Ashok Gajapathi Raju: చంద్రబాబుకి నీళ్లు కూడా ఇవ్వట్లేదు అంటున్న అశోక్ గజపతిరాజు

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో రిమాండ్ కారణంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఇటీవల చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వాపోగా, మరోవైపు అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) కూడా చంద్రబాబు నాయుడుకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరైన వస్తువులు కల్పించడం లేదని, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా అందించట్లేదని, దీని కారణంగానే ఆయనది డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.  నీళ్లు కూడా ఇవ్వట్లేదు అంటున్న అశోక్ […]

Share:

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో రిమాండ్ కారణంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఇటీవల చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వాపోగా, మరోవైపు అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) కూడా చంద్రబాబు నాయుడుకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరైన వస్తువులు కల్పించడం లేదని, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా అందించట్లేదని, దీని కారణంగానే ఆయనది డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. 

నీళ్లు కూడా ఇవ్వట్లేదు అంటున్న అశోక్ గజపతిరాజు: 

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుకి సరైన వసతులు అందట్లేదని, కనీసం తాగేందుకు శుభ్రమైన మంచి నీళ్లు కూడా అందించకపోగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు వాపోయారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju). ఈ విషయానికి సంబంధించి, అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) శుక్రవారం రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. 

Read More: Chandrababu Naidu: టిడిపిని తప్పుడు ప్రచారం చేయకండి అంటున్న సజ్జల

మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, టీడీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సుజనా కృష్ణారంగారావులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ(TDP) అధినేతపై అమానవీయంగా వ్యవహరిస్తుంది అంటూ వాపోయారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేంద్ర మాజీ మంత్రి, అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిస్థితిని గమనించడం కేంద్రం బాధ్యత అని అన్నారు. రాష్ట్రం చట్టాలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు.

పలు అంశాలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించినా ప్రభుత్వంలో మార్పు రాలేదని అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju) అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP) అధికారంలోకి రాబోతోందని, ఇదంతా గుర్తుంచుకొని వైఎస్‌ఆర్‌సీ మంత్రులు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని గుర్తుచేశారు. తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం, రక్షణ కోసం టీడీపీ(TDP) ఎప్పటికీ పోరాడుతుందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) అన్నారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి వివరించిన సజ్జల: 

చంద్రబాబు(Chandrababu Naidu) ఆరోగ్య(Health) పరిస్థితి విషమించింది అని, డీహైడ్రేషన్ ప్రాబ్లం తో బాధపడుతున్నాడని,  చాలామంది కుట్రపన్నీ తన తండ్రిని కావాలనే చంపడానికి చూస్తున్నారని, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని, అంతేకాకుండా ఆయనకి ఎలర్జీ ఉన్నప్పటికీ దోమల మధ్య పడుకోబడుతున్నారని, ఇటీవల లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు లేవని సజ్జల మాట్లాడారు. 

వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం(TDP) పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని, నిజానికి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితి విషమించింది అంటూ తప్పుడు ప్రచారం చేసింది తెలుగుదేశం(TDP) అని, చంద్రబాబు నాయుడు జైలు జీవితం బానే ఉందని, నిజానికి చంద్రబాబు నాయుడు ఒక కేజీ బరువు కూడా పెరిగారని మీడియా ముందు చెప్పారు సజ్జల.చంద్రబాబు నాయుడు రిమాండ్(remand) లో ఒక కేసు(Case) విషయం మీద జైలుకు వెళ్లాడు, అంతేకానీ చంద్రబాబు నాయుడు తన అత్తారింటికి వెళ్ళలేదు.. అంటూ చంద్రబాబు(Chandrababu Naidu) జైలు జీవితం గురించి మాట్లాడారు సజ్జల. అంతేకాకుండా లాలూ ప్రసాద్, ఓం ప్రకాష్ వంటి వాళ్లు చంద్రబాబు(Chandrababu Naidu) నాయుడు కన్నా వయసులో పెద్దవారైనప్పటికీ జైలు జీవితం గడిపారని మాట్లాడారు.  

చంద్రబాబు నాయుడు కుటుంబం భయపడుతున్నట్టుగా పరిస్థితులు లేవని, ఆయనకి ఆరోగ్యం(Health) అంత బానే ఉందని, 24 గంటలు ఆరోగ్య(Health) పరిస్థితిని సంరక్షించడానికి డాక్టర్ అవైలబుల్ గా ఉంటూ ఆయన ఆరోగ్య(Health) పరిస్థితిని చూస్తున్నారని, ఆయనకి సకాలంలో ఆహారం, తాగడానికి అన్ని కూడా సదుపాయాలు కల్పిస్తున్నారని సజ్జల చంద్రబాబు నాయుడు ఆరోగ్య(Health) పరిస్థితి గురించి క్లియర్గా వివరించారు.