Delhi: ఢిల్లీలో కృత్రిమ వర్షం..కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఐఐటీ టీమ్ ప్లాన్

Delhi: దేశరాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు(Artificial Rains) కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్‌(IIT Kanpur)ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు(Supreme Court) సమర్పించనుంది. గత 10 రోజులుగా విషపు గాలులు ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) చర్యలు చేపట్టింది. ఢిల్లీలో వాయు నాణ్యత(air quality) మళ్లీ దిగజారింది. బుధవారం వాయు […]

Share:

Delhi: దేశరాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు(Artificial Rains) కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్‌(IIT Kanpur)ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు(Supreme Court) సమర్పించనుంది.

గత 10 రోజులుగా విషపు గాలులు ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) చర్యలు చేపట్టింది. ఢిల్లీలో వాయు నాణ్యత(air quality) మళ్లీ దిగజారింది. బుధవారం వాయు నాణ్యతా సూచీ (AQI) 426కు చేరుకుంది. మంగళవారం పరిస్థితి మెరుగైనట్లు కనిపించినా.. మళ్లీ ఏక్యూఐ(AQI) తీవ్రస్థాయికి చేరుకోవడంతో డిసెంబరులో పాఠశాలలకు ఇవ్వాల్సిన సెలవులను ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి ఈ నెల 18 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది.

గతవారం రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం(Air pollution)తో సతమతమవుతోన్న ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించేలా నవంబరు 20, 21 తేదీల్లో మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం(Artificial Rains) కురిపించేందుకు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలు దగ్ధం, వాహన ఉద్గారాలు వంటి స్థానిక అంశాల కలయిక కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక(Air Quality Index) వరుసగా ఏడు రోజుల నుంచి తీవ్ర కేటగిరీలో కొనసాగుతోంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్(Gopal Roy), ఆర్థిక మంత్రి అతిషి(Finance Minister Atishi) ఐఐటీ కాన్పూర్ బృందంతో(IIT Kanpur team) సమావేశమయ్యారు. అత్యవసర వాయు కాలుష్య తీవ్రత మధ్య కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు.

ఈ నేపథ్యంలో వివరణాత్మక ప్రణాళిక సమర్పించాలని ఐఐటీ బృందాన్ని(IIT Kanpur team) ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఈ ప్రణాళికను శుక్రవారం సుప్రీంకోర్టు(Supreme Court)లో సమర్పించనున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని(Air pollution) పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. దీనికి సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి.

‘కృత్రిమ వర్షం(Artificial Rains) కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాల ఆవరణం అవసరమని ఐఐటీ బృందం(IIT team) తెలిపింది. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని.. ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే మేము ప్రయోగాత్మక అధ్యయనాన్ని నిర్వహించగలం’ అని ఓ అధికారి చెప్పారు. ‘శుక్రవారం నాటి విచారణ సమయంలో ఈ ప్రతిపాదనను కోర్టు ముందుంచి పరిశీలించమని కోరుతాం.. ఒకవేళ, న్యాయస్థానం ముందుకెళ్లమంటే కేంద్రంతో కలిసి పనిచేసి అవసరమైన అనుమతులు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు(Artificial Rains) కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్‌(Silver iodide)ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్(Cloud seeding) అని కూడా అంటారు.

కాగా, ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు ఆపి.. నియంత్రణకు చర్యలు చేపట్టాలని మండిపడింది. ఢిల్లీలో క్షీణిస్తున్న వాయు నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని సీజేఐ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్‌లో వంట వ్యర్ధాల దహనాలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు బాధ్యుల్ని చేసింది. ‘ఢిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి.. సగం సామర్ధ్యంతో నడుపుతున్న అనేక బస్సులు కలుషితం చేస్తున్నాయి.. మీరు సమస్యపై శ్రద్ధ వహించాలి’ అని ఉద్ఘాటించింది.