సిక్కిం వరదలు.. పేలుడు ప‌దార్థాల‌తో నిండిపోయిన తీస్తా న‌ది

సిక్కింలో వరదలు వచ్చి ఘోర విపత్తును మిగిల్చిన సంగతి తెలిసిందే. నదికి ఆకస్మికంగా వరదలు రావడంతో సాధారణ ప్రజలతో పాటు ఆర్మీ సైనికులు కూడా వరదల్లో కొట్టుకుపోయారు. వీరిలో చాలా మంది వరకు వీరమరణం పొందారు. కేవలం సైనికులు కొట్టుకుపోవడమే కాకుండా ఆర్మీకి మరో నష్టాన్ని ఈ వరదలు మిగిల్చాయి.  కొట్టుకుపోయిన మందుగుండు సామగ్రి వరదల వల్ల మందు గుండు సామగ్రి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని ఆర్మీ తెలిపింది. ఇలా సామగ్రి కొట్టుకుపోవడంతో ఆ మందు గుండు […]

Share:

సిక్కింలో వరదలు వచ్చి ఘోర విపత్తును మిగిల్చిన సంగతి తెలిసిందే. నదికి ఆకస్మికంగా వరదలు రావడంతో సాధారణ ప్రజలతో పాటు ఆర్మీ సైనికులు కూడా వరదల్లో కొట్టుకుపోయారు. వీరిలో చాలా మంది వరకు వీరమరణం పొందారు. కేవలం సైనికులు కొట్టుకుపోవడమే కాకుండా ఆర్మీకి మరో నష్టాన్ని ఈ వరదలు మిగిల్చాయి. 

కొట్టుకుపోయిన మందుగుండు సామగ్రి

వరదల వల్ల మందు గుండు సామగ్రి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని ఆర్మీ తెలిపింది. ఇలా సామగ్రి కొట్టుకుపోవడంతో ఆ మందు గుండు పేలుగు సామగ్రి నదీ తీరం వెంబడి ఎక్కడ పడిందో అని ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక కొట్టుకుపోయిన ఆ సామగ్రిని ఇప్పుడు వెతికే పనిలో ఆర్మీ ఉంది. దీంతో ఓ టీంను ఫాం చేసి ఆ సామగ్రిని వెతకాలని ఆర్మీ నిర్ణయించింది. ఉత్తర బెంగాల్‌ లోని జల్‌ పై గురి జిల్లాకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి దీని గురించి మాట్లాడుతూ… జిల్లాలోని తీస్తా (నది) బ్యాంకులను శానిటైజ్ చేయడానికి కనీసం వారం రోజులు పడుతుందని చెప్పారు. 

పేలుడు పదార్థాలలో మోర్టార్ షెల్స్, గనులు మరియు సైన్యం ఉపయోగించే ఇతర ఆయుధాలు ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్‌ లోని కొన్ని వందల కిలోమీటర్ల పొడవున తీస్తా నది ఒడ్డున సిల్ట్ మరియు శిధిలాల కింద పూడ్చిన పేలుడు పదార్థాలను గుర్తించడానికి సైన్యం భారీ శోధన ఆపరేషన్ ప్రారంభించింది. తీస్తా నది ఒడ్డున వరద నీటి ద్వారా తీసుకువచ్చిన సిల్ట్ మరియు చెత్తలో పూడ్చిన పేలుడు పదార్థాలను గుర్తించడానికి 33 బృందాలను ఆర్మీ మోహరించింది. సైన్యం లో ఉండే బాంబ్ ఎక్స్ పర్ట్స్ తో సహా 6-7 మంది ఆర్మీ సిబ్బందితో కూడిన బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కో బృందం ఈ పేలుడు పదార్థాలను గుర్తించే పనిలో నిమగ్నం కానున్నాయి. అంతే కాకుండా ఈ ఆపరేషన్ కోసం డ్రోన్లను కూడా వాడనున్నట్లు తెలుస్తోంది.  

వరదలు.. ఉప్పెన

మంగళవారం రాత్రి ఉత్తర సిక్కింలో సరస్సు ఉప్పెన కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తర సిక్కింలో సైన్యం యొక్క మందుగుండు సామగ్రి డిపో ఆ వరదల్లో కొట్టుకుపోయింది. వరదలో పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు కూడా కొట్టుకుపోయాయి. ఈ పేలుడు పదార్థాలు సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్‌ లో ఉన్న నదీ తీరం వెంబడి ఉండి ఉంటాయని ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇందుకోసమే అనేక మందితో ఈ సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఈ నదీ  తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. ఒక వేళ ఎటువంటి మందుగుండు సామగ్రి కనిపించినా కానీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ మందు గుండు సామగ్రిని కనుక సామాన్యులు హ్యాండిల్ చేస్తే తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మందు గుండు సామగ్రి వలన ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 

మా టీంలు పని చేస్తున్నాయి… 

కొట్టుకుపోయిన మందు గుండు సామగ్రిని కనిపెట్టేందుకు మా బృందాలు పని చేస్తున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ మందు గుండు సామగ్రిని కైవసం చేసుకుంటామని వారు తెలుపుతున్నారు. ఒక్కో టీం కనీసం ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల మేర నదిని కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 100కి పైగా ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు కనుగొనబడ్డాయని, ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం ఉదయం, దక్షిణ సిక్కింలోని టెమీ టీ గార్డెన్ సమీపంలో నది ఒడ్డున ఒక పేలుడు పదార్థం కనుగొనబడినట్లు నివేదికలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని స్థానిక యంత్రాంగం కంట్రోల్ లోకి తీసుకుంది. వారు సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ఎలాంటి పేలుడు పదార్థాలు ఎంత పరిమాణంలో కొట్టుకుపోయాయనే వివరాలను మేము వెల్లడించలేమని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. 

వారం పట్టే అవకాశం ఉంది.. 

ఈ ఘటనపై ఉత్తర బెంగాల్ పోలీస్ ఆఫీస్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని తీస్తా బ్యాంకులను శానిటైజ్ చేయడానికి కనీసం వారం రోజులు పడుతుందన్నారు. పేలుడు పదార్థాలలో మోర్టార్ షెల్స్, గనులు మరియు సైన్యం ఉపయోగించే ఇతర ఆయుధాలు ఉండవచ్చునని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులను గుర్తించినట్లయితే ప్రజలు పోలీసు మరియు జిల్లా అత్యవసర నంబర్‌ లను సంప్రదించాలని సూచించారు. తీస్తా నది ఈశాన్య సిక్కింలో ఉంది. ఇదో సరస్సు నుంచి ఉద్బవించింది. ఇది బంగ్లాదేశ్‌ లోకి ప్రవేశించే ముందు సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్‌ లోని నాలుగు జిల్లాల గుండా వెళుతుంది. ఈ వరదల్లో 140 కి మందికి పైగా తప్పిపోయారు. అంతే కాకుండా ఈ వరదల్లో 14 మంది సైనికులు కూడా తప్పిపోయారని అధికారులు తెలిపారు.