సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం

ప్రస్తుత కాలంలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పనులు ఒక్కొక్కసారి వారి ప్రాణాల మీదకే వస్తున్నాయని చెప్పవచ్చు. ఇలా కొన్ని అనుకోని కారణాలవల్ల జరిగే సంఘటనల వల్ల వారి ప్రాణాలు పోవడమే కాదు వారిపై ఆధారపడిన కుటుంబాలు కూడా అనాధలు అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది వలస కార్మికులు ఇలా పనుల కోసం, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనిచేస్తున్న […]

Share:

ప్రస్తుత కాలంలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పనులు ఒక్కొక్కసారి వారి ప్రాణాల మీదకే వస్తున్నాయని చెప్పవచ్చు. ఇలా కొన్ని అనుకోని కారణాలవల్ల జరిగే సంఘటనల వల్ల వారి ప్రాణాలు పోవడమే కాదు వారిపై ఆధారపడిన కుటుంబాలు కూడా అనాధలు అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది వలస కార్మికులు ఇలా పనుల కోసం, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనిచేస్తున్న సమయంలోనే అక్కడ జరిగే అవకతవకల వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా రోజుకొకటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ మరువకముందే  సరిగ్గా ఇక్కడ కూడా తెలంగాణలో జరిగిన ఒక ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. జీవనోపాధి కోసం వలస వచ్చిన ఒక కార్మికుడి పై సిమెంటు స్లాబ్ కూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని..  సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న  కార్మికులు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ నుండి వలస వచ్చిన వారు.సూర్యాపేట జిల్లా మై హోమ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం (జూలై 25) తెల్లవారుజామున జరిగిన భారీ ప్రమాదంలో సిమెంట్‌ దిమ్మెలతో వెళ్తున్న లిఫ్ట్‌ బోల్తా పడింది. బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి ఉపయోగించే కాంక్రీట్ మిశ్రమం వారిపై కూలిపోవడంతో ఒక వలస కార్మికుడు అక్కడిక్కడే మరణించాడు.  మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.  మేళ్లచెరువు గ్రామంలోని మై హోమ్ కంపెనీకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. 

ఐదు అంతస్తులు పూర్తయిన నేపధ్యంలో ప్రస్తుతం ఆరో అంతస్తు స్లాబ్ పనులు జరుగుతున్నాయని.. కాంక్రీట్ మిక్స్ తీస్తుండగా మెకానికల్ లోపంతో నాలుగో అంతస్తులు కూరుకుపోయిందని కార్మికులు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా,  ఆ మిశ్రమం గ్రౌండ్ లెవల్లో కింద నిలబడి ఉన్న కార్మికుల పైకి కుప్పకూలిందని కోదాడ పోలీసులు తెలిపారు. గాయపడిన కార్మికులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ  ఘోర ప్రమాదంలో, ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని భయపడ్డారు.  ఈ దుర్ఘటన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు..  ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని కోదాడ్ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మీడియా తో  తెలిపారు. గాయపడిన వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మేళ్లచెరువు మండలం హుజూర్‌నగర్‌లోని ఫ్యాక్టరీ వద్ద సిమెంట్‌ దిమ్మెలతో వెళ్తున్న లిఫ్ట్‌ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అని కోదాడ పోలీసులు తెలిపారు.

ఇకపోతే ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పనులు చేస్తున్నవారు ఇలా పనులలో జరిగే లోపాల కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉండడం మరింత బాధన కలిగిస్తుంది లేకపోతే గాయపడిన ఇద్దరు కార్మికులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.  మరి బాధిత కుటుంబానికి ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఇలా పనిచేసే చోట అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు సైతం సలహా ఇస్తున్నారు.