కేంద్రంలో అంతా నిరక్షరాస్యులే.. బడ్జెట్ ఆమోదంపై అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు..

బడ్జెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్లకు రూ. 500 కోట్లు కేటాయిస్తే, మౌలిక వసతుల కల్పనకు రూ. 20వేల కోట్లు కేటాయించారని.. ఈ రెండిటిలో ఏది ఎక్కువో కూడా వారికి తెలియడం లేదని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు బీజేపీలో అంతా చదువురాని నిరక్షరాస్యులే ఉన్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఆ పార్టీలో అందరూ చదువుకోనివారేనని ఆరోపించారు. ఇటీవల ప్రధాన మోడీని ఉద్దేశించి […]

Share:

బడ్జెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్లకు రూ. 500 కోట్లు కేటాయిస్తే, మౌలిక వసతుల కల్పనకు రూ. 20వేల కోట్లు కేటాయించారని.. ఈ రెండిటిలో ఏది ఎక్కువో కూడా వారికి తెలియడం లేదని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు

బీజేపీలో అంతా చదువురాని నిరక్షరాస్యులే ఉన్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఆ పార్టీలో అందరూ చదువుకోనివారేనని ఆరోపించారు. ఇటీవల ప్రధాన మోడీని ఉద్దేశించి ఈ దేశానికి చదువు వచ్చిన ప్రధాని ఉండాలని వ్యాఖ్యానించిన కేజ్రీవాలే మళ్లీ తన బీజేపీపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. కేంద్రం ఆలస్యంగా ఆమోదించడాన్ని ప్రస్తావిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని, సకాలంలో ఎందుకు ఆమోదం తెలపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. 

కేంద్రానికి అవగాహన లేమి..

కేంద్ర ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు నిరక్షరాస్యులే ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బడ్జెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్లకు రూ. 500 కోట్లు కేటాయిస్తే, మౌలిక వసతుల కల్పనకు రూ. 20, 000 కోట్లు కేటాయించారని.. ఈ రెండిటిలో ఏది ఎక్కువో కూడా వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్నవారికి కనీసం బడ్జెట్ గురించి కనీస అవగాహన కూడా లేదని ఆయన అన్నారు. 

దేనికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా?

గత మంగళవారం ప్రవేశపెట్టాల్సిన ఢిల్లీ బడ్జెట్‌కు ఆమోదం తెలపడంలో కేంద్ర హోం శాఖ ఆలస్యం చేసిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కాకపోతే బడ్జెట్‌లోని కేటాయింపులపై ప్రశ్నలు లేవనెత్తిన కేంద్ర హోమ్ శాఖ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ బడ్జెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్లకు ఎక్కువగా నిధులు కేటాయించారని, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు తక్కువ కేటాయించారని కేంద్ర హోమ్ శాఖ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. ఒక రాష్ట్ర బడ్జెట్‌ను అడ్డుకోవడం 75 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆరోపించారు. “ఢిల్లీ వాసులపైన మీకెందుకు ఇంత కక్ష సాధింపు?” అని ప్రశ్నించారు. 

అటు తిరిగి.. ఇటు తిరిగి.. అక్కడికే..

బడ్జెట్ కేటాయింపులపై కేంద్రం లేవనెత్తిన అంశాలకు ఢిల్లీ ఆర్థిక శాఖ జవాబు ఇచ్చింది. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు.‌ గత మంగళవారం బడ్జెట్‌కి ఆమోదం తెలిపింది. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేజ్రీవాల్ మొదట ఆమోదించని బడ్జెట్‌కి కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలిపింది‌. తద్వారా ఢిల్లీ ప్రభుత్వం తలవంచాలనే కేంద్రం అహం అసంతృప్తి చెందిందని తెలిపారు.

బీజేపీలో చదువురాని నిరక్షరాస్యులు ఢిల్లీ బడ్జెట్ గురించి బొబ్బలు చరుస్తున్నారని.. ఈ బడ్జెట్‌ను చదివి దీని ప్రాధాన్యతను హైలైట్ చేయగల విద్యావంతులను ఆ పార్టీ అద్దెకు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి సలహా ఇచ్చారు. రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు అంబేద్కర్ కేంద్రం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ అడ్డుకుంటుందని ఆలోచించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు రాజ్యాంగంపై దాడి జరిగిందని కేజ్రివాల్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మూడు రోజులుగా బడ్జెట్ ఫైల్ పైనే కూర్చున్నారని.. ఆయనకు ప్రతిసారి ఫోన్ చేసిన తరువాతే బడ్జెట్ ఫైల్‌కి ఆమోదం లభించిందని తెలిపారు. మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులను విడుదల చేయకుండా ఆపివేస్తోందని అరవింద్ కేజ్రివాల్ కేంద్రాన్ని దూషించారు.