్రధాన ద్వారం బంగారు పూతతో ఉంటుందని.. ఈ ఆలయ నిర్మాణం కనీసం వెయ్యి సంవత్సరాల పాటు నిలుస్తుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని, వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి వేదిక లేదా బహిరంగ సభ ఉండదన్నారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దల్ని ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోందన్నారు. అలాంటి సాధువుల జాబితాను ట్రస్ట్ సిద్ధం చేస్తోందని, త్వరలో వారికి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకంతో ఆహ్వాన పత్రాన్ని పంపించనున్నట్లు చెప్పారు.

అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ 25,000 మంది సాధువులు, 10,000 మంది ప్రత్యేక అతిథులు విడివిడిగా ఉంటారని చెప్పారు. వీరంతా రామజన్మభూమి ప్రాంగణంలోని పవిత్రోత్సవానికి హాజరవుతారన్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాల కారణంగా ఆలయానికి భూమి పూజ కార్యక్రమం ఆగస్ట్ 5, 2020న చాలా చిన్నగా జరిగిందన్నారు. రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుందన్నారు.

ప్రధాన ఆలయాన్ని మూడు ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ ఆలయానికి చుట్టుప్రక్కల 9 ఎకరాల విస్తీర్ణంలో గోడ నిర్మించనున్నారు. గోడపై రామాయణాన్ని తెలిపే శిల్పాలు ఉంటాయి. ఆలయానికి ఉన్న మూడు ద్వారాలు, గోపురానికి బంగారు పూతను పూయనున్నారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఆలయ సముదాయంలో యాత్రికులు ఉండేందుకు కేంద్రం, మ్యూజియం, ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం, ఆడిటోరియం, గోశాల, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం, ఆలయ అధికారుల కోసం పరిపాలనా భవనాలు, ఆలయ పూజారులకు వసతి గృహాలు ఉంటాయి.