ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికులు వీరే

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్-జమ్మూ హైవేపైఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సైనికులు గురువారం సజీవదహనమయ్యారు. ఆర్మీ జవాన్లు పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, తక్కువ దృశ్యమానత ఉండటంతో గుర్తుతెలియని ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపారని నార్తర్న్ కమాండ్ తెలిపింది. అటు ఉగ్రవాదులు గ్రెనేడ్‌లు ప్రయోగించడం వల్ల వాహనం మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు.టెర్రరిస్ట్ ఆపరేషన్‌ల కోసం […]

Share:

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్-జమ్మూ హైవేపైఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సైనికులు గురువారం సజీవదహనమయ్యారు. ఆర్మీ జవాన్లు పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, తక్కువ దృశ్యమానత ఉండటంతో గుర్తుతెలియని ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపారని నార్తర్న్ కమాండ్ తెలిపింది. అటు ఉగ్రవాదులు గ్రెనేడ్‌లు ప్రయోగించడం వల్ల వాహనం మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు.టెర్రరిస్ట్ ఆపరేషన్‌ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు సైనిక జవాన్ సిబ్బంది దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో జవాన్‌ను వెంటనే రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు’ అని నార్తర్న్ కమాండ్ తెలిపింది. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరణించిన సైనికులు హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరిక్రిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్ లు ఉన్నారని ఆర్మి వర్గాలు వెల్లడించాయి. కాగా “వైట్‌నైట్ కార్ప్స్ మృతుల కుటుంబాలకు సంఘీభావంగా నిలుస్తాయి” అని ట్విట్టర్‌లో పేర్కొంది. బాధితులు ఆర్మీ యొక్క రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌తో జతచేయబడ్డారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం మోహరించారు.

మెుదటగా ఈ ఘటన పిడుగు పాటు వలన జరిగిందని ఆర్మి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ.. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. దీంతో ఈ దాడి వెనుక ఉగ్రవాదులు ఉన్నారని నిర్థారణకు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దాడి చేసిన ఉగ్రవాదుల కోసంసైనికులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు జైష్ మద్దతుతో కూడిన ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్) దాడి చేసినట్లు బాధ్యత వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కాగా ఆర్మీ వాహనంపై 50 రౌండ్లు గన్‌లతో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఐదుగురు ఆర్మీ జవాన్ల మృతికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా సంతాపం తెలిపారు. కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాడిని ఖండించారు. విధి నిర్వహణలో ఐదుగురు ఆర్మీ సైనికుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడి భయంకరమైన వార్త అని ఆయన ట్వీట్ చేశారు.

రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఆవేదన..

ఈ ఉగ్రదాడిపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆవేదన చెందారు. ‘జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఈ విషాదం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గతవారమే అక్కడి భద్రతపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అటు మే నెలలో జమ్ముకాశ్మీర్ వేదికగా G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.