Kcrనే సవాల్ చేస్తున్న ధర్మపురి అర్వింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చాలా ఘాటుగా ఉంటారు. బీజేపీ పార్టీలో ఉన్న చాలా మంది లీడర్లలో అర్వింద్ చాలా ఫైర్ మీద ఉంటారని టాక్ ఉంది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కవిత మీద పోటీ  చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్ ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే తన మీద పోటీ చేయాలని చెబుతున్నారు. కేసీఆర్ ఇక్కడ పోటీ చేయ్.. నిన్ను తప్పకుండా ఓడిస్తానని అంటున్నాడు. పోయిన […]

Share:

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చాలా ఘాటుగా ఉంటారు. బీజేపీ పార్టీలో ఉన్న చాలా మంది లీడర్లలో అర్వింద్ చాలా ఫైర్ మీద ఉంటారని టాక్ ఉంది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కవిత మీద పోటీ  చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్ ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే తన మీద పోటీ చేయాలని చెబుతున్నారు. కేసీఆర్ ఇక్కడ పోటీ చేయ్.. నిన్ను తప్పకుండా ఓడిస్తానని అంటున్నాడు. పోయిన సారి నీ కూతురును ఓడించిన ఇక్కడి ప్రజలు ఈ సారి పోటీచేస్తే నిన్ను కూడా ఓడిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. 

మీడియాతో మాట్లాడుతూ.. 

పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బీజేపీ ఎంపీ అర్వింద్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలను మీద ఆయన స్పందిస్తూ.. నేను ఇప్పుడు ఢిల్లీలో సమావేశాలతో బిజీగా ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు మా డిపాజిట్లు గల్లంతు చేసుడు కాదు ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్ ను కూడా ఓడిస్తామని అర్వింద్ అంటున్నారు. 

మద్యం షాపులకు 15 రోజులు.. మరి దీనికి 3 రోజులేనా.. 

రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్ల కోసం 15 రోజుల సమయం ఇచ్చిన కేసీఆర్ సర్కారు గృహలక్ష్మి దరఖాస్తులకు మాత్రం కేవలం 3 రోజులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఇస్తామని హామీనిచ్చిన కేసీఆర్ సర్కార్ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఎన్నికల నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. 

భూ సెటిల్‌మెంట్లు చేస్తున్నరు… 

కల్వకుంట్ల కుటుంబం భూ సెటిల్ మెంట్లు చేస్తోందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. వెలమ కుల పోలీసులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ పరిసరాల్లో సీఎం కుటుంబ సభ్యులు భూ సెటిల్ మెంట్లు చేస్తున్నారన్నారు. వీటన్నింటి మీద బీజేపీ పార్టీ ఫోకస్ చేస్తోందని ఆయన తెలిపారు. 

అతడే యాక్సిడెంటల్ ఎమ్మెల్యే.. 

తాను యాక్సిడెంటల్ గా ఎంపీని అయ్యానని అంటున్నారని తనకు 2018 ఎన్నికల్లో 75 వేల పై చిలుకు మెజార్టీ వచ్చిందని ఆయన తెలిపారు. తాను యాక్సిడెంటల్ ఎంపీని మాత్రమే కాదని ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్ తనను యాక్సిడెంటల్ ఎంపీ అని అంటున్నారని కానీ కేటీఆరే 2009 ఎన్నికల్లో 171 ఓట్ల మెజార్టీతో గెలిచారని ఆరోపించారు. యాక్సిడెంటల్ ఎమ్మెల్యే అనే ట్యాగ్ అతనికే కరెక్టుగా వర్తిస్తుందని ఆయన అన్నారు. 

సర్కారు మెడలు వంచుతాం

వచ్చే ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి తామెంటో చూపిస్తామని ఎంపీ తెలిపారు. తమ సత్తాను బీఆర్ఎస్ తక్కువగా అంచనా వేస్తోందని ఆయన అన్నారు. ఇక ఇది ఇలా ఉంటే మరోపక్క కవిత కూడా ఎంపీ అర్వింద్ కు సవాల్ చేసింది. అర్వింద్ ఈ సారి నీవు ఎక్కడ పోటీ చేస్తే నేను కూడా అక్కడే పోటీ చేస్తానని తెలిపారు. పోయిన సారి రైతులను మభ్య పెట్టి గెలిచావని ఈ సారి మాత్రం అది కుదరదని ఆమె తెలిపారు. ధర్మపురి అర్వింద్ తండ్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీలో ఇన్ యాక్టివ్ అయ్యారు. ఇక అర్వింద్ సోదరుడు కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.