మైనర్ బాలిక అసభ్య ఫోటోలను చిత్రించి పరారైన అస్సాం పోలీసు

ఆడపిల్లలపై అన్యాయం జరిగితే మక్కెలు ఇరగతియ్యాల్సిన పోలీస్ దారుణానికి ఒడిగట్టాడు.అది కూడా పోలీస్ స్టేషన్ లోనే అందరూ చూస్తుండగా  మైనర్ బాలికకు సంబంధించ్ హాయ్ అసభ్యకరమైన ఫోటోలను తీసినట్లు గా అస్సాం కి చెందిన ఒక SI పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న డీజీపీ విచారణ జరిపి ఆ SI ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసాడు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది […]

Share:

ఆడపిల్లలపై అన్యాయం జరిగితే మక్కెలు ఇరగతియ్యాల్సిన పోలీస్ దారుణానికి ఒడిగట్టాడు.అది కూడా పోలీస్ స్టేషన్ లోనే అందరూ చూస్తుండగా  మైనర్ బాలికకు సంబంధించ్ హాయ్ అసభ్యకరమైన ఫోటోలను తీసినట్లు గా అస్సాం కి చెందిన ఒక SI పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న డీజీపీ విచారణ జరిపి ఆ SI ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసాడు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది బ్లాక్ డే, నిజాయితీగా పనిచేసే పోలీసులను కూడా తలదించుకునేలా చేసాడు ఈ దుర్మార్గుడు. అతని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను, కానీ ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తాము అంటూ అస్సాం డీజీపీ ఒక ప్రకటన చేసాడు. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

అరెస్టు చేసి అసభ్యంగా ప్రవర్తన :

ఆ కీచకుడిని వెంటనే పట్టుకొని మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే దుర్మార్గులకు వెన్నులో వణుకుపుట్టే రేంజ్ లో శిక్ష అమలు చెయ్యకపోతే, జనాల్లో పోలీసుల మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం పోతుందని, ప్రజలకు రక్షణ కలిగించాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి, వీళ్ళను చూసుకొని చెడుబుద్ది ఉన్న ప్రతీ ఒక్కరు రెచ్చిపోతారు. కచ్చితంగా పోలీసులు ఆ SI మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక అసలు విషయం లోకి వెళ్తే ఒక మైనర్ బాలిక తన ప్రియుడితో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది. మైనర్ బాలికని వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం కనుక ఈ ఇద్దరు జంటపై వచ్చిన ఫిర్యాదుని తీసుకొని, అదుపులో తీసుకుంటూ ఘోగ్రాపూర్ జైలులో ఉంచారు. అయితే ఠాణా అని పిలవబడే ఆ అమ్మాయి తనని జైలులో ఎస్ ఐ బిమన్ రాయ్ పోలీసు సిబ్బంది ముందు తనకు సంబంధించి అసభ్యకరమైన ఫోటోలను తీసాడని ఆరోపిస్తూ నల్బరీ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

దీంతో అతనిపై పోక్సో చట్టం తో పాటుగా పలు ముఖ్యమైన చట్టాల క్రింద కేసు ని నమోదు చేసారు పోలీసులు. జరిగిన ఈ సంఘటన పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఆదేశాలు జారీ చేసాడు. విచారణ అనంతరం తక్షణమే అతనిని విధుల నుండి తొలగించి యాక్షన్ తీసుకోవాలి అంటూ ఆర్డర్స్ వేసాడు. పోలీసు సిబ్బందికి దేవాలయం లాంటిది పోలీస్ స్టేషన్, ఎంతో మంది అభాగ్యులకు రక్షణ నిలయం, అలాంటి పవిత్రమైన చోట ఇలాంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. మా పోలీసు వ్యవస్థ మొత్తం సిగ్గు తో తలదించుకోవాల్సిన సమయం ఇది అంటూ డీజేపీ జీపీ సింగ్ ఈ సందర్భంగా బాధపడుతూ మాట్లాడాడు. అభం శుభం తెలియని ఒక మైనర్ బాలిక ని ఇలాంటి వేధింపులు చెయ్యడం అనేది అత్యంత నీచమైన చర్య. తన కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ఇలా ప్రవర్తించడానికి మనసు ఎలా వచ్చింది. అంటే తన కూతురిని కూడా ఇదే దృష్టితో చూస్తాడా?, అసలు ఆడబిడ్డలపై ఇలాంటి ఆగడాలు ఆగాలంటే కచ్చితంగా బహిరంగ శిక్ష ఇవ్వాలి. అప్పుడే ఇలాంటి చర్యలకు పాల్పడే దుర్మార్గులకు గుండెల్లో రైళ్లు పరిగిస్తాయి అంటూ నెటిజెన్స్ భావోద్వేగం తో సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు, మరి ఆ నిందితుడిని పోలీసులు ఎంత తొందరగా పెట్టుకుంటారో చూద్దాం.