హోలీ పండుగ రంగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీనిని జరుపుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు అంటే ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు హోలికా దహన్ చేస్తారు

ఈ సంవత్సరం హోలీ చాలా ప్రత్యేకమైనది – ఈ సారి హోలికా దహన్‌ ఎందుకంత ప్రత్యేకమైనదో చూద్దాం భారత దేశంలో హోలీ ఎంతో అందమైన పండుగ. ఈ పండుగ రోజున అందరూ విభేదాలను మరచిపోయి స్నేహంగా ఉంటారు. హోలీకా దహన్ వేడుకలు హోలీకి ఒకరోజు ముందు వస్తాయి. ఈ సారి మార్చి 7వ తేదీ మంగళవారం నాడు హోలికా దహన్ వేడుకను నిర్వహించనున్నారు. మన పురాణ గ్రంథాలలో హోలికా దహన్, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. […]

Share:

ఈ సంవత్సరం హోలీ చాలా ప్రత్యేకమైనది – ఈ సారి హోలికా దహన్‌ ఎందుకంత ప్రత్యేకమైనదో చూద్దాం

భారత దేశంలో హోలీ ఎంతో అందమైన పండుగ. ఈ పండుగ రోజున అందరూ విభేదాలను మరచిపోయి స్నేహంగా ఉంటారు. హోలీకా దహన్ వేడుకలు హోలీకి ఒకరోజు ముందు వస్తాయి. ఈ సారి మార్చి 7వ తేదీ మంగళవారం నాడు హోలికా దహన్ వేడుకను నిర్వహించనున్నారు.

మన పురాణ గ్రంథాలలో హోలికా దహన్, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. హోలికా రాక్షసి శ్రీ మహా విష్ణువు యొక్క భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడం కోసం నిప్పంటించుకుంటుంది, కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాదు. హాయిగా ఉంటాడు. కానీ హోలికా మాత్రం దహనమైపోయింది. హోలికా దహన్ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజున అందరూ హోలికను కాల్చడం ద్వారా అన్నిరకాల చెడులనూ కాల్చివేస్తారు. ఈ హోలికా దహన్ వేడులను దేశంలోని కొన్ని ప్రాంతాలలో చాలా గ్రాండ్​ గా సెలబ్రేట్ చేస్తారు. ప్రభుత్వం తరఫున కూడా పలు పనులను చేస్తారు.  

హోలికా దహన్ శుభ సమయం

ఈ సంవత్సరం హోలికా దహన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన అదృష్టవశాత్తూ హిందూ పంచాగాన్ని బట్టి, ఈ సారి హోలికా దహన్ రోజున పౌర్ణమి తిథి మార్చి 6, సోమవారం సాయంత్రం 6.17 నుండి. మంగళవారం, మార్చి 7, సాయంత్రం 6.09 గంటల వరకు  ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే, హోలికా దహన్ ప్రదోష సమయంలో పూర్తవుతుంది.

హోలికా దహన్ అనే పవిత్ర సమయం సాయంత్రం 6.31 గంటలకు మొదలయ్యి. రాత్రి 8.58 వరకు ఉంటుంది. హోలికా దహన్ సందర్భంగా అనేక గొప్ప సంఘటనలు యాదృచ్ఛికంగా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ సమయంలో హోలికను పూజించవచ్చు. అంతేకాకుండా, ఈ రోజున 7.22 నుండి 9.07 వరకు అమృత ఘడియలు ఉంటాయి.

హోలికా దహన్‌ పూజ చేసేటప్పుడు అది ఎంతో పవిత్రమైన సమయమని గుర్తుంచుకోవాలి. పిండి, బెల్లం, నెయ్యితో హోలికా మాతను పూజించి, పత్తితో హోలికను చుట్టి ఉంచాలి. ఈ పండుగ రోజున, పాలు కలిపిన నీటిని హోలికా మాతకు నైవేద్యంగా పెడతారు, అది ఆమెకు తీవ్రమైన బాధ నుండి ఉపశమనం కలిగేలా చేస్తుందని నమ్ముతారు.

హోలికా దహన్ విధివిధానాలు

కుటుంబ సభ్యులందరూ కలసి హోలికా దహన్ వద్ద హోలికా మాతను ఆరాధించిన తర్వాత, హోలికకు నిప్పంటిస్తారు, వేయించిన తాజా గోధుమ గింజలను కూడా  ప్రసాదంగా ఇస్తారు. దీని తర్వాత రంగుల పండుగ ప్రారంభమవుతుంది, కొంత మంది రాత్రిపూట సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. హోలికా మంట చల్లారిన తర్వాత ఆ బూడిదలో కొంత ఇంటికి తీసుకెళ్లాలి. అలా చేయడం వల్ల జీవితంలోని దృష్టి లోపాలతో సహా అనేక సమస్యలు సమసిపోతాయని ఒక నమ్మకం. ఇటువంటి నమ్మకాలను కొంత మంది పాతతరం నమ్మకాలు అని కొట్టి పారేసినా కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఏదేమైనా ఎవరి నమ్మకం వారికుంటుంది కావున అందరి నమ్మకాలను మనం గౌరవించడం చాలా ముఖ్యం. 

హిందూ సంప్రదాయం ప్రకారం వేసవిలో వచ్చే ప్రత్యేకమైన రంగుల పండగ అయిన హోలీని మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తెలుసుకున్న ఈ విషయాన్నీ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చెయ్యండి. వాళ్లకు కూడా మీలాగా హోలీ ఎందుకు జరుపుకుంటాం అనే విషయం అర్థమవుతుంది.