కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా ఇళ్లు క‌డ‌తాం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్‌ కార్యక్రమానికి కేంద్రం నిధులు నిలిపి వేసిన పర్లేదు అని, ఇప్పుడు అమరావతిలో 50 వేల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే భరిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  నిధులు లేకపోయినా పర్లేదు ఇల్లు కడతాం:  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం అమరావతి ఇల్లు నిర్మాణాల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్‌ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపి […]

Share:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్‌ కార్యక్రమానికి కేంద్రం నిధులు నిలిపి వేసిన పర్లేదు అని, ఇప్పుడు అమరావతిలో 50 వేల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే భరిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 

నిధులు లేకపోయినా పర్లేదు ఇల్లు కడతాం: 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం అమరావతి ఇల్లు నిర్మాణాల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్‌ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపి వేసిన పర్లేదు అని, ఇప్పుడు అమరావతిలో 50 వేల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే భరిస్తుందని సజ్జల ప్రకటించారు. 

అమరావతిలోని వెంకటపాలెంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నర్‌గార్జున, హౌసింగ్‌ ఎండీ లక్ష్మీశతో కలిసి రామకృష్ణారెడ్డి అమరావతిలోని వెంకటపాలెంలో, సోమవారం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. 

పేదల కోసం ఇల్లు: 

పేదలకు అన్ని సౌకర్యాలతో నిర్మించే ఇళ్లు ప్రైవేట్ లేఅవుట్‌లతో సమానంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణం వల్ల అమరావతిలో పేదలకు ఆసరా నివాసాలు కల్పించడమే కాకుండా, 10,000 కోట్ల సంచిత సంపద ఏర్పడుతుందని ఆయన ప్రత్యేకించి మాట్లాడారు.

ఇళ్ల నిర్మాణంపై వ్యతిరేకతపై దృష్టి సారించిన ఆయన, ప్రతిపక్షాలు చేస్తున్న వాక్యాలను పక్కనపెట్టి, అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించడం నేరమా? అంటూ ప్రశ్నించారు. అమరావతిలో సేకరించిన భూమిలో ఐదు శాతం పేదలకు ఇవ్వాలని సీఆర్‌డీఏ చట్టం చెబుతోందని ఆయన గుర్తు చేశారు. 

పేదల కోసం ఎన్నో చేస్తున్న వైఎస్ఆర్ సీపీ: 

అయితే జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం జరిగింది. అంతేకాకుండా, చిన్న చిన్న పనులు కూడా దొరకని సమయంలో ఖాళీగా ఉండకుండా యువత కోసం వాలంటీర్ సిస్టం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉండి తమ పని తాము చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి పెన్షన్ సిస్టం ఏర్పాటు చేసి నేరుగా వ్యక్తుల దగ్గరికి వాలంటీర్లు డబ్బులు తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఎంతోమంది యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పించారు. ప్రస్తుతం అమరావతిలో పేదల కోసం నిర్మిస్తున్న 50 వేల ఇళ్ళు సక్రమంగా పూర్తి అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పేదవాడి కోసం ఇలా, ఎంతో కొంత చేస్తే, కనీసం కొంతమంది అయినా చక్కని ఇంట్లో సంతోషంగా జీవనాన్ని గడుపవచ్చు. 

అంతేకాకుండా తెలుగు మీడియం స్కూల్లో కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్పించేలా ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అమెరికన్లకు మించిపోయి ఇంగ్లీషులో మాట్లాడి అదరగొట్టారు. ప్రతిపక్షాల నుంచి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా స్కూల్లో పెట్టిన ఇంగ్లీషు విద్య గురించి విమర్శలు వినిపించినప్పటికీ, వాటన్నిటిని పక్కన పెట్టి విద్యార్థులు తమ ప్రతిభతో, ఇంగ్లీషులో అబ్బురపరిచేలా మాట్లాడి, ప్రభుత్వం చేసిన గొప్ప విషయాన్ని చాటి చెప్పారు. వివిధ దేశాల నుంచి కూడా ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యార్థులు ఇటువంటి ఘనత సాధించడానికి గల కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని పొగుడుతున్నారు.