బీజేపీకి కటీఫ్ చెప్పిన అన్నాడీఎంకే

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. తమిళనాడులో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అయలయాన్స్) నుంచి బయటికొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బీజేపీ పార్టీ ఒక్క సారిగా కంగు తిన్నట్లయింది. బీజేపీకి కటీఫ్ చెప్పడం మాత్రమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో సారూప్యత కలిగిన పార్టీల కూటమిలో చేరతామని వారు ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా అన్నాడీఎంకే […]

Share:

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. తమిళనాడులో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అయలయాన్స్) నుంచి బయటికొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బీజేపీ పార్టీ ఒక్క సారిగా కంగు తిన్నట్లయింది. బీజేపీకి కటీఫ్ చెప్పడం మాత్రమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో సారూప్యత కలిగిన పార్టీల కూటమిలో చేరతామని వారు ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా అన్నాడీఎంకే నిర్ణయం మింగుడుపడడం లేదు. బీజేపీ జాతీయ నాయకత్వంతో అన్నాడీఎంకే ప్రతినిధి బృందం జరిపిన చర్చలు విఫలమవడంతో పొత్తుకు వారు రాం రాం చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైకి మరియు అన్నాడీఎంకే పార్టీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య అంతరాన్ని పెంచాయి. 

మైనార్టీ ఓట్లకు ముప్పు…

బీజేపీతో పొత్తులో ఉంటే రాష్ట్రంలో ఉన్న మైనార్టీ ఓట్లు మొత్తం అధికార డీఎంకే పార్టీకి గంప గుత్తగా వెళ్తున్నాయని అన్నాడీఎంకే పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకోసమే వారు బీజేపీకి కటీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో ఏర్పడిన అంతరం కూడా పొత్తు నుంచి వారిని బయటకు వచ్చేటట్లు చేసిందని టాక్ నడుస్తోంది. బీజేపీతో పొత్తులో ఉండడం వల్ల మైనార్టీల ఓట్లను సాధించలేకపోతున్నామని ఏఐడీఎంకే నాయకులు భావించి… కూటమి నుంచి బయటకివచ్చినట్లు సమాచారం. సోమవారం రోజు చెన్నైలో జరిగిన అత్యున్నత పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాది కాలంగా పార్టీపై మరియు దాని నాయకులపై బీజేపీ పార్టీ నిరంతరంగా దాడులు చేస్తోందని వాపోయారు. BJP యొక్క నిరంతర దాడులను తిప్పి కొట్టేందుకు కూటమి నుంచి బయటకు రావాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా దీని గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. #Nandri_meendumvaraatheergal (ధన్యవాదాలు, మళ్లీ తిరిగి రావద్దు) హ్యాష్‌ ట్యాగ్‌ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. కూటమి నుంచి బయటకు రావడంలో తమ తప్పు ఏం లేదని తెలిపారు. అంతే కాకుండా తాము బీజేపీతో పొత్తులో లేమని తమిళ ప్రజలకు చాటి చెప్పేలా ఈ ప్లాన్ చేశారు. 

ఏకగ్రీవ నిర్ణయం..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే పార్టీ సమీక్షలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తమిళనాట అధికారంలోకి రావాలని గట్టిగా ట్రై చేస్తోంది. బీజేపీకి చెందిన ఎన్డీఏ కూటమిలో ఉంటే మైనార్టీల ఓట్లను కోల్పోవాల్సి వస్తుందనే కారణంతోనే అన్నాడీఎంకే ఇలా చేసిందని ప్రచారం జరుగుతోంది. 

అన్నామలై వల్లే ఇలా…

బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి మద్దతు లేకపోవడం, మైనార్టీల ఓట్లు కోల్పోవాల్సి వస్తుందనే భయం మరియు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వర్గం తమ మీద దాడులు చేయడం వల్లే తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చామని అన్నాడీఎంకే నేతలు తెలుపుతున్నారు. 2019 నుంచి చూసుకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన నాల్గో అతిపెద్ద పార్టీగా అన్నాడీఎంకే నిలిచింది. అప్పటి నుంచి ఎన్డీఏ కూటమికి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. 2019లో శివసేనతో మొదలైన ఈ తొలగింపు అనేది వరుస పట్టి కొనసాగుతూనే ఉంది. శివసేన పార్టీ బీజేపీ పెద్ద మిత్రపక్షంగా ఉండేది కానీ అనుకోని కారణాల వల్ల ఆ పార్టీ కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి పార్టీలు కూటమికి గుడ్ బై చెబుతూనే ఉన్నాయి. 

నల్లచట్టాలకు వ్యతిరేఖంగా

బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాల గురించి అందరికీ తెలుసు. ఈ చట్టాల రద్దు గురించి పెద్ద రచ్చే జరిగింది. కానీ బీజేపీ పార్టీ మాత్రం మొదట ఈ చట్టాలను రద్దు చేయలేదు. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు ఉధృతం అయ్యే సరికి ఈ చట్టాలను రద్దు చేస్తూ నిర్నయం తీసుకుంది. ఈ చట్టాల వల్ల బీజేపీకి తనతో అలయన్స్ (పొత్తు) లో ఉన్న మరో పార్టీ గుడ్ బై చెప్పింది. ఎన్నో రోజుల నుంచి కలిసి ఉన్న పంజాబ్ పార్టీ శిరోమణి అకాళీదల్ బీజేపీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఆగస్టు 9 2022న బీహర్ సీఎం పార్టీ జేడీ (యూ) కూడా బీజేపీకి టాటా చెప్పింది. వరుసగా పార్టీలు ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెబుతుండడంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలనే విషయంలో ఎటూ పాలుపోవడం లేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే పార్టీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో చేరుతుందని వార్తలు వస్తున్నాయ. అన్నాడీఎంకే పార్టీ ‘ఇండియా’ కూటమిలో చేరితే మాత్రం అది బీజేపీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.