గ్యాంగ్‌స్టర్ నుండి పార్లమెంట్ వరకు.. అతిక్ అహ్మద్ ప్రయాణం

గ్యాంగ్‌స్టర్- రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడిని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.  దీంతో వారిని శనివారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తుండగా దుండగులచే కాల్చి చంపబడ్డారు.  అయితే అతిక్ అహ్మద్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు, అతని జీవిత చరిత్ర ఎలా సాగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.   అతిక్ అహ్మద్ 1962లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రావస్తిలో జన్మించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న షైస్తా ప్రవీణ్‌ని వివాహం చేసుకున్నాడు. అతిక్, […]

Share:

గ్యాంగ్‌స్టర్- రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడిని కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.  దీంతో వారిని శనివారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తుండగా దుండగులచే కాల్చి చంపబడ్డారు. 

అయితే అతిక్ అహ్మద్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు, అతని జీవిత చరిత్ర ఎలా సాగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

అతిక్ అహ్మద్ 1962లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రావస్తిలో జన్మించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న షైస్తా ప్రవీణ్‌ని వివాహం చేసుకున్నాడు. అతిక్, షైస్తాలకు ఐదుగురు కుమారులు. అలీ, ఉమర్, అహ్మద్, అసద్, అహ్జాన్, అబాన్. అయితే.. గత శుక్రవారం ఝాన్సీలో యూపీ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ చనిపోయాడు.మరోవైపు అతిక్ సోదరుడు అయినా ఖలీద్ అజీమ్.. అలియాస్ అష్రఫ్ కూడా ఎమ్మెల్యేగా పని చేశాడు.

అతిక్ అహ్మద్ రాజకీయ ప్రస్థానం

అతిక్ అహ్మద్ ఐదుసార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే ఒకసారి లోక్ సభకు కూడా ఎన్నికయ్యాడు. 

అతని రాజకీయ జీవితం 1989లో ప్రారంభమయింది. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్- (అప్పుడు అలహాబాద్) పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఇక అతను తరువాతి రెండు సార్లు జరిగిన శాసనసభ ఎన్నికలలో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. 1996లో రాజకీయ నాయకుడు తన నాలుగోసారి వరుసగా (సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై) గెలిచాడు.

ఇక మూడు సంవత్సరాల తరువాత అతను అప్నాదళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అతను సమాజ్ వాదీ పార్టీని విడిచిపెట్టాడు. 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచాడు.

కానీ మరుసటి సంవత్సరమే అతను తిరిగి సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.  అతను 2004 నుండి 2009 వరకు UPలోని ఫుల్పూర్ నుండి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. కాగా.. ఫుల్‌పూర్.. ఒకప్పుడు భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పోటీ చేసిన లోక్‌సభ స్తానం.

అతిక్ నేర చరిత్ర

గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో 101 నేరాలు అతీక్‌పై నమోదయ్యాయి. ఇక పోలీసు రికార్డుల ప్రకారం.. అతనిపై మొదటి హత్య కేసు 1979 లోనే నమోదైంది. కాగా.. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, మోసం, బెదిరింపులు, భూకబ్జాలు వంటి అనేక నేరాల్లో అతడి ప్రమేయం ఉందని పొలిసు రికార్డుల్లో పేర్కొన్నారు.

ఆ తరువాత 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో అతిక్ ప్రమేయం ఉందని అతని భార్య అతనిపై కేసు పెట్టింది. అయితే బహుజన్ సమాజ్ వాదీ  శాసనసభ్యుడు అతిక్ ప్రభావాన్ని సవాలు చేసిన రాజు, అతని సోదరుడు ఖలీద్ అజీమ్‌పై ఎన్నికలలో గెలిచినప్పుడు ఈ సంఘటన జరిగింది. అలహాబాద్ (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుండి అతిక్ తమ్ముడిని ఓడించిన మూడు నెలలకే అతను కాల్చి చంపబడ్డాడు.

మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు.. రాజుపాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేసి.. రాజుపాల్ హత్యకు గురైనప్పుడు అతిక్ లేడని, నేను సాక్ష్యం చెప్పదలచుకోలేదని స్టేట్‌మెంట్ రాయమని బలవంతం ఉమేష్ పాల్‌ ని చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత 2006 అపహరణ కేసులో అతనికి జీవిత ఖైదు విధించింది కోర్టు.

2016లో పరీక్షలో మోసం చేసినట్లు గుర్తించిన విద్యార్థులపై చర్య తీసుకున్నందుకు..  ప్రయాగ్‌రాజ్‌లోని కళాశాల ఉద్యోగులపై అతని సహాయకులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి సంవత్సరం అతను నిర్బంధించబడ్డాడు. 2018 లో రాష్ట్రం నుండి వెళ్ళిపోయాడు.