ఢిల్లీలో వరదలు, పక్క రాష్ట్ర మంత్రుల విమర్శలు

ప్రస్తుతం ఢిల్లీలో యమునా నది వరద ఉధృతి అంతకంతకు ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో వరద నీరు ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటి వరకు చేరుకున్న సందర్భంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ‌ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లడానికి తనకి అభ్యంతరం లేదని, కానీ ఆరు నెలలుగా తనకి కేజ్రీవాల్ దగ్గర నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని ఉద్దేశించి మాట్లాడారు.  అసలు ఎందుకు చీఫ్ మినిస్టర్ ఇలా అన్నారు:  జూలై 13న, యమునా నీటి మట్టం […]

Share:

ప్రస్తుతం ఢిల్లీలో యమునా నది వరద ఉధృతి అంతకంతకు ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో వరద నీరు ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటి వరకు చేరుకున్న సందర్భంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ‌ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లడానికి తనకి అభ్యంతరం లేదని, కానీ ఆరు నెలలుగా తనకి కేజ్రీవాల్ దగ్గర నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని ఉద్దేశించి మాట్లాడారు. 

అసలు ఎందుకు చీఫ్ మినిస్టర్ ఇలా అన్నారు: 

జూలై 13న, యమునా నీటి మట్టం రాజధానిలోకి ప్రవేశించడం ప్రారంభించడంతో, గత 45 ఏళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన తర్వాత,  అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంతా తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితిని టీవీలో చూసిన తర్వాత తన సొంత సిటీ గౌహతిలో ఉన్న తనకి ఊరటగా అనిపిస్తుందని, అంతేకాకుండా ఢిల్లీ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి చేస్తున్న పనులు చూస్తుంటే భయం వేస్తుంది అని ఎత్తి పొడుస్తూ మాట్లాడారు.

ఈ ట్వీట్‌పై అస్సాం లో ఉంటున్న ఆప్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా శర్మ వరద సమయంలో ఢిల్లీకి వెళితే, ఇంకా మెరుగైన నిర్వహణ, పరిపాలన మరియు సహాయ కార్యకలాపాలను చేస్తారేమో అంటూ ఆప్ యూనిట్ విమర్శించారు. అయితే బిజెపి కావాలనే తమ మీద ఆరోపణలు చేస్తుందని. కావాలనే వరద నీటిని సమానంగా ఇతర రాష్ట్రాలకు పంపించకుండా, కేవలం ఢిల్లీకి పంపించి  బిజెపి తన స్వార్థ రాజకీయాల బయటపెట్టారని ఆప్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అయితే ఆప్ చేసిన విమర్శలకు తిప్పికొడుతూ, ప్రతి రాష్ట్రం ఢిల్లీ, ఇంకా చాలా రాష్ట్రాలలో పరిస్థితులు ఇదేవిధంగా. నిజానికి అస్సాం పరిస్థితిని అధ్వానంగా ఉంది. అస్సాంలోని లక్ష మందికిపైగా జనం నిరాశ్యులయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరి రాష్ట్రం మీద మరొకరు దుమ్మెత్తుపోసుకోవడం, ఒకరిని మరొకరు విమర్శించుకోవడం పద్ధతి కాదన్నారు, అస్సాం చీఫ్ మినిస్టర్.

కేజ్రీవాల్ పై మరిన్ని విమర్శలు:

ఢిల్లీలో కేజ్రివాల్ పాలనలో ఢిల్లీకి అన్యాయం జరిగిందని ఆరోపించారు గౌతమ్ గంభీర్. అంతేకాకుండా ఢిల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఢిల్లీ ముఖ్యమంత్రి కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఎత్తిచూపారు. అందుకాకుండా, ఢిల్లీకి వరదలు రావడానికి కేజ్రీవాల్ కారణం అని, ఇంఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఇలాంటి వరదలు వచ్చేవి కావు అని అన్నారు గౌతమ్ గంభీర్. ఇప్పుడు ఢిల్లీకి వరదలు వచ్చినప్పటికీ తనికి అందుకే ఆశ్చర్యంగా అనిపించట్లేదని పరోక్షంగా కేజ్రివాల్ మీద ఆరోపణలు చేశారు గౌతమ్. 

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏమంటున్నారు:

ఒకపక్క గౌతమ్ గంభీర్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తూ ఉంటే, మరోవైపు హర్యానా ప్రభుత్వం చేత బిజెపి కావాలని వరద నీటిని ఢిల్లీ వరకు మళ్ళీస్తుందని, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. కావాలనే హత్నికున్ద్  బారేజీ ద్వారా నీటిని ఢిల్లీ వైపుకి మల్లిస్తుందని, హర్యానా మీద ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. మరో పక్క కొంతమంది అధికారులు, ఢిల్లీలో వర్షాలు లేనప్పటికీ వరదలు రావడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసినట్లయితే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని మరి కొంతమంది ఆరోపిస్తున్నారు.