అస్సాం వరదలు కారణంగా నమోదైన మొదటి మరణం

బ్రహ్మపుత్రా నది ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతుంది. దీనికి కారణంగా ప్రజలను వరదలు ముంచెత్తుతున్నాయి. జొరహత్ డిస్ట్రిక్ట్ మరింత అద్వాన స్థితిలో ఉంది. ఇదిలా ఉండగా వానలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎంతో మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఐదు లక్షలకు పైగా జనాలు వరదల కారణంగా వేరే ఊర్లకు తరలి వెళ్తున్నారు. అంతేకాకుండా అస్సాంలో ఉన్న 22 గ్రామాలు నీట మునిగాయి.  అస్సాం లో వరదలు కారణంగా మొదటి మరణం […]

Share:

బ్రహ్మపుత్రా నది ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతుంది. దీనికి కారణంగా ప్రజలను వరదలు ముంచెత్తుతున్నాయి. జొరహత్ డిస్ట్రిక్ట్ మరింత అద్వాన స్థితిలో ఉంది. ఇదిలా ఉండగా వానలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎంతో మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఐదు లక్షలకు పైగా జనాలు వరదల కారణంగా వేరే ఊర్లకు తరలి వెళ్తున్నారు. అంతేకాకుండా అస్సాంలో ఉన్న 22 గ్రామాలు నీట మునిగాయి. 

అస్సాం లో వరదలు కారణంగా మొదటి మరణం నమోదయింది. మొదటి మరణం బాక్సా డిస్ట్రిక్ట్ లో నమోదైనట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) వెల్లడించింది. నిజంగా ఎప్పుడు చూడనీ విధంగా బ్రహ్మపుత్రా నది ప్రమాద స్థాయికి మించి  ప్రవహిస్తుంది. అస్సాం కి వెళ్లే రహదారులు సగానికి సగం పైగా నీటి మునిగాయి. దీని కారణంగా ప్రజలు వేరే ఊర్లకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రస్తుతం అస్సాం పరిస్థితి ఎలా ఉంది: 

ASDMA అందించిన నివేదిక ప్రకారం, 4,95,700 మంది ప్రజలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలు కారంగా బాక్సా, బార్పేట, చిరంగ్, ధరంగ్, దుబ్రి, డిబ్రుగా, కోక్రాజార్, లక్షింపూర్, నల్బరీ, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా బార్ పేటలో ఉన్న 3,25,600 మంది ప్రజలు, నల్బరీ లో 77 వేల మంది పైగా ప్రజలు, లక్ష్యం పూర్ లో 25 వేలకి మంది పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. 

ఈ జిల్లాలోనే కాకుండా, బాక్సాలో 24 వేల మంది ప్రజలు, తమలపూర్ లో 19,000 మంది, ధరంగులో 700 మంది, కోక్రాచార్యలో 6000 మంది పైగా ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, వరదల్లో చిక్కుకున్నారని, వారిని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నట్టు ASDMA వెల్లడించింది. 

అకాల వర్షాలు ఎందుకు ఎక్కువగా కురుస్తున్నాయి: 

ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యం దీనికి కారణమని చెప్పాలి. మునుపటి రోజుల్లో చూసుకుంటే వర్షాకాలంలో మాత్రమే వర్షాలు కురిసేవి. కానీ కాలంతో పాటుగా పెరుగుతున్న కాలుష్యం అకాల వర్షాలకు కారణమయ్యే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. పెరుగుతున్న తీవ్రమైన కాలుష్యం కారణంగా వరదలే కాదు, ఎండలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనికి నిదర్శనమే ఈ అకాల వర్షాలు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడడమే కాదు, అకాల వర్షాలు వల్ల పంట నాశనం అయ్యి, రానున్న రోజుల్లో నిత్యవసరాల ధరలు కూడా పెరిగే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాలుష్యం పూర్తిగా నివారించిన తరువాతే ఇటువంటి అకాల వర్షాలు తగ్గే అవకాశాలు కనిపిస్తాయి. లేదంటే ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు అని చెప్పుకోవాలి. 

ప్రతి సంవత్సరం గమనిస్తున్నట్లయితే, కాలాలు అనుగుణంగా వర్షాలు అయితే కురవట్లేదు. ఎండలు కూడా తీవ్రతరంగా మారుతున్నాయి. వర్షాలు కురిసాయంటే తారస్థాయికి వెళ్తున్నాయి. అకాల వర్షాలు కారణంగా ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో అని వరద ముంపు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. అంతేకాకుండా తీర ప్రాంత ప్రజలు, ఎండాకాలంలో కూడా తుఫానుల బారిన పడుతున్నారు. వీటన్నిటికీ కారణం కాలుష్యం. ప్రజలు కూడా కాలుష్యాన్ని నివారించే కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా, గ్లోబల్ వార్మింగ్ అధికం అయ్యే పరిస్థితి నుంచి తప్పించుకోగలుగుతాము. లేదంటే రాబోయే తరాలు వారు తీవ్ర ఇబ్బందులకు గురవ్వక తప్పదు.