మైన‌ర్‌పై అస్సాం మాజీ మంత్రి దాడి

పనిమనిషిగా చేస్తున్న మైనర్ అయినా చిన్నారిని గురువారం నాడు బేగం కొట్టినట్లు వీడియో వైరల్ గా మారడంతో ఆధారంతో అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. అస్సాంలోని హోజాయ్ జిల్లాలో తమ ఇంట్లో పని చేస్తున్న 12 ఏళ్ల మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఆరోపణలపై అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి (85), అతని భార్య ఫర్హానా బేగం (28)లను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పనిమనిషిగా చేస్తున్న మైనర్ […]

Share:

పనిమనిషిగా చేస్తున్న మైనర్ అయినా చిన్నారిని గురువారం నాడు బేగం కొట్టినట్లు వీడియో వైరల్ గా మారడంతో ఆధారంతో అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

అస్సాంలోని హోజాయ్ జిల్లాలో తమ ఇంట్లో పని చేస్తున్న 12 ఏళ్ల మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఆరోపణలపై అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి (85), అతని భార్య ఫర్హానా బేగం (28)లను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

పనిమనిషిగా చేస్తున్న మైనర్ అయినా చిన్నారిని గురువారం నాడు బేగం కొట్టినట్లు వీడియో వైరల్ గా మారడంతో ఆధారంతో అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. మైనర్ను చిత్రహింసలు పెడుతున్న వీడియో  వెంటనే వైరల్ కావడంతో, చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలు వెంటనే మైనర్‌ను గురువారం రాత్రి రక్షించాయి. అంతేకాకుండా, హోజాయ్ పోలీసులు, మైనర్ ని చిత్రహింసలు పెట్టిన భార్యాభర్తలను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారని ఒక అధికారి తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తు తర్వాత, భారతీయ సెక్షన్ 325 (ఒక మైనర్ను కొట్టిన కారణంగా) మరియు 34 (ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తిని బాధ పెట్టడం కారణంగా) ఇలాంటి పలు సెక్షన్ల కింద దంపతులను అధికారికంగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ జంటపై బాల కార్మిక (నిషేధం మరియు నియంత్రణ) చట్టం, 1986 కింద కూడా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శనివారం నాడు, కోర్టు ఫర్హానా బేగంను రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపగా, మాజీ మంత్రి అయిన తన భర్తను స్టేషన్లో పెట్టారు. అస్సాంలోని హోజాయ్ జిల్లాలో తమ 12 ఏళ్ల మైనర్ బాలికను  చిత్రహింసలకు గురిచేసిన ఆరోపణలపై అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి (85), అతని భార్య ఫర్హానా బేగం (28)లను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

దీనిపై విచారణ జరుపుతున్నామని, ఈ ఘటనలో మరొకరి ప్రమేయం ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

బాధితురాలు గత కొన్ని నెలలుగా మాజీ మంత్రి ఇంట్లో పని చేస్తుందని చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారి చంద్రధర్ భుయాన్ తెలిపారు. అయితే ఫర్హానా.. తనకు మంచి జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం బాలికను దత్తత తీసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. కానీ, దత్తతకు సంబంధించిన ఎటువంటి పత్రాలు కూడా ఆ దంపతుల దగ్గర లేవని పోలీసులు తెలిపారు. 

వీడియో గురించి బేగం మాటల్లో:

” మా పాప తన చదువుపై దృష్టి పెట్టలేదు, ఇంకా చెప్పాలంటే క్లాసెస్ కూడా కావాలనే మానేస్తుంది. తను స్కూల్లో అసలు పాటలు వినడం లేదని చాలా అశ్రద్ధగా ఉంటుందని పాఠశాల యాజమాన్యం నాకు ఫిర్యాదు చేసింది. అందుకే ఆమెను కొట్టి, కావాలనే వీడియో తీశాను’ అని ఫర్హానా పోలీసులకు తెలిపింది.

ఇదిలా ఉండగా, బేగం భర్త అయిన చౌదరి, వీడియో గురించి తనకు తెలిదని చెప్పారు. ” నిజానికి ఇది మా దురదృష్టం.. ఎవరూ అలాంటి పని చేయకూడదు,” అని అతను చెప్పాడు. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఈ ఘటనలో మరొకరి ప్రమేయం ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిని కూడా పోలీసులు విచారించనున్నట్లు ఒక అధికారి తెలిపారు

నిజానికి చిన్నపిల్లలను 15 సంవత్సరాలు కన్నా తక్కువ వయసు ఉన్న వారిని పనిలో పెట్టుకోవడం నేరం. కానీ ఆ పాపని దత్తత తీసుకోవడం ఎంతవరకు నిజం అనేది బయట పడాల్సి ఉంది. కానీ ఒకవేళ దత్తత తీసుకుంటే ఆ పాప చేత పని మనుషుల్లా పని చేయించుకోవడం నిజమా కాదా కూడా తేలాల్సి ఉంది.